Uttar Pradesh Politics

20:05 - April 16, 2018

ఉత్తరప్రదేశ్ : యూపీకి చెందిన బిజెపి ఎంపి, సాధువు సాక్షి మహారాజ్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. లక్నోలో ఓ బార్‌ అండ్‌ నైట్‌ క్లబ్‌ను ప్రారంభించడం వివాదస్పదమైంది. యూపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మేనల్లుడు అలీగంజ్‌లో ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌కు ఉన్నావ్‌ ఎంపి సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించారు. సాక్షి మహారాజ్ రిబ్బన్‌ కట్‌ చేసి నైట్‌ క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు బహూకరించిన గణేషుడి ప్రతిమతో వెనుదిరిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సాధువై ఉండి బార్‌ను ప్రారంభించడమేంటని విమర్శలు వెల్లువెత్తడంతో సాక్షి మహారాజ్‌ స్పందించారు. అది బార్‌ అన్న విషయం తనకు తెలియదని, తప్పుడు సమాచారంతో తనని మోసం చేశారని చెప్పారు. తన గౌరవానికి భంగం కలిగించిన మహేంద్రనాథ్‌ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపి వెల్లడించారు.  

 

12:44 - January 2, 2017

ఉత్తర్ ప్రదేశ్ : తండ్రీకొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ల మధ్య ఏర్పడిన వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. పార్టీ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌ గ్రూపులు పోరాడుతున్నాయి. సైకిల్‌ గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరుతూ ఇరు వర్గాలు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సతమతమవుతున్న ఎస్పీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి, తనయుని మధ్య తగాదాలు తారా స్థాయికి చేరి, ఒకవర్గం నేతలను మరో వర్గం బహిష్కరించుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ కాస్తా సమాజ్‌ వార్‌ పార్టీగా మారింది.

ఎస్పీలో సైకిల్‌ గుర్తు కోసం రగడ
ఎస్పీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకోవడంతో ఎన్నికల కమిషన్ ముందే అమీతుమీకి ఇటు అఖిలేష్, అటు ములాయం సింగ్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. అఖిలేష్-రామ్‌గోపాల్ మద్దతుదారులు ఒకవైపు, ములాయం - శివలాల్ యాదవ్ వర్గీయులు మరోవైపు ఈసీ ముందు తమ వాదన వినిపించనున్నట్టు తెలుస్తోంది. రామ్‌గోపాల్ యాదవ్ ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ములాయం సింగ్ స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్ యాదవ్‌ను తొలగిస్తూ మరో తీర్మానం చేయడం సంచలనమైంది. దీంతో భగ్గుమన్న ములాయం సింగ్ యాదవ్...రామ్‌గోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం రాజ్యాంగవిరుద్ధమని, అందులో తీసుకున్న నిర్ణయాలు చెల్లవంటూ ప్రకటించారు. అఖిలేష్ విధేయులుగా ఉంటూ సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలైన కిరణ్మయి నందా, నరేష్ అగర్వాల్‌పై కూడా వేటు వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందుకు చేరబోతోంది. పార్టీలోని పరిణామాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈసీ ముందుంచి...రాబోయే ఎన్నికల పార్టీ సింబల్ తమకే కేటాయించాలని రెండు వర్గాలు ఎన్నికల సంఘాన్ని కలుస్తాయని తెలుస్తోంది.

ఈ నెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశం..
ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నికైనందున పార్టీ గుర్తు తమదేనని అఖిలేష్ వర్గాలు, అసలు సమావేశమే రాజ్యాంగ విరుద్ధమైనందున పార్టీ నుంచి పలువురిని బహిష్కరించినట్టు వివరించడం ద్వారా ఎన్నికల గుర్తును క్లెయిమ్ చేయాలని ములాయం వర్గాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా తమతమ అనుచరణగణంతో విస్తృత మంతనాలు సాగిస్తున్నాయి. మరోవైపు అఖిలేష్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఈనెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదం తెలిపారు. మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తంగా ఇరు వర్గాలు పార్టీ గుర్తు సొంతం చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.

21:25 - January 1, 2017

ఉత్తరప్రదేశ్‌ : అధికార సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తండ్రి ములాయంసింగ్‌, తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌ల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోయానుకుంటున్న తరుణంలో మళ్లీ రాజుకుని, తారా స్థాయికి చేరుకున్నాయి. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ స్థాయి సమావేశంలో అఖిలేశ్‌ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి శివపాల్‌ యాదవ్‌ను తప్పించారు. సంక్షోభానికి కారకుడుగా భావిస్తున్న అమర్‌సింగ్‌ను కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఈ నిర్ణయాలను ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. అఖిలేశ్‌ యాదవ్‌ను వెనక నుంచి నడిపిస్తున్న రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ములాయంసింగ్‌ యాదవ్‌ మరోసారి ప్రకటించారు.

అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సమాజ్ వాద్ పార్టీ
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సతమతమవుతున్న ఎస్పీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి, తనయుని మధ్య తగాదాలు తారా స్థాయికి చేరి, ఒకవర్గం నేతలను మరో వర్గం బహిష్కరించుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ కాస్తా సమాజ్‌ వార్‌ పార్టీగా మారింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివపాల్‌ యాదవ్‌ తొలగింపు
లక్నోలో జరిగిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరైన ఈ భేటీలో అఖిలేశ్‌ను పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంసింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను తొలగించారు. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రకటించారు. అయితే ములాయంసింగ్‌ మార్గ నిర్దేశంలోనే పార్టీ నడుస్తుందని రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రకటించడం కొసమెరుపుగా భావిస్తున్నారు.

పార్టీని భ్రష్టుపట్టించే కుట్రదారులకు వ్యతిరేకం : -అఖిలేష్‌
చకచకా జరిగిపోయిన రాజకీయ పరిణామాల్లో పార్టీలో తన తండ్రికి ఇచ్చే గౌరవం మరే ఇతర నేతలకు ఇవ్వబోమని అఖిలేష్‌ తేల్చి చెప్పారు. పార్టీని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కుట్రదారులకు మాత్రమే తాను వ్యతిరేకినని ప్రకటించి, పార్టీ జాతీయ సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కుట్రదారుల నుంచి పార్టీని కాపాడే బాధ్యతల్లో భాగంగానే పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించి, అందరి నిర్ణయం మేరకు సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు చేపట్టినట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ విజయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిని నివారించేందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాయని చెప్పుకొచ్చారు.

జాతీయ సమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం : -ములాయం
మరోవైపు అఖిలేష్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్న వాదాన్ని లేవనెత్తారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. తనయుడుతో వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ను ఆరేళ్ల పాటు బహిష్కరించారు. తనను అవమానించడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు పార్టీలోని ఒకవర్గం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే లక్నో సమావేశమన్న వాదాన్ని వినిపించారు. ఈనెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదం తెలిపారు. మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. క్షణక్షణం మారుతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

16:28 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. లక్నోలో ఈరోజు పార్టీ జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ , పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. జాతీయస్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వెళ్లొద్దని ఆయన లేఖ రాశారు. అయితే ములాయం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ..శివపాల్‌సింగ్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధినేత ములాయం సింగ్‌ను సంప్రదించకుండా శివపాల్‌ యాదవ్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావడం శివపాల్‌కు ఇష్టంలేదన్నారు. అఖిలేశ్‌ జాతీయ అధ్యక్షుడు కావాలని జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అయితే రాంగోపాల్‌ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశంపై గుర్రుగా ఉన్న శివపాల్‌ యాదవ్‌..కాసేపటి క్రితమే ములాయంసింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు, తాజా పరిణాలపై ములాయంతో చర్చిస్తున్నారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేతతో ఎస్పీలో పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పించిన తరుణంలో తాజా పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

14:55 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. లక్నోలో ఈరోజు పార్టీ జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ , పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. జాతీయస్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వెళ్లొద్దని ఆయన లేఖ రాశారు. అయితే ములాయం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ..శివపాల్‌సింగ్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధినేత ములాయం సింగ్‌ను సంప్రదించకుండా శివపాల్‌ యాదవ్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావడం శివపాల్‌కు ఇష్టంలేదన్నారు. అఖిలేశ్‌ జాతీయ అధ్యక్షుడు కావాలని జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అయితే రాంగోపాల్‌ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశంపై గుర్రుగా ఉన్న శివపాల్‌ యాదవ్‌..కాసేపటి క్రితమే ములాయంసింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు, తాజా పరిణాలపై ములాయంతో చర్చిస్తున్నారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేతతో ఎస్పీలో పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పించిన తరుణంలో తాజా పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

09:42 - December 31, 2016

ఉత్తరప్రదేశ్ : ములాయం ఇంట్లో ముసలం అంతకంతకు ముదురుతోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అఖిలేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌పై వేటు వేయడంతో.. యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీంతో తండ్రీకొడుకులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అనుచరులతో సీఎం అఖిలేష్‌ భేటీ అయి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. లక్నోలోని సీఎం నివాసానికి క్యూ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. మరోవైపు కొత్త సీఎంను ఎంపికచేసే పనిలో ఎస్పీ చీఫ్‌ ములాయం బిజీగా ఉన్నారు. ఉదయం 11.30 గం.లకు ములాయం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ములాయం స్వగ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు. అఖిలేష్‌ను బహిష్కరించడంతో పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చేటుచేసుకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

Don't Miss

Subscribe to RSS - Uttar Pradesh Politics