v hanumantha rao

20:05 - March 2, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సీటును అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువు సంతోష్‌కు రాజ్యసభ సీటు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. టీఆర్ ఎస్, బీజేపీ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతోందన్న వీహెచ్.. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఓ పెద్ద డ్రామా అన్నారు. 

 

06:47 - February 14, 2018

హైదరాబాద్ : జనాభాలో 50శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వీహెచ్‌. ప్రస్తుతం 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నా..వాటిలో బీసీలకు చేరేది మాత్రం 9శాతంగా మాత్రమే ఉందన్నారు. అత్యంత వెనుకపడిన కులాలు అంటూ బీసీలకు సీఎం కేసీఆర్‌ మరింత అన్యాయం చేస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. క్రీమిలేయర్‌ నిబంధనలతో బీసీల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ప్రధాని మోదీ బీసీలపై ఉన్న క్రీమిలేయర్‌ నిబంధనలు ఎత్తివేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

 

15:10 - February 10, 2018

హైదరాబాద్ : నగరంలో కార్పొరేటర్స్ ఉత్సవ విగ్రహాలుగా మారారని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్లు వేసే వారు...ప్రజా సమస్యలు పట్టించుకోకుండా..మౌలిక వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ చేసింది శూన్యమని, మంత్రి కేటీఆర్ గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. 

18:12 - February 2, 2018

సంగారెడ్డి : సింగూర్‌ జలాశయం నుండి మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. యాసంగికి కాలువ ద్వారా ఆయకట్టు చివరి ప్రాంతాల వివరాలను సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ట్రయల్‌ రన్‌ అనంతరం తాగునీటిని ప్రతి ఇంటికి చేరేలా చేస్తామన్నారు.

16:23 - February 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఇప్పకటి దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాజస్థాన్ లో కాంగ్రెస్ రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. 

17:31 - December 30, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారని, గొల్ల కురుమ శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ ప్రగల్బాలు పలికారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నేడు ఆ మాటే మరిచిపోయారని, ఆయన సొంత నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎవరికి డబ్బులు ఇస్తే వారికి అవార్డులు ఇస్తారని..మంత్రి కేటీఆర్ కు అవార్డులు రావడంలో గొప్పతనం లేదని ఎద్దేవా చేశారు. 

18:54 - December 7, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో సీఎం ఓట్ల రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. కేసీఆర్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.  కేసీఆర్ క్రిమిలేయర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఒక్క శాతం ఉన్న సీఎం సామాజిక వర్గానికి ఐదు మంత్రి పదవులిచ్చారని చెప్పారు.

 

17:31 - December 2, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక నామమాత్రమే అంటూ మహారాష్ట్ర పీసీపీ కార్యదర్శి షెహజాద్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపి వీ.హనుమంతరావు ఖండించారు. అధ్యక్ష పదవి ఎన్నికపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు ధైర్యముంటే నామినేషన్ వేసి మాట్లాడాలని సూచించారు. కొందరు కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నారన్న వీహెచ్.. రాహుల్ కుటుంబానికి.. ఇతర కుటుంబాలకు చాలా వ్యత్యాసముందన్నారు. 

21:35 - December 1, 2017

హైదరాబాద్ : జీఈఎస్ నిర్వహణ ద్వారా కేసీఆర్ సాధించిందేంటో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు పబ్లిసిటీ కల్పించడం కోసమే హడావిడి చేశారని ఆరోపించారు. రాష్ట్రం పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాపై భారం మోపారని టీకాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సులో చూపించినవేమీ నిజాలు కావని వీహెచ్ ఏకంగా ఇవాంక ట్రంప్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సు మొత్తం కేటీఆర్ షోగా మారిందని ఎద్దేవా చేశారు. ఇవాంక రావడం వల్ల తెలంగాణకు ఒరిగిన ప్రయోజనమేంటని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోట్లాది రూపాయలు వృధా చేసిన కేసీఆర్.. సమ్మిట్ మొత్తం తన కుమారుడు కేటీఆర్‌కు పబ్లిసిటీ కోసం వాడుకున్నారని ఆరోపించారు.

జీఈఎస్ నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజల పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాను నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన వాటిని తామే చేశామని గొప్పలు చెప్పుకునేందుకు సదస్సును వాడుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్‌ అన్నీతానై వ్యవహరించారని వీహెచ్ మండిపడ్డారు. సదస్సులో చూపించినవేవీ నిజాలు కావని ఇవాంక ట్రంప్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. మహిళా సాధికారికత పేరుతో సదస్సు నిర్వహించిన రాష్ట్రంలో.. ఒక్క మహిళా మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రారంభానికి కనీస ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నగరంలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. 

18:49 - December 1, 2017

హైదరాబాద్ : జీఈ సదస్సు నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై వీ హన్మంతరావు విరుచుకుపడ్డారు. సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్‌ అన్నితానై వ్యవహరించారని ఆరోపించారు. సదస్సులో చూపించనవేవీ నిజాలు కావని ఇవాంక ట్రంప్‌కు లేక రాసినట్లు చెప్పారు. మహిళా సాధికారత పేరుతో సదస్సు నిర్వహించిన రాష్ట్రంలో.. ఒక్క మహిళా మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - v hanumantha rao