venkatesh

11:43 - February 28, 2018

తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించే పనిలో పడ్డాడు ఈ స్టార్ హీరో కొడుకు. తాను సెలెక్ట్ చేసుకునే స్టోరీ లో లోపం ఉందో మరి తన డైరెక్టర్స్ ఛాయస్ లో లోపం ఉందో కానీ ప్రొపెర్ హిట్ లేక కష్టపడుతున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్నవాళ్లు ఈ మధ్య సినిమాల విషయం లో ఫోకస్డ్ గా ఉంటున్నారు. అప్ డేట్ అవుతున్న టాలెంట్ తో పాటు ట్రావెల్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు యంగ్ హీరోస్. ఈ యంగ్ హీరోస్ జాబితాలో అక్కినేని అఖిల్ కూడా ఒకడు. 'అఖిల్ అక్కినేని' ఈ పేరు ఫస్ట్ సినిమా అఖిల్ నుండి బాగా పబ్లిసిటీ అయింది. నట వారసత్వంతో వచ్చిన ఈ యంగ్ హీరో ఒక్క పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

'హలో' అంటూ తన ప్రీవియస్ సినిమాతో పలకరించిన 'అఖిల్' కి అదిరిపోయే హిట్ మాత్రం పడలేదు అనే టాక్ ఉంది. తన రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంత మేరకు పలకరించాయో పక్కన పెడితే ఇప్పుడు అఖిల్ కి ఒక హిట్ అయ్యే సినిమా కావాలి. అందుకోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కాంటాక్ట్స్ జరుగుతున్నాయట. 'తొలిప్రేమ' సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకీ అట్లూరి. మరి వెంకీ అఖిల్ కి హిట్ ఇస్తాడా లేదా చూడాలి.

13:27 - November 22, 2017

1980 నటులు అందరు ఒకే చోట ఉంటే వారి చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో కానీ చూడక తప్పదు. 80ల నాటి సౌత్ ఇండియా స్టార్స్ అంత ఒకేచోటికి చేరారు. ఆ నాటి హీరోయిన్లు అందరు ప్రతి ఏడాది గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ సరి జరిగిన గెట్ టూ గెదర్ లో మెగా స్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్ తో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, సురేష్, బాగ్యరాజు పాల్గొన్నారు. హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ, తదితరులు పాల్గొన్నారు. ఈ గెట్ టూ గెదర్ లో తెలుగు, తమిళం, మలయాళ, కన్నట చెందిన 28 మంది నటులు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రామ్ ఈనెల 17న చెన్నైలోని మహాబలిపురం ఉన్న ఓ రిసార్ట్ లో జరిగింది. దీన్ని సుహాసిని మణిరత్నం, లిస్సీ లక్ష్మీ ఆర్గనైజ్ చేశారు.

11:14 - October 12, 2017

టాలీవుడ్ లో రీమెక్ ల హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలపై వెంకీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తెలుగులో తీసినా మంచి విజయాన్నే నమోదు చేస్తుంటాయి. ఇటీవలే వచ్చిన 'గురు' కూడా ఆ కోవకి చెందిందే. ఈ చిత్రం అనంతరం 'వెంకటేష్' ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. తాజాగా 'తేజ' దర్శకత్వంలో 'వెంకీ' నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

వెంకీ – తేజ‌ కాంబినేషన్ ఓకే అయిపోయింద‌ని, ఈ సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఉంటుంద‌ని టాక్‌. ఇదివరకే వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాల్సింది. కానీ తేజ ఫామ్ లో లేకపోవడంతో వెంకీ ధైర్యం చేయలేదని తెలుస్తోంది. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది. దీనితో మళ్లీ ఫాంలోకి వచ్చిన 'తేజ'తో సినిమా చేయాలని వెంకటేష్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నాడని, రెండు భిన్న భావాలున్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:06 - September 23, 2017

ఒక చిన్న సినిమా అతి పెద్ద విజయం సాధించింది. ఒక సినిమా ఆడటానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని నిరూపించింది. ప్రతి భాషలో కథ గెలిచింది. కథలో ఉన్న బలం సినిమాని ప్రతి ఆడియన్ కి దగ్గర చేసాయి. వినూత్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'దృశ్యం' సినిమా నిరూపించింది. మోహన్ లాల్ హీరోగా 2013లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రూ.50 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా చరిత్ర పుటలకెక్కింది. అంతే కాకుండా చాలా స్క్రీన్లలో 150 కన్నా ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెలుగు - తమిళ - కన్నడ - హిందీ భాషల్లోకి కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ హీరోగా ఈ 'దృశ్యం' సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఈ చిత్రం మరో ఘనత దక్కించుకుంది. ఈ సినిమా చైనీస్ లో రీమేక్ కాబోతోంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా 'దృశ్యం' కావడం విశేషం. ఈ చిత్ర రీమేక్ హక్కులను ఓ చైనా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ఈ విధంగా చైనా కంపెనీ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మొట్ట మొదటి భారతీయ సినిమా ఇదేనని జోసెఫ్ చెప్పారు. ఏది ఏమైనా కథ ఉంటేనే సినిమా అని నిరూపించింది ఈ 'దృశ్యం' సినిమా.

14:56 - July 3, 2017

టాలీవుడ్ నటుడు విక్టరీ 'వెంకటేష్' కు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ 'వెంకీ' ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ‘గురు' చిత్రం అనంతరం ఆయన ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. వేసవి సెలవుల నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్లినట్లు టాక్ వినిపించింది. అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం ఆయన పలు కథలను విన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని 'వెంకటేష్' యోచిస్తున్నట్లు ఎప్పటి నుండో ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' ప్రియురాలు 'లులియా వాంటర్' తో కారులో 'వెంకటేష్' వెళుతున్న ఫొటో హల్ చల్ చేస్తోంది. ‘సల్మాన్ ఖాన్’..’వెంకటేష్’ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఓ పార్టీలో పాల్గొనేందుకు 'వెంకీ' వెళ్లారని తెలుస్తోంది. అందులో భాగంగా సల్మాన్..లులియాలతో 'వెంకటేష్' చర్చలు జరిపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం 'వెంకటేష్' నోరు విప్పలేదని తెలుస్తోంది. మరి 'వెంకటేష్' బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలిసిపోనుంది.

11:34 - June 21, 2017

పవన్ కళ్యాణ్...వెంకటేష్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందా ? గతంలో వీరి కాంబినేషన్ లో 'గోపాల గోపాల' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ లో నటించగా 'పవన్ కళ్యాణ్' ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఆ సినిమాలో మొత్తం 'పవన్' పాత్ర హైలెట్ గా ఉంటుంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్'..’పవన్ కళ్యాణ్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు మొదలై షూటింగ్ ను కూడా ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు 'వెంకటేష్'ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని..కీలక ములుపు తిరిగే చోట 'వెంకటేష్' ఎంట్రీ ఉండబోతోందని టాక్. ఈ పాత్ర చేసేందుకు 'వెంకటేష్‌' వెంటనే గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశాడట. 'పవన్' సరసన 'కీర్తి సురేష్‌’, 'అను ఇమ్మానుయేల్‌' హీరోయిన్లుగా నటిస్తున్నారు.

11:06 - May 17, 2017

విక్టరీ వెంకటేష్...భిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానుల అలరిస్తున్నాడు. ఇతర భాషల్లో మంచి పేరొందిన చిత్రాల రీమెక్ ల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'గురు' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఏ సినిమాకు 'వెంకటేష్' సైన్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ - ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మలయాళం..బాలీవుడ్ సినిమాల దర్శకుడైన ప్రియదర్శన్ చాలా విరామం తరువాత తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తారని, జాలీ ఎల్ ఎల్ బీ -2 సినిమాలో వెంకీ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రాలపై మాత్రం స్పష్టత రాలేదు. వెంకటేష్‌తో దర్శకుడు ప్రియదర్శన్‌ చర్చలు జరుపుతున్నట్లు, ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టోరీ లైన్‌ వెంకీకి చెబితే గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

09:01 - April 6, 2017

విక్టరీ 'వెంకటేష్' నటించిన 'గురు' చిత్రంపై మంచి టాక్ వినిపిస్తోంది. క్రీడాంశ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. హిందీలో వచ్చిన 'సాలా ఖడూస్'ని తెలుగులో రీమెక్ చేశారు. ఈ సినిమాలో 'వెంకీ' బాక్సింగ్ కోచ్ కనిపించారు. సుధా కొంగర కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హావా కొనసాగుతోందని తెలుస్తోంది. ఇప్పుడీ ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ హీరో మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ‘వెంకీ'ని పక్కన పెట్టి 'రానా'ను తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ స్టోరీని రానాకు సుధా వినిపించారని..కథ నచ్చడంతో దానికి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో 'రానా' నటిస్తున్నాడు. మరోవైపు బాహుబలి-2 విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సుధా కొంగరతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్.

12:35 - March 28, 2017

విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 'సాలఖడూస్' అనే సినిమాకి రీమేక్. సుధా కొంగర డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరో 'వెంకటేష్' ఒక పాట కూడా పాడాడు. ఆ పాట ఆల్రెడీ జనాల్లోకి గట్టిగ వెళ్ళిపోయింది. విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. 'రితిక సింగ్' శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం 'గురు'వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.శ‌శికాంత్ నిర్మించారు. 'గురు' చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ తమిళంలో, హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం కావడం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కి మరో కారణం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది 'గురు' చిత్రం. హీరో 'వెంకీ' కి సినిమా సెలక్షన్ మీద కమెండ్ వచ్చింది. తన పెర్సనాలిటీకి ఎలాంటి రోల్స్ సూట్ అవుతాయి అన్న విషయాన్నీ తెలుసుకున్నాడు. అలా అని మరీ ప్రయోగాలు కూడా చెయ్యట్లేదు. సినిమాలో కంటెంట్ ఉంటె చాలు పాత్ర జనాల్లోకి వెళ్తుంది అనుకున్నాడేమో 'వెంకీ' 'గురు'తో రాబోతున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా మార్చి 31నే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఈ సినిమా మీద ఏ మాత్రం ఇంటరెస్ట్ తగ్గకుండా 'గురు' మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. మరి 'గురు' అలరిస్తాడా లేడా అన్నది చూడాలి.

13:03 - February 26, 2017

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కి అనుకున్న టైటిల్ కి యంగ్ హీరో ఫిక్స్ అయిపోయాడు.ఈ టైటిల్ తో స్టార్ట్ చెయ్యాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. వెంకటేష్ కూడా కధ విషయం లో వివాదాలు రావడంతో 'రాధా' సినిమాని చెయ్యట్లేదు అని సమాచారం. గతంలో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్ చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ శర్వానంద్ కి నచ్చిందట. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్ళలో ఈ కధలో ఉన్నాయట. ఈ సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని గట్టి నమ్మకం మీద ఉన్నారు డైరెక్టర్. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో శర్వానంద్. ఇటీవలే 'శతమానం భవతి' తో భారీ హిట్ అందుకున్న శర్వా తాజాగా ''రాధా '' గా రాబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు పలు విభిన్నమైన పాత్రలు పోషించాడు శర్వానంద్. అయితే ఈ మధ్య వరుసగా లవర్ బాయ్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త కోణంలో కనిపించనున్నాడట శర్వా. సైలెంట్ గా హిట్స్ కొడుతున్న హీరో శర్వానంద్ సినిమా సెలక్షన్ లో చాలా జాగర్త పడుతున్నాడు. సేఫ్ సైడ్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటూ నాని ని ఫాలో అవుతున్నాడు. ఈ 'రాధ' అనే సినిమా లో 'శర్వ' సరసన 'లావణ్యా త్రిపాఠి' హీరోయిన్ గా చేయబోతుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - venkatesh