vh

18:49 - April 13, 2018

హైదరాబాద్ : సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలను బేస్ చేసుకొని తమపై తప్పుడు వార్తలు రాయడం అనైతికమన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు. వార్తలు రాసేముందు నిజమేంటో తెలుసుకోవాలన్నారు. పార్టీలో ఒకరిపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు వేయడం పార్టీకే నష్టమన్నారు. ఈ కరపత్రాలపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని, కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వీహెచ్‌ తెలిపారు. 

18:12 - February 2, 2018

సంగారెడ్డి : సింగూర్‌ జలాశయం నుండి మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. యాసంగికి కాలువ ద్వారా ఆయకట్టు చివరి ప్రాంతాల వివరాలను సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ట్రయల్‌ రన్‌ అనంతరం తాగునీటిని ప్రతి ఇంటికి చేరేలా చేస్తామన్నారు.

16:23 - February 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఇప్పకటి దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాజస్థాన్ లో కాంగ్రెస్ రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. 

17:59 - October 14, 2017

హైదరాబాద్ : ఫార్మాసీటీ పేరుతో ప్రభుత్వం పేద‌ల భూముల‌ను లాక్కుంటోంద‌ని కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వపు బ‌ల‌వంత భూసేక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు. త్వరలో రాహుల్‌ గాంధీని ఫార్మాసిటీకి తీసుకొస్తామన్నారు. ఫార్మాసిటీతో కాలుష్యం ఉండ‌ద‌ని చెబుతున్న కేటీఆర్... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఫార్మా కంపెనీని ఏర్పాటు అనుమ‌తిస్తారా అని వీహెచ్ ప్రశ్నించారు. 

 

21:28 - October 7, 2017

హైదరాబాద్ : నిజాం కాలం నాటి నియంతృత్వ థోరణులు మళ్లీ పునరావృతమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. . హైదరాబాద్‌ ఎస్వీకేలో మఖ్దూమ్‌ మోహినుద్దీన్‌ జీవితం-కవిత్వం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన.. పాలకులను ప్రశ్నించేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

13:50 - September 10, 2017

హైదరాబాద్ : నేరెళ్ల బాధితుల్ని రాత్రి వేళ ఆసుపత్రి నుంచి గెంటేయడం దారుణమన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను ఆసుపత్రి అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు.  కేసీఆర్ ఏది చెప్తే అది చేసేస్తారా? అంటూ నిమ్స్‌  అధికారుల్ని వీహెచ్ ప్రశ్నించారు. నిమ్స్ సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యంపై సిరిసిల్లలో ఈనెల 15 నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

 

13:48 - September 10, 2017
15:13 - August 23, 2017

ప్రముఖ దర్శకుడు, ఎపుడూ వివాదాల్లో వుంటూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావుపై కామెడీ చేశాడు. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ నడుస్తున్న 'అర్జున్‌ రెడ్డి' సినిమా పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని.. ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండకు సూచించారు. అంత అందమైన అమ్మాయి తనను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదని వీహెచ్‌ ఈర్ష్యపడుతున్నారా? అన్న వర్మ.. తాతయ్య వయస్సులో చిన్నపిల్లల చేష్టలేంటని ప్రశ్నించారు. అర్జున్‌ రెడ్డి… పోస్టర్‌లో తప్పేముందని మునవళ్లు, మనవరాళ్లు వీహెచ్ తాతయ్యను అడగాలంటూ సూచించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన వీహెచ్‌కు ఇలాంటివి ఎలా తెలుస్తాయన్న వర్మ.. మైండ్ సెంట్ మార్చుకోవాలని హితువు పలికారు. తాతయ్య వీహెచ్.. డబుల్ తాతయ్య అయిన అతడి పార్టీకి ఇప్పటి మనవళ్లు, మనవరాళ్లు ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు'. అసభ్యకరంగా ఉందంటూ ఓ బస్సుకు అతికించిన అర్జున్‌ రెడ్డి సినిమా పోస్టర్‌ను హనుమంతరావు చించేసిన విషయం తెలిసిందే. వీహెచ్‌ పోస్టర్‌ చింపేస్తున్న ఫొటో వైరల్‌ అవడంతో పోస్టర్‌లోని నటుడు విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘చిల్‌ తాతయ్యా’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్టర్ చించుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ కామెంట్లపై వీహెచ్‌ ఎలా స్పందిస్తారో.....

22:05 - August 11, 2017
06:37 - August 11, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి ఘటనపై ఐక్య పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. నేరెళ్ల ఘటనపై గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ ఫిర్యాదు చేయడంతోపాటు తెలంగాణలో గ్రామ స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై పాదయాత్ర చేయాలని ప్రతిపాదించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు విపక్షాలు ఉమ్మడిగా వ్యూహరచన చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసులు చూపిన ప్రతాపం ఘటన రాజకీయంగా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు ఇప్పుడు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. నేరెళ్ల ఘటనపై హైదరాబాద్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను విపక్ష నేతలు తిలకించారు. ఆ తర్వాత జరిగిన రౌండ్‌ లేబుల్‌ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. నేరెళ్ల ఘటనపై ఈనెల 15న ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేదర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఈనెల 22న రాష్ట్రపతిని కలిసిన వినపతి పత్రం అందించాలని ప్రతిపాదించారు.

నేతల స్పందన..
నేరెళ్ల ఘటనకు ఇసుక మాఫీయానే కారణమని ఆరోపించిన టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌... ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నేరెళ్ల ఘటనతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నా 1989లో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ ఓటమితప్పలేదన్న విషయాన్ని టీ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిచస్తున్నదళిత వ్యతిరేక విధానాలే సర్కారుకు ముప్పు తప్పదని తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి హెచ్చరించారు.

మొత్తం మీద నేరెళ్ల ఘటనతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తన్న విపక్షాలు.. దీనిని అన్ని విధాల తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - vh