Vh Speech

21:24 - August 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పైసల పిచ్చి పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. సీఎంకు కల్చర్ లేదన్న ఆయన.. వేల కోట్ల రూపాయలు ఏంచేసుకుంటావని ప్రశ్నించారు. సిరిసిల్లలో జనం చస్తున్నా ఇసుక లారీలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుందని వీహెచ్ ప్రశ్నించారు. 

 

21:16 - July 16, 2017

వీహెచ్..వి.హనుమంతరావు..కాంగ్రెస్ లో సీనియర్ నేత. తెలంగాణ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేత. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. నేతలపై ఆయన తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తుంటారు. వీహెచ్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన విషయాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి.

17:22 - July 16, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడు కేవీపై ఈ వ్యాఖ్యలు చేశారు. టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. జగన్ తో పాటు కేసీఆర్ తో కేవీపీ అంటకాగుతూ...కాంగ్రెస్ నేతలను ఆయా పార్టీల్లోకి పంపిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనలాటి ఎంతో మంది నేతలను వైఎస్ కు దూరం చేశాడని..తనకు కూడా మంత్రి పదవి రాకుండా కేవీపీ అడ్డుకున్నాడంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా కేవీపీ సూచన మేరకు వైసీలో చేరిన మల్లాది విష్ణు కూడా వైసీపీలో చేరారని వీహెచ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమంలో చూడండి..

10:20 - April 14, 2017

హైదరాబాద్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాల‌ని డిసైడ్ అయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..గాంధీభ‌వ‌న్‌ను వీడి గ్రౌండ్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికోస‌ం బ‌స్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో ప్రజా స‌మ‌స్యలపై ప్రజలకు దగ్గర కావ‌డంతోపాటు.,పార్టీలోని నేత‌ల కుమ్ములాట‌ల‌కు బ్రేకులు వేయ‌వ‌చ్చనేది కెప్టెన్ స్కెచ్‌. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేక‌పోయింది కాంగ్రెస్. 2014లో అధికారాన్ని చేజార్చుకున్న హ‌స్తం పార్టీ..2019లో మాత్రం ఎట్టిప‌రిస్థితిల్లో అధికారాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని త‌హ త‌హ‌లాడుతోంది. దీనికోసం ఇప్పటి నుంచే ప‌క్కా స్కెచ్‌తో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముందస్తు హామీల‌కు ప‌దునుపెడుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

బస్సు యాత్ర..
2019లో అధికారమే ల‌క్ష్యంగా పెట్టుకుని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జనానికి ద‌గ్గర కావాలంటే..జ‌నాక‌ర్షక ప‌థ‌కాలే అని గుర్తించిన ఉత్తమ్‌..ఇప్పటికే రైతు రుణ‌మాఫి అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. అంతేకాకుండా మ్యానిఫెస్టోను ఏడాది ముందే ప్రకటించడం..రుణ‌మాఫీ ఎంత ఇవ్వాల‌న్నదానిపై క‌స‌ర‌త్తు కూడా మొద‌లు పెట్టారు. ఇక దీనితో పాటు..ఇవ‌న్ని ఒక‌టైతే..తానుగా జ‌నంలోకి వెళ్ళిన‌ప్పుడే ప్రయోజ‌నం అని డిసైడ్ అయిన ఉత్తమ్‌,..తాను సార‌థిగా బ‌స్సు యాత్రకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప్రజా సమస్యలనే ప్రధాన ఏజెండాగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు.

పెద్దల అనుమతి..
ఇక బ‌స్సు యాత్ర అన్నది కాంగ్రెస్‌కు అచ్చి వ‌చ్చిన అంశంగా ట్రాక్ రికార్డ్ ఉంది. గ‌తంలో 2004లో గులాబ్ న‌బీఆజాద్ రాష్ట్ర ఇంచార్జీగా ఉండ‌గా అప్పట్లో పార్టీ చేసిన బ‌స్సు యాత్ర బాగా క‌లిసి వ‌చ్చింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు ఉప‌యోగించుకోవాల‌నే నిర్ణయానికి వ‌చ్చిన ఉత్తమ్‌..గులాబి స‌ర్కార్‌పై బ‌స్సు పోరుకు సిద్ధమవుతున్నారు. ఆ యాత్ర ద్వారా.. ప్రజలకు దగ్గర కావ‌డంతోపాటు.. ముఖ్యంగా పార్టీలోని అంత‌ర్గత పోరుకు బ్రేకులు వేయ‌వ‌చ్చనేది ఉత్తమ్‌ స్కెచ్‌. దీంతో పార్టీలో ఎవ‌రికి వారుగా ఉన్న పార్టీ నేత‌ల‌ను త‌న బ‌స్సు యాత్ర ద్వారా ఏక‌తాటిపైకి తీసుకురావడంతోపాటు పార్టీలో తానే లీడ‌ర్ అన్న సంకేతాల‌ను లీడర్ టూ క్యాడ‌ర్‌కు పంప వ‌చ్చన్నది ఉత్తమ్‌ ఫ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి టిఆర్ఎస్ స‌ర్కార్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన పీసీసీ చీఫ్‌..ఈ బ‌స్సు యాత్రతో ఇటు ప్రజల్లో..అటు పార్టీలో గ్రాఫ్ పెంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఢిల్లీ పెద్దల అనుమ‌తి రాగానే బ‌స్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసేందుకు కాంగ్రెస్ కెప్టెన్ సిద్ధపడుతున్నారు.

Don't Miss

Subscribe to RSS - Vh Speech