vice president

06:42 - October 28, 2017

విజయవాడ : ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే వరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని ప్రకటించిన వైసీపీ.. ఇదే అంశాన్ని జాతీయ స్ధాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్.జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు.. అరాచకాలకు పాల్పడుతోందంటూ లేఖలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు జగన్. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వైసీపీ.. మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్‌ కాట్ చేసిన వైసీపీ పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీకి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓసారి ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసిన పార్టీ అధినేత జగన్ ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్ధాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జగన్ లేఖ రాశారు.

శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో లేఖలో రాష్ట్రపతికి వివరించారు వైఎస్.జగన్. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని లేఖలో ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే రెండేళ్ల నుండి అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుండి స్పందన రాలేదని తెలిపారు. తమ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేశారని.. అంతేకాకుండా వారిలో నలుగురికి రాజ్యంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారని జగన్ లేఖలో వివరించారు. చంద్రబాబు, స్పీకర్ రాజ్యాంగ విలువలు కాపాడకుండా ఫిరాయింపుదారులతో సభ నడుపుతున్నారని జగన్ లేఖలో ఆరోపించారు. షెడ్యూల్ 10 ప్రకారం ఈ అంశంపై... చర్యలు తీసుకునే విధంగా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని జగన్ కోరారు.

ఏపీలో పరిపాలన అన్నది లేకుండా పోయిందని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో లక్షా 9 వేల 422 కోట్ల రూపాయలు అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తూ సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు జగన్. మొత్తానికి ఫిరాయింపుల అంశాన్ని మరోసారి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు వైఎస్.జగన్. దీని ద్వారా చంద్రబాబు సర్కార్‌పై మరింత ఒత్తిడి తేవాలన్న వైసీపీ ఉద్దేశ్యం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. 

09:23 - August 22, 2017
13:41 - August 21, 2017

హైదరాబాద్ : అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. తెలుగు రాష్ట్రాలు రెండూ సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. రాష్ట్రవిభజన జరిగింది ఒకరికి వ్యతిరేకంగా కాదన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికేనని తెలిపారు. కలిసి కలహించుకోవడంకన్నా... విడిపోసి సహకరించుకోవడం మిన్నని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు సహజమేనని... వాటిని సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇద్దరు సీఎంలు వ్యహరించాలన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒకటేనని.. తెలుగువారైనందుకు గర్వించాలన్నారు.

13:40 - August 21, 2017

హైదరాబాద్ : వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించడం తెలుగుజాతికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వెంకయ్య ఈ స్థాయికి ఎదగటం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందన్నారు. తెలుగుజాతికి ఎన్టీఆర్‌ దేశస్థాయిలో గుర్తింపు తీసుకొస్తే... దాన్ని వెంకయ్యనాయుడు మరింతగా ఇనుమడింపచేశారని కొనియాడారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అవ్వడంతో ఆ పదవికే వన్నెవచ్చిందన్నారు. వెంకయ్యనాయుడిని సన్మానించుకోవడం తెలుగువారందరికీ శుభదినమని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తానుకూడా వెంకయ్య ప్రసంగాలతో స్ఫూర్తిపొందానని గుర్తు చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నెతెస్తారని ఆయన ఆకాంక్షించారు. 

13:36 - August 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడుకు ఘనంగా పౌరసన్మానం జరిగింది. వెంకయ్యకు సీఎం కేసీఆర్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వేదపండితులు వెంకయ్యను ఆశీర్వదించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

11:41 - August 21, 2017
11:04 - August 21, 2017
11:35 - August 8, 2017
21:17 - July 17, 2017

ఢిల్లీ : గత కొన్ని రోజులుగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడ్డ బిజెపి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య తన పదవులకు రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీయే అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేస్తారు. ఉపరాష్ట్రపతి పదవి పట్ల వెంకయ్య విముఖత చూపినప్పటికీ బిజెపి పెద్దలు ఆయనను నచ్చజెప్పి ఒప్పించారు.

విశేషాలు..
బిజెపికి చెందిన ప్రముఖ నేతలలో ఒకరైన ముప్పవరపు వెంకయ్య నాయుడు 1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి 1980 వరకు జనతాపార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 1980 నుంచి శాసనసభలో బిజెపి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు.

పార్టీకి సేవలు..
వెంకయ్యనాయుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యున్నత పదవులు అలంకరించారు. 1993లో బిజెపి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. 2014లో మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి కేంద్ర కాబినెట్‌ మంత్రి అయ్యారు. 2002 జూలై 1 నుంచి అక్టోబర్ 5, 2004 వరకు బిజెపి జాతీయ అధ్యక్షపదవిలో వెంకయ్య పార్టీకి సేవలందించారు. మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వెంకయ్యనాయుడు నాలుగుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడింపారు. వెంకయ్యనాయుడుకు భార్య ఉష, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

20:04 - July 17, 2017

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీ పడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఎన్డీయే బరిలోకి దింపనుంది. ఈ అంశంపై వీరయ్య (విశ్లేషకులు), కార్తీక రెడ్డి (కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - vice president