video conference

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

07:30 - October 12, 2017

 

గుంటూరు : జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతులు, మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్వచ్ఛత, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్‌ నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలనీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే వివిధ సమస్యలను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక , ఆర్థికేతర అంశాలుగా స్పష్టంగా వర్గీకరించుకోవాలన్నారు. వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మీదట స్వచ్ఛత, ప్రజాసమస్యల విషయంలో ప్రతి 15 రోజులకోసారి తాను వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా
వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ రూపొందాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులంతా కష్టపడాలన్నారు. జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు వందశాతం ఓడీఎఫ్‌ సాధించాయని.. మిగతా 10 జిల్లాలు కూడా మరో 6నెలలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. మొత్తం 12, 854 గ్రామ పంచాయతీలకుగాను.. ఇప్పటికి 4,600 గ్రామపంచాయతీలు పూర్తి ఓడీఎఫ్‌ను ప్రకటించాయని గుర్తుచేశారు. అధికారులు, మంత్రులు జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు టాయిలెట్లు, ఆయా పరిసరాలు పరిశీలించి స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 4గంటలపాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్‌ చివరి వరకు ఉత్సాహంగా సాగింది. అయితే కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

18:50 - October 4, 2017

గుంటూరు : ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలవుతోన్న తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో చర్చించారు. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యక్రమం అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై సీఎం ప్రధానంగా చర్చించారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి ఫిర్యాదులపై చర్చించారు. 60 ఏళ్లు దాటిన వికలాంగులకు ఒకే పించన్‌ ఇవ్వడంపై ఫిర్యాదులు వచ్చాయన్న చంద్రబాబు... అర్హులైన వారికి రెండు పించన్లు అందేలా చూస్తామన్నారు. ఎన్ టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్మించిన ఇళ్లకు లక్ష రూపాయల వరకు మంజూరు చేయడంపై సీఎం సానుకూలంగా స్పందించారు. 

 

07:16 - November 21, 2016

విజయవాడ : నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే మరో రూ.5వేల కోట్లు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సహకార బ్యాంకులకు నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ లావాదేవీల ఛార్జీలు తగ్గించాలని బాబు సూచించారు.

నోట్ల రద్దుతో ఏపీ పరిస్థితులపై కేంద్రానికి చంద్రబాబు లేఖ
పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీకి తక్షణమే మరో రూ.5వేల కోట్లు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై పన్ను మినహాయింపులు కల్పించాలని, సహకార బ్యాంకుల్లో రైతులకు నిబంధనలు సడలించాలని కోరారు. రూ.వెయ్యి కోట్ల వరకు రూ.20, 10, 50, 100 నోట్లు ఉండేలా చూడాలని, పీవోఎస్‌ యంత్రాలకు రాయితీలు కల్పించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు.

కొత్త నోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు ఫోన్
రాష్ట్రానికి కొత్త నోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు సీఎం ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉర్జిత్ పటేల్ సానుకూలంగా స్పందించారని.. ఇవాళ రాష్ట్రానికి రూ. 2,200 కోట్ల కరెన్సీ వస్తుందని, అందులో రూ. 400 కోట్ల చిన్ననోట్లు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లను పంపిందని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్న చంద్రబాబు.. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్రమంత్రి సుజనాచౌదరిని ఆదేశించారు.

 

13:27 - November 20, 2016

విజయవాడ : ఒక సమస్య ఇన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆర్‌బీఐ, ఎస్‌ఆర్‌బీసీ అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 12 రోజులైనా డిమానిటైజేషన్‌ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధాకరమన్నారు. ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్న బాబు.. దీనిపై తనకే అసహనంగా ఉందన్నారు. సంక్షోభంలో పరస్పర సహకారం, సమన్వయం, సమర్థ కార్యాచరణ ప్రధానమన్నారు. ఇది సమర్థతను నిరూపించుకునే అవకాశంగా బ్యాంకర్లు భావించాలన్నారు. రాష్ట్రానికి మరో రూ.2వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ఇందులో రూ.100 నోట్లు రూ. 400 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జన్‌ధన్‌ ఖాతాలలో రూపేకార్డులను వెంటనే యాక్టివేషన్‌ చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

17:50 - November 15, 2016

హైదరాబాద్ : ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద యాసంగి సాగు పెరగాలని.. 8 లక్షల ఎకరాల సాగుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంపై త్వరలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ కింద యాసంగి కార్యాచరణ ప్రణాళికలను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది. ఈ కార్యాచరణపై వరంగల్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

11:33 - September 26, 2016
16:45 - August 9, 2016

హైదరాబాద్ : ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఉన్న పుష్కర ఘాట్లలో నీటి లభ్యతపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రెండు జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల దగ్గర నీరు పుష్కళంగానే ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్న 29 ఘాట్లలో నీరు తక్కువగా ఉండటంతో ప్రవాహం పెరిగేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నుంచి ప్రతి రోజూ 22 వేల క్యూసెక్కుల నీటిని పుష్కరాల కోసం విడుదల చేయాలని కోరారు. 

17:22 - July 30, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చెయ్యడానికైనా సిద్ధమని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపజేయడానికైనా వెనుకాడమన్నారు. పార్టీ ఎంపీలతో రేపు చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వెంకయ్యనాయుడు, మోడీ, జైట్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.

16:53 - July 30, 2016

హైదరాబాద్ : మోడీ సర్కారుతో చంద్రబాబు అమీతుమీకి సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ రాకపోవడంతో.. కేంద్రం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇవాళ టీడీపీ ఎంపీలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రేపు జగరగబోయే ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపచేసే అంశంపై చర్చిస్తామన్నారు. కేంద్రవైఖరికి నిరసనగా ఎల్లుండి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర  టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - video conference