vijay antony

16:51 - November 19, 2018

బిచ్చగాడు సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుని, తన ప్రతి సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటొని. ఫాతిమా విజయ్ ఆంటొని నిర్మాణంలో, గణేషా డైరెక్షన్లో విజయ్ ఆంటొని, నివేదా పేతురాజ్ జంటగా నటించిన రోషగాడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోషగాడుగా విజయ్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

కథ :

కానిస్టేబుల్ కుమారస్వామి (విజయ్ ఆంటొని), తన తమ్ముడు రవిని ఇన్స్‌పెక్టర్‌ని చెయ్యాలనుకుంటాడు. అన్న, ఎప్పుడు చూసినా చదువు, ఫిట్‌నెస్ అంటూ ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాడని, తమ్ముడు రవి ఇంట్లో నుండి పారిపోతాడు. హైదరాబాద్ చేరుకున్న రవి, బాబ్జీ అనే ఒక రౌడీ దగ్గర చేరి, అతను చెప్పిన వాళ్ళని హత్య చేస్తుంటాడు. ఇంతలో కుమారస్వామికి హైదరాబాద్  ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒక హత్య విషయంలో సొంత తమ్ముడిని కాల్చి చంపేస్తాడు కుమారస్వామి. తన తమ్ముడిలాగే, బాబ్జీ కోసం వేలాదిమంది కుర్రాళ్ళు పని చేస్తున్నారని తెలుసుకున్న కుమారస్వామి, వాళ్ళందరి దృష్టిలో పోలీస్ అంటే హీరో, అనే ఇమేజ్ క్రియేట్ చేసి, వాళ్ళందరిని మంచిగా  మార్చాలనుకుంటాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా, కుమారస్వామి.. బాబ్జీ దగ్గర నుండి కుర్రాళ్ళందరిని సేవ్ చేసాడా, లేదా? అనేది ఈ రోషగాడు కథ..

 

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

తన ప్రతీ సినిమాలో ఒక ఎమోషనల్ పాయింట్‌ని తీసుకుని, కథకు తగ్గ పాత్రలో ఇట్టే ఇమిడిపోవడం విజయ్ ఆంటొని స్టైల్..  రోషగాడులోనూ, పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో చక్కగా, సెటిల్ట్ పర్ఫారెన్స్ ఇచ్చాడు. ఎమోషన్ అండ్ యాక్షన్ సీన్స్‌లో తన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నివేదా పేతురాజ్ తుంటరి అమ్మాయిగా అలరిస్తుంది. యాక్టింగ్ వైజ్, గ్లామర్ వైజ్ మెప్పిచింది. విలన్‌గా సాయి దీనా చక్కగా సెట్ అయ్యాడు. బాబ్జీగా అతను పండించిన విలనిజం సినిమాలో కీలక పాత్ర పోషించింది. మిగతా రోల్స్‌లో, లక్ష్మీ రామకృష్ణన్, ముత్తురామన్ తదితరులు తమ తమ  పాత్రల మేర ఉన్నంతలో బాగానే చేసారు. విజయ్ ఆంటొని ఈ సినిమాకి మ్యూజిక్‌తో పాటు, ఎడిటింగ్ కూడా చేసాడు. పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు కానీ, నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫాతిమా విజయ్ ఆంటొని లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ సినిమాని నిర్మించింది. డైరెక్టర్ గణేషా సెలక్ట్ చేసుకున్న పాయింట్ బాగుంది కానీ, దాన్ని తెరమీద చూపించడంలో తడబడ్డాడు. దానికి తోడు స్లో నేరేషన్ ఒకటి.. చూసేవాళ్ళ సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో, హీరో, హీరోయిన్, విలన్ తప్ప, మన జనాలకి తెలిసిన ముఖాలు లేవు.. సినిమాలో తారాస్ధాయిలో ఉండే అరవ నేటివిటి మనోళ్ళకి పెద్దగా రుచించలేదు. స్టోరీ థీమ్, విజయ్ ఆంటొని యాక్టింగ్ తప్ప సినిమాలో ఇంకేం లేదు. ఈ తప్పిదాల కారణంగా, కరెక్ట్‌గా చేస్తే ఓ రేంజ్‌లో ఉండే రోషగాడు, బిలో యావరేజ్ దగ్గర ఆగిపోయాడు.

 

తారాగణం :  విజయ్ ఆంటొని, నివేదా పేతురాజ్, సాయి దీనా, లక్ష్మీ రామకృష్ణన్, ముత్తురామన్ తదితరులు..

కెమెరా     :   రిచర్డ్ ఎమ్.నాథన్

ఎడిటింగ్, సంగీతం :      విజయ్ ఆంటొని

నిర్మాత     :              ఫాతిమా విజయ్ ఆంటొని

దర్శకత్వం :                  గణేషా 

రేటింగ్      :    2/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

18:39 - October 25, 2018

బిచ్చగాడు సినిమా విజయం తర్వాత తమిళ్ నటుడు విజయ్ అంటోనీ నటించిన అన్ని చిత్రాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా రోషగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నివేదిత థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. పోలీసులు సామాన్యులు కాదు పుడింగులే అంటూ  విజయ్ ఆంటోనీ టీజర్‌లో కనిపించాడు. గత సినిమాలతో పోల్చితే డైలాగ్ డెలివరీలో  రోషగాడులో ప్రత్యేకత కనిపిస్తోంది. ఇదుగో టీజర్ మీకోసం..
 

12:10 - October 6, 2018

విజయ్ ఆంటోనీ... బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... యమన్, ఇంద్రసేన, కాశి వంటి విజయ్ గత చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.. ఈ నేపధ్యంలో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా రోషగాడు మూవీతో రాబోతున్నాడు.. విజయ్ ఆంటోనీ, నివేథా పేతురాజ్ జంటగా, గణేష్ డైరెక్షన్‌లో, ఫాతిమా‌విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న చిత్రం.. రోషగాడు.. ఈ మూవీలోని రోషగాడురా.. వీడు మాటంటే పడడురా అనే థీమ్ సాంగ్‌ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లాంచ్ చేసారు.. భాష్యశ్రీ ఈ‌పాటని వ్రాశారు.. ఎప్పటిలానే  విజయ్ ఆంటోనీ ఈ‌మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు...  సాంగ్ ఆద్యంతం సినిమాలో విజయ్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలియచేసేలా ఉంది.. రోషగాడులో విజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా‌ కనిపించబోతున్నాడు...
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రోషగాడు త్వరలో రిలీజ్ కాబోతోంది...

16:56 - February 2, 2018

హీరో విజయ్ ఆంటోని 'రోషగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాధారణంగా తమిళంలో సినిమా పూర్తయిన తరువాత తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేసే ఆయన, ఈసారి తమిళంతోపాటు తెలుగులో తన తదుపరి సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశాడు. తన సినిమాకి ఆయన 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ నెల 7వ తేదీన షూటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశాడు. ఈ సినిమాకి గణేశ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. విజయ్ ఆంటోని ఇంతకుముందు చేసిన సినిమాకి చిరంజీవి పాత్ర పేరైన 'ఇంద్రసేన' అనే టైటిల్ పెట్టాడు. ఇప్పుడేమో గతంలో చిరంజీవి చేసిన 'రోషగాడు' టైటిల్ ను ఫిక్స్ చేయడం గమనార్హం.

 

11:19 - December 28, 2016

'బిచ్చగాడు' ఫేం 'విజయ్ ఆంటోనీ' తెలుగు సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ తంబీ లేటేస్ట్ మూవీ 'బేతాళుడు' కూడా మంచి కలెక్షన్లే సాధించడంతో తెలుగు నిర్మాతలు అతడితో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోనీ ఓ తెలుగు మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు 'విజయ్ ఆంటోనీ'. అంతకుముందు 'నకిలీ', 'సలీమ్' లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ పలకరించినా ఈయన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'బిచ్చగాడు' సంచలన విజయంతో మాత్రం తెలుగులో 'విజయ్ ఆంటోనీ' మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు మూవీ ఏకంగా 20కోట్లు వసూలు చేయడంతో 'విజయ్' అతడి సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ వచ్చేసింది. అందుకే ఆయన రీసెంట్ మూవీ 'భేతాళుడు' డబ్బింగ్ హక్కులను మన నిర్మాతలు 3కోట్ల పెట్టి మరీ తీసుకున్నారు.

రాడాన్ పిక్చర్స్..
దీంతో ఏకంగా ఈ హీరో తెలుగులో కూడా ట్రై చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశాడట. సినిమా 'భేతాళుడు' ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే 'బిచ్చగాడు' సినిమా వల్ల ఈ మూవీ ఒపెనింగ్స్ బాగానే వచ్చాయి. దీనికి తోడు శాటిలైట్ రేట్ కూడా బాగానే పలుకడంతో అక్కడిక్కడికి సరిపోయాయి. ఇప్పుడు ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ హీరో తమిళంతో పాటు తెలుగులో ఓ మూవీని ఏకకాలంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు వినికిడి. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. రాధికా, శరత్ కుమార్ రాడాన్ పిక్చర్స్ బేనర్ మీద 'విజయ్ ఆంటోనీ' హీరోగా తెలుగు అండ్ తమిళ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా దర్శకుడు ఖరారు కానీ మూవీలో 'విజయ్ ఆంటోనీ'ని సంగీత లైకా ప్రొడక్షన్స్ వారు కూడా పార్టనర్ గా చేరినట్లు సమాచారం. దర్శకుడు ఫిక్స్ కాగానే ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో తమిళ, తెలుగు భాషల్లో స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారట. మొత్తానికి 'విజయ్ఆంటోనీ' సూర్య, విక్రమ్, విశాల్ రేంజ్ లో ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

09:37 - April 9, 2016

ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అలాగే అదృష్టం ఎవరికీ సొంతం కాదు. ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వారు అర్హత కలిగుంటే మరో రంగంలోనూ సాధించగలరు.అలా సంగీత రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న విజయ్‌ఆంటోని, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకులుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది పయనించడానికి రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్వశక్తితో ఎదుగుతున్న సంగీత దర్శకుల్లో ఈయన ఒకరని చెప్పాలి.
 

మొదట్లో సొంతంగా పాప్ సాంగ్స్ ఆల్బమ్‌లతో తనకంటూ గుర్తింపు తె చ్చుకున్న ఆది ఇప్పుడు సినీ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. దర్శకుడు సుందర్.సీ విశాల్ నటించిన ఆంబళ చిత్రంతో ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు.ఆ తరువాత తనీఒరువన్, అరణ్మణ-2 చిత్రాలతో సక్సెస్‌ఫుల్ సంగీతదర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.ఈయనలో మంచి గాయకుడు,గీత రచయిత కూడా ఉన్నారన్నది గమనార్హం.
 
కాగా ఆదిని సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన సుందర్. సీనే ఇప్పుడు హీరోగా ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన అవ్నీ సంస్థలో స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న తాజా చిత్రంలో హిప్ హాప్ తమిళ్ ఆదిని కథానాయకుడిగా ఎంపిక చేసినట్లు తెలిసింది.అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

Don't Miss

Subscribe to RSS - vijay antony