vijay devarakonda

12:06 - June 5, 2017

కొత్తదనమున్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తోన్న కుర్ర హీరో విజయ్ దేవర కొండ సోషల్ మీడియాలో ఓ ఇంటివాడైపోతున్నాడు అన్న కథనాల పై ఆయన ఆయన తనదైన శైలిలో స్పందించాడు. తన ప్రేమ .. పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. తన పెళ్లికి చాలా సమయం ఉందనీ .. అప్పుడు అందరికీ తానే స్వయంగా చెబుతానని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరియర్ పైనే ఉందని స్పష్టం చేశాడు.

21:33 - March 5, 2017

'ద్వారకా' మూవీ టీమ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ శ్రీనివాస్, హీరో విజయ దేవరకొండ, హీరోయిన్ పూజా జవేరి మాట్లాడారు. సినిమా విశేషాలు తెలిపారు. సినీ అనుభవాలను వివరించారు. పలు అసక్తికర విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:45 - March 3, 2017

విజయ దేవరకొండ హీరోగా, పూజా జవేరి హీరోయన్ గా శ్రీనివాస రవీంద్ర రచించి, దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం 'ద్వారక'..ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రద్యుమన్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది...? ప్రేక్షకులు ఫీలింగ్స్ ఏమిటీ...? సినిమా రేటంగ్ వంటి వివరాలను వీడియోలో చూద్దాం...

21:41 - March 3, 2017

జోకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రజ్ఞాజైస్వాల్ హీరోయిన్ గా నటించిన సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం గుంటురోడు ఇవాళ విడుదలైంది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్స్, రివ్యూ, రేటింగ్ వివరాలను వీడియోలో చూద్దాం...

09:17 - November 30, 2016

అలనాటి అందాలనటి 'కాంచన' గుర్తుండే ఉంటుంది కదా...దాదాపు 30 సంవత్సరాల తరువాత ఈమె మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'లో ఆమె నటించనున్నట్లు ఇటీవలే దర్శకుడు సందీప్ వంగా ప్రకటించారు. కాంచన వయస్సు 77 ఏళ్లు. ఆమె చివరిసారిగా శ్రీ దత్త దర్శనం తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా 1985లో విడుదలైంది. అనంతరం మేకప్ వేసుకోలేదు. సినిమాలో నటించాలని తాను కోరినప్పుడు తొలుత కాంచన అంగీకరించలేదని సందీప్ వంగా పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆమె ఒప్పుకున్నారని తెలిపారు. విజయ్ కు బామ్మగా 'కాంచన' నటించనుందని, సినిమాలో ఆమెది కీలక పాత్ర అని తెలిపారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని జనవరిలో రిలీజ్ కానుందని టాక్.

08:58 - June 29, 2016

విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రమ్మణ్యం ఫేం), రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌,వినూతన గీత బ్యానర్స్‌పై రాజ్‌ కందుకూరి, యస్‌.రాగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పెళ్ళి చూపులు'. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నిర్మాతలు రాజ్‌ కందుకూరి, యస్‌.రాగినేని మాట్లాడుతూ.. 'నవ్యమైన కథతో లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'పెళ్ళి చూపులు' చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. హీరోహీరోయిన్ల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునేలా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నేచురల్‌ స్టార్‌ నాని ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. టీజర్‌, పోస్టర్స్‌ చాలా బాగున్నాయని యూనిట్‌ని అభినందించారు. చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

 

07:45 - April 19, 2016

విజరు దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ కందుకూరి, యష్‌ రాగినేని నిర్మిస్తున్న చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజరు దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రమిది. నవ్యమైన కథతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అని అన్నారు.

Don't Miss

Subscribe to RSS - vijay devarakonda