Vijay Deverakonda

14:57 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో ‘విజయ్ దేవరకొండ’ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి చిత్రం అనంతరం ఇతని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తనదైన స్టైల్..నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతమున్న యూత్‌లో విజయ్ దేవరకొండ అంటే ఒక క్రేజ్. ప్రస్తుతం ఇతను టాప్ హీరోల స్థానానికి ఎగబాకేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాడంట. 
దిగ్గజ దర్శకులు కొరటాల శివ..సుకుమార్‌తో విజయ్ దేవరకొండ పనిచేయడానికి సిద్ధమౌతున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల ఓ లైన్ రాసుకుంటున్నారు. Image result for koratala chiruప్రస్తుతం చిరు ‘సైరా’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోైవైపు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కోసం సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. Image result for sukumar and koratala film with vijay devarakondaదీని అనంతరం విజయ్ దేవరకొండతో చిత్రం తీయాలని సుకుమార్ భావిస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్. వీరిద్దరితో విజయ్ దేవరకొండ చిత్రాలు ఉంటే మాత్రం అతను చిత్రాలు ఖచ్చితంగా టాప్ లీడ్‌లోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తున్నారు. 
మరోవైపు ‘గీత గోవిందం’ చిత్రంతో రూ. 70 కోట్ల బిజినెస్ చేసిన ఈ అర్జున్ రెడ్డి ‘నోటా’ సినిమాతో ఒక్కాసారిగా బోల్తాపడ్డాడు. అనంతరం ‘టాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి సుకుమార్..కొరటాలతో విజయ్ సినిమాలు ఉంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

 
 
13:30 - October 20, 2018

విజయ్ దేవరకొండ కొత్త సినిమా నిన్న ప్రారంభమైంది.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై, కేఎస్ రామారావు సమర్పణలో, కేఎస్ వల్లభ నిర్మిస్తుండగా, ఓనమాలు, మళ్ళీమళ్ళీ ఇదిరాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ముహూర్తపు సన్నివేశానికి కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.. ఈ మూవీలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె హీరోయిన్స్‌గా నటిస్తుండగా, గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అశ్వినీ దత్, బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కళ్యాణ్, దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.. 

17:49 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా మూవీ నిన్న ప్రేక్షకులముందుకొచ్చింది.. ఊహించినంత కాదుగానీ, ఓ‌ మోస్తరు టాక్ తెచ్చుకుంది.. తమిళ్‌లోనూ పర్వాలేదనిపించుకుంది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఫస్ట్‌డే నోటాకి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే... ఏపీ, తెలంగాణ షేర్ - 4.55 కోట్లు, తమిళనాడు-రూ.1‌కోటి, కర్ణాటక- 60 లక్షలు, యుఎస్- 75 లక్షలు, మిగతా ఏరియాలు - 45లక్షలు, వరల్డ్‌‌వైడ్ షేర్ - 7.3 కోట్లు..షేర్ వివరాలిలా ఉంటే, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ దాదాపు 14‌ కోట్లని తెలుస్తోంది.. గీత గోవిందం బజ్‌ తో ఓపెనింగ్స్ రావడం వరకూ ఓకే కానీ, డివైడ్ టాక్‌తోనూ తొలిరోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే, విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.. వీకెండ్ కాబట్టి శని,ఆది వారాల్లోనూ మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
 

09:22 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగుతోపాటు తమిళ్‌లోనూ రిలీజ్ అయింది..
విజయ్ క్రేజ్ దృష్ట్యా తెలుగులో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ, మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది..
ప్రస్తుతం నోటాకి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి టాలీవుడ్‌లో బాబు పాస్ అయిపోతాడు...
ఇక కోలీవుడ్ విషయానికొస్తే, అక్కడ ఈరోజు విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96, విష్ణు విశాల్, అమలా పాల్ నటించిన రాక్షసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి..96 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా, రాక్షసన్ తమిళ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటి అంటున్నారు..
విజయ్.. గీత గోవిందంతో తమిళ్ లోనూ గుర్తింపుతెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాల తాకిడిని తట్టుకుని, విజయ్ దేవరకొండ నోటా ఏమేరకు నిలబడతుందో చూడాలి మరి...

 

19:27 - October 5, 2018

విజ‌య్ దేవ‌ర‌కొండ‌. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో విజ‌య్ క్రేజ్ కొండంత పెరిగింది. గీత గోవిందం సినిమాతో ఆ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు నోటా సినిమాతో మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ కెరీర్ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘నోటా’ సినిమాతో విజయ్ తమిళంలో కూడా అడుగుపెట్టిన‌ట్టైంది. ఈ సంద‌ర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడాడు. పలు అంశాలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత తనకు భారీగా క్రేజ్ వచ్చిందని విజయ్ తెలిపాడు.

ఇక ఇటీవల ఓ విదేశీ యువతితో విజ‌య్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ యువ‌తి డిన్నర్ చేస్తున్న ఫొటో హాట్ టాపిక్ అయింది. విజ‌య్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రు? అని ఫ్యాన్స్ తీవ్రంగా చ‌ర్చించుకున్నారు. తాజాగా ఆ విష‌య‌మై విజ‌య్ స్పందించాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిదని విజయ్ కితాబిచ్చాడు. ఇక మిగిలిన విషయాలను మరిచిపోవాలని నవ్వుతూ జవాబిచ్చాడు. బెల్జియం దేశానికి చెందిన యువతితో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ యువ‌తి గురించి పెద్ద‌గా వివ‌రాలేవి చెప్ప‌కుండా విజ‌య్ మ‌రోసారి ఎస్కేప్ అయ్యాడు.

తన పేరును ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని సొంత ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టినట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఎవరైనా మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పెట్టినట్లు వెల్లడించాడు. తనకు కథపైనా, వ్యక్తులపైనా నమ్మకం కుదిరితేనే సినిమాను చేస్తానని దేవరకొండ స్పష్టం చేశాడు.

ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ గురించి ఆలోచించేందుకు సమయమే లేదని విజ‌య్ చెప్పాడు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను చేస్తూ తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని తెలిపాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత  యాక్టింగ్ మానేసి దర్శకత్వం-రచన వైపు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. కానీ అంతలోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయన్నాడు. ప్రస్తుతం దక్కిన గుర్తింపు, క్రేజ్ తో తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

11:59 - October 5, 2018

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘నోటా’..మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...

కథ :
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు వాసుదేవ్.. ఒక స్వామీజీ సలహామేరకు తన కొడుకు వరుణ్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు... అయితే అదే టైమ్‌లో అవినీతి ఆరోపణలతో వాసుదేవ్ జైలుకి వెళ్ళడంతో తప్పక తండ్రి స్ధానంలోకి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రిగా ఏం చేసాడు అనేది నోటా కథ..

నటీనటులు :
విజయ్ దేవరకొండ నటుడిగా సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉన్నాడు... నోటాలో గంభీరంగా కనిపిస్తూ తన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు..హీరోయిన్ మెహరీన్‌ది గెస్ట్ అప్పీరియన్స్‌లా అనిపిస్తుంది.. అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది.. సీనియర్ నటులు నాజర్ అండ్ సత్యరాజ్ తమ అనుభవంతో వారి వారి పాత్రలని రక్తి కట్టించారు... మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు...శ్యామ్.సి.ఎస్. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సో సో‌గా ఉన్నాయి.. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా వర్క్ బాగుంది.. రేమండ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాని పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం బాగానే ఉంది కానీ, ఓవర్ డ్రామాతో కాస్త సాగదీస్తూ.. సహనానికి పరీక్ష పెట్టాడు..‘నోటా’ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.. మన దగ్గర విజయ్ మ్యాజిక్‌తో ఆడేస్తుంది కానీ, తమిళ్‌లో ఏమాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.. ఎందుకంటే, తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా రిలీజ్ అయింది నోటా‌.. తమిళ్‌లో ఇవాళే రిలీజ్ అయిన, విజయ్ సేతుపతి, త్రిషల 96, ఎస్.జె.సూర్య రాక్షసన్ మూవీస్ కి హిట్ టాక్ వచ్చేసింది... మరి వాటి మధ్య నోటా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి...

తారాగణం :  విజయ్ దేవరకొండ, మెహరీన్,  నాజర్, సత్యరాజ్..

కెమెరా     :  సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 

సంగీతం   :    శ్యామ్.సి.ఎస్.

ఎడిటింగ్   :      రేమండ్ 

నిర్మాత    :   కె.ఇ.జ్ఞానవేల్ రాజా

రేటింగ్  : 2.5\5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి
 
 

Don't Miss

Subscribe to RSS - Vijay Deverakonda