villagers

14:20 - October 15, 2018

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం మారుమూల గ్రామాలైన గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేటలలో బడి లేదు.. గుడి లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు.. ఎటుచూసినా తాటికమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలు. ఆ గ్రామాలకు సరైన రోడ్లు లేవు. 30 సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పలు పార్టీల నాయకులు రావడమే కానీ ఊరికి చేసినదేమీ లేదంటున్నారు ఆ గ్రామస్తులు.. నిత్యం మోసపు నాయకుల మాటలతో మోసపోతున్నామని..  ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతమంటున్నారు. రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.  గ్రామస్తులు అంతా ఏ పార్టీకి ఓటు వేసేది లేదని తీర్మానం చేసుకున్నారు.

గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేట గ్రామాలలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. తమ ఊరు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధానంగా తమ ఊరిలో కనీస సౌకర్యాలైన తాగునీరు, సాగునీరు , రోడ్లు, బడి, కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి మోసం చేశారని, మద్యం , చీరలు ఎరగా పెట్టి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఊరి కోసం ఏమీ చేయలేదంటూ, తాగునీరు లేక నానా కష్టాలు పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చారు.. ఈ సారి ఏ నాయకుడు వచ్చిన ఎవరికి ఓటు వేసేదీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో బడి లేక మండలానికి వెళ్లాల్సి వస్తుందని, చిన్న పిల్లలను పది కిలోమీటర్ల దూరంలో బడికి పంపలేక పోతున్నామని, చాలా మంది బడిమానేసి ఇంట్లో ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు ఏ అధికారి తమ గ్రామాలకు రారని కేవలం ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలప్పుడే వీరంతా కనిపిస్తారని.. అందుకే ఈ సారి ఎవరూ వచ్చిన తమ సమస్యల పై స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పడే ఓట్లు వేయడానికి ఆలోచిస్తామంటున్నారు..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకూడదని గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నారు.. ఏ పార్టీ నేతలైనా  సరే తమకు నమ్మకం కల్పించనంత వరకు ఓటు వేసేది లేదంటున్నారు గ్రామస్తులు.. మాయమాటలు చెప్పె వారిని ఊరి పొలిమెరల్లోనే తరిమి కొడతామంటున్నారు. 

18:28 - October 11, 2018

రంగారెడ్డి : జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రథంపై దాడి జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార రథంపై ప్రజలు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రచార రథం ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి తండాకు వెళ్లింది. తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని టీఆర్ఎస్ ప్రచారం రథంపై గ్రామస్తులు దాడి చేశారు. ప్రచార రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసి, ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

19:35 - May 20, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ధమ్మపేట మండలం మందలపల్లిలో పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సొసైటీ భూముల్లో షెడ్డులు వేశారని.. రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో షెడ్డులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా నిలిచిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాము పేదవారిమని, కావాలనే రాత్రి సమయంలో ఆకస్మికంగా వచ్చి షెడ్డులను తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

11:43 - March 4, 2018

పెద్దపల్లి : ప్రస్తుతం సమాజం మారుతున్నా కొందరు మూఢనమ్మకాల్లోనే జీవిస్తున్నారు. తమకు మంచి జరగాలని..డబ్బులు సంపాదించాలని కొంతమంది నరబలిచ్చేందుకు సిద్ధమౌతుండడం ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోగా తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. కానీ బాలుడు తృటిలో తప్పించుకోవడంతో పెద్ద ఘోరం తప్పింది.

కాల్వ శ్రీరాంపూర్ (మం) కిష్టంపేటలో సుంకరితోట ఉంది. పురాతన కోట కావడం..ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఉంది. గుప్త నిధులు సంపాదించుకోవాలని ముగ్గురు దుండగులు ఓ బాలుడిని నరబలి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 17 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి సుంకరితోట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దుండగులు పూజలు చేస్తుండగా బాలుడు గ్రహించి తప్పించుకుని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

07:18 - January 11, 2018

కరీంనగర్ : సవతి తల్లి కర్కశత్వానికి కరీంనగర్‌లో కావేరి అనే పదవతరగతి బాలిక బలైంది. కొందరు గ్రామస్థులతో కలిసి గొంతు నులిమి చంపిన సవతి తల్లి... ఆత్మహత్యగా చిత్రీకరించింది... మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో... స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలితోపాటు... ఆమెకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

16:27 - December 16, 2017

జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు కట్టబోమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ప్రభుత్వానికి చెల్లించే ఇంటిపన్ను, నల్లాబిల్లు, కరెంట్ బిల్లు తదితర పన్నులు కట్టబోమని తీర్మానం చేసి గ్రామపంచాయితీ కార్యాలయానికి అతికించారు. విద్యుత్తు బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను గ్రామ పంచాయతీలో ముత్యంపేటవాసులు నిర్బంధించారు. ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని లేకపోతే ఆందోళనలు ఉధృత్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

13:01 - July 29, 2017

నల్గొండ : ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సినవారే బడి ఆస్తిని కాజేశారు.. శిధిలావస్థకు చేరిందంటూ స్కూల్‌లోని కలపపై కన్నేశారు.. పక్లా ప్లాన్‌వేసి ప్రాపర్టీని పక్కదారి పట్టించారు.. ఆ స్కూల్‌ ఎక్కడుంది? ఎవరి అండతో ఇదంతా జరిగింది? 10 టీవీ ప్రత్యేక కథనం.. 
ఎనభై ఏళ్లక్రితం ఏర్పాటైన పాఠశాల 
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో ఎనభై ఏళ్లక్రితం ఏర్పాటైన పాఠశాల ఇది.. ఈ స్కూల్‌లో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పింది.. ఎప్పుడు చిన్నారుల రాకపోకలతో సందడిగాఉండే ఈ స్కూల్‌లోని కొన్ని గదులు శిధిలావస్థకు చేరాయి.. ఇవి కూలిపోతే చాలాప్రమాదమంటూ హెడ్‌మాస్టర్‌ సర్పంచ్‌ దృష్టికితెచ్చాడు.. ఇదే అదనుగా భావించిన సర్పంచ్‌ అల్లుడు... ఈ గదుల్లోని కలపను కాజేసేందుకు ప్లాన్‌ వేశాడు.. భవనాలను కూల్చివేయాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాయించాడు.. ఈ లెటర్‌పై స్పందించిన అధికారులు... కూల్చివేతకు నిధులు లేవని... గ్రామపంచాయితీగానీ... స్వచ్ఛందసంస్థల సాయంగానీ తీసుకోవాలని సూచించారు..
గదుల కూల్చివేత
అధికారునుంచి లేఖ అందాక అసలు కథ ప్రారంభమైంది.. సర్పంచ్‌ అనారోగ్యానికి గురికావడంతో అతని అల్లుడు రంగంలోకి దిగాడు.. గదుల కూల్చివేతకు 75వేల రూపాయల గ్రామపంచాయితీ నిధులు కేటాయించేలా  చేశాడు.. ఆ డబ్బుతో ఆరు తరగతి గదుల్ని నాలుగు నెలలకింద కూల్చివేయించారు.. అందులోఉన్న వందలకొద్దీ నల్లమద్ది దూలాలు, వాసాలు, చెక్కల్ని అమ్మేందుకు సిద్ధమయ్యాడు..  ట్రాక్టర్లకొద్దీ నాపరాళ్లు, పునాది రాయిని అమ్మేశాడు.. ఈ సామగ్రి విలువ 8లక్షలకుపైగా ఉండటంతో విషయం బయటకువచ్చింది.. గ్రామ ఎంపీటీసీ మేకల పార్వతమ్మ దీనిపై కలెక్టర్‌కు లేఖ రాశారు.. వెంటనే కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.. దీంతో భయపడ్డ సర్పంచ్‌ అల్లుడు అమ్మగా మిగిలిన వస్తువుల్ని రాత్రిరాత్రే స్కూలులో పెట్టించాడు.. అయితే తీసుకువెళ్లిన వస్తువులతోపోలిస్తే వచ్చింది అంతంతమాత్రమేనని గ్రామస్తులు అంటున్నారు..
స్కూల్‌ సామాను అమ్మకంలో హెచ్‌ఎం హస్తం
ఈ అక్రమం వెనక హెచ్‌ఎం హస్తంకూడా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ప్రధానోపాధ్యాయుడికి తెలియకుండా ఓ ప్రైవేట్ వ్యక్తి స్కూల్‌ కలప ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు.. పాఠశాల కలప అమ్మకంపై సమగ్ర విచారణ జరిపించి... బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

 

11:35 - July 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులను ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణ ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాలల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:13 - July 20, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులను ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణ ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాలల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - villagers