vimalakka

12:32 - March 10, 2018
16:27 - December 3, 2017

హైదరాబాద్ : కుల భోజనాలు వ్యతిరేకిస్తూ ఇందిరాపార్కులో 'టీ మాస్' జన వన భోజనాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందిరాపార్కులో చేపట్టిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పలువురు హాజరయ్యారు. రాఘవులు, తమ్మినేని, టి.టిడిపి నేత ఎల్ .రమణ, విమలక్క, గద్దర్, జాన్ వెస్లీ, మాదాల రవి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురు నేతలతో మాట్లాడింది. ప్రభుత్వ..ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తామని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని విమలక్క పేర్కొన్నారు. పూలే..అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా టీ మాస్ జన వన భోజనాలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని జాన్ వెస్లీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కులాలకతీతంగా జనభోజనాలు నిర్వహిస్తున్నట్లు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సన్మానం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో జన భోజనాలు నిర్వహించడం జరుగుతోందని జాన్ వెస్లీ పేర్కొన్నారు. కులాలకు వ్యతిరేకంగా..కులాలు అన్నీ సమానమంటూ టీ మాస్ తీసుకున్న జన భోజనాలు గొప్ప కార్యక్రమమని సినీ నటుడు మాదాల రవి కొనియాడారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న టీ మాస్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

18:42 - November 7, 2017

హైదరాబాద్ : కార్మిక సంఘాలు ఢిల్లీలో చేపట్టనున్న పార్లమెంట్‌ మహాధర్నాకు టీమాస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని కార్మికులందరికి 18 వేల కనీస వేతనం అమలయ్యేలా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని టీమాస్‌ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. 

 

13:48 - November 6, 2017

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ అర్బన్‌లోని ఎనుమాముల మార్కెట్‌ను  టీ మాస్ బృందం సభ్యులు  తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కంచ ఐలయ్య సందర్శించారు. అక్కడి పత్తి రైతుల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.

08:15 - November 6, 2017

భద్రాద్రి కొత్తగూడెం : పత్తి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తికి కనీస మద్దతు ధర ఎక్కడా అమలుకావడం లేదన్నారు. వ్యాపారులు వివిధ సాకులు చూపెడుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారన్నారు. సీసీఐ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. టీ.మాస్‌ ఆధ్వర్యంలో ఇవాళ వరంగల్‌ మార్కెట్‌ను సందర్శించనున్నట్టు తమ్మినేని తెలిపారు. 

07:15 - September 24, 2017

యాదాద్రి : పోరాటం ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు అరుణోదయ సమాఖ్య చైర్మన్‌ విమలక్క. యాద్రాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల గ్రామంలో బహుజన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు. ఊర్లలో ప్రజల మధ్య చక్కని అనుబంధం ఉంటుందన్నారు. అలాంటి గ్రామాలను ప్రాజెక్టులు కట్టి ముంచొద్దన్నారు విమలక్క. వేలాదిమందిని నిర్వాసితులు చేసే ప్రాజెక్టులు అవసరమా ? అని ఆమె ప్రశ్నించారు. గంధమలలో ప్రాజెక్టులు అవసరం లేదని... దీని కోసం ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరముందని విమలక్క అన్నారు. 

10:48 - September 23, 2017

రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ లో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను కార్పొరేట్ బతుకమ్మగా మారుస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు హక్కులను కాపాడుకోవాలని విమలక్క అన్నారు. తెలంగాణ వనరులను కబ్జాదారుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

 

15:00 - September 21, 2017

తల్లిదండ్రుల అడుగజాడలో నడిచిన ఓ తనయ ప్రజా సమస్యలను తన గొంతుతో ఎలుగెత్తి చాటింది. ప్రజా ఉద్యమాపంథాలో సాగిన అరుణోదయ పయాణం ఆమెది. బహుజనుల కోసం తన గాత్రన్ని ఆయుద్ధంగా చేసి గర్జించిన గనం ఆమెది. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కాళ్లకు గజ్జెకట్టి, భూజన గొంగడేసుకుని తన సంస్కృతిక దళంతో తెలంగాణ ప్రజల గొంతులను తన పాటలో మెలవించిన జానపద కళాకరణి ఆమె. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాట అత్యంత ప్రత్యేకమైంది. ఆమె తెలంగాణ పాటకు నిలువెత్తు రూపం విమలక్క...విమలక్క గురించి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

17:35 - August 8, 2017

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో అరుణోదయ సమాఖ్యకు చెందిన వసంత్‌, యాది, శ్రీనివాసరెడ్డిలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని... వారిని వెంటనే విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్‌ చేశారు. జనశక్తితో సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు విమలక్క. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని ఈ సమావేశానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌ అన్యాయాలను దేశవ్యాప్త దృష్టికి తీసుకెళ్లేందుకు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు.

16:36 - August 4, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నా చౌక్‌ను రద్దు చేయడం ద్వారా కేసీఆర్ దొరతనాన్ని బయటపెట్టారని తమ్మినేని ఆరోపించారు. రైతు కూలీ పోరాట సమితి నాయకులు శ్రీనివాసరెడ్డి, అరుణోదయ నాయకుడు యాదగిరిలను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో తెలియట్లేదని.. ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలకు తెలంగాణలో రక్షణ లేదని విమలక్క విమర్శించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - vimalakka