vitamins

13:21 - August 23, 2017

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఆకుకూరలో రాణి వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్యితోటకూర, వంటి పలు రకాలు ఉన్నాయి. ఆకు కూరలలో పీచు పదార్థంతో ఐరన్, పలు రకాల పోషక విలువలు నిండి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుంది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది.

రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.

తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.

తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.

విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

14:09 - June 23, 2017

శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా ? లేదా ? తెలుసుకోవడం ఎలానో చదవండి..
పోషకాలు..ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోళ్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి ఉంటే ఐరన్ అందలేదని అర్థం చేసుకోవాలి. ఐరన్‌ లోపం వలన చేతి గోళ్లపై చీలికలు.గీతలు ఏర్పడతాయి.
శరీర భాగాలపై మొటిమలు అధికంగా వస్తుంటాయి. ఇలా వస్తే విటమిన్ ‘ఇ’ లోపం ఉందని గ్రహించాలి. చర్మ రంధ్రాలు మూసుకపోయి..బ్యాక్టీరియా పేరుకపోవడం వల్ల మొటిమలు వస్తాయి.
శరీరానికి సరిపోయేంత అయోడిన్‌ను తీసుకోవాలి. అయోడిన్‌ను సరైన మోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
పొటాషియం అధికంగాగల అరటిపండు, స్పినాచ్‌, బ్రోకలీ, ద్రాక్ష పండ్లను తినాలి. ముఖం లేదా ఈ విటమిన్‌ అధికంగాగల క్యారెట్‌, చిలకడదుంపలని ఎక్కువగా తినాలి.

11:39 - June 21, 2017

గోంగూర...ఆహార పదార్థంగా కాకుండా అందానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మేలుగా ఉంటుంది. పోటాషియమ్, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్ లు సమృద్ధిగా ఉంటాయి.
అంతేగాకుండా ఏ, బి 1, బి 9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను చెక్ పెడుతుంది. గోంగూరని క్రమంగా వాడితే రక్తహీనత, నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. గోంగూరను అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. గోంగూర పేస్టును తలకు పట్టించి ఉదయం..స్నానం చేస్తే జుట్టు తగ్గడం..బట్టతల రాకుండా కాపాడుతుంది.

19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

07:42 - November 25, 2015

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దానిమ్మ పండ్లలో ఉన్నాయి. అయితే, దానిమ్మ తొక్కలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దానిమ్మ తొక్కను సన్‌స్క్రీన్‌గా, మాయిశ్చరైజర్‌గా, ఫేషియల్‌స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో దానిమ్మతొక్కలో ఉండే ఏజెంట్స్ చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని కనుగొన్నారు. దానిమ్మ తొక్కను ఫౌడర్‌గా చేసి ఉపయోగిస్తే చర్మానికి అవసరమేయ్యే తేమను అందిస్తుంది. ఇది చర్మంలోని పిహెచ్‌ బ్యాలెన్స్‌ను తిరిగి పునరుద్ధరింపజేస్తుంది. అలాగే కేశ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు రాలడం అరికట్టి, చుండ్రు నివారిస్తుంది. ఈ పొడి నేచురల్‌ ఫేషియల్‌ స్క్రబ్బింగ్‌గా పనిచేస్తుంది. ఇది డెడ్‌ స్కిన్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ హెడ్స్ ను నివారిస్తుంది.

07:33 - November 25, 2015

జిగురు జిగురుగా ఉండే చేమ దుంపను తినాలంటే ఎవరూ ఇష్టపడరు. కాని దీనిలో అనేక పోషకాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేమదుంపలో విటమిన్‌ ఎ, బి1(థయామిన్‌), బి2(రిబోఫ్లేవిన్‌), బి3 (నియాసిన్‌), బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌), బి6 (పైరిడాక్సిన్‌), బి9 (ఫోలేట్‌), విటమిన్‌ సి, ప్రోటీన్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ.

  • చేమ దుంప హైపర్‌ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. సాధారణంగా వచ్చే జలుబు, జ్వరాలను నివారిస్తుంది.
  • దుంప కాబట్టి బరువు పెంచుతుందనుకోవడం సహజమే. కానీ దీనికి బరువు పెంచే లక్షణం లేదు. జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు. నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది.
  • రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అదుపు చేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరంభ్యతరంగా తీసుకోవచ్చు. చామదుంప క్రీడాకారులకు మంచి ఆహారం.
  • చేమదుంప కలోన్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. చర్మ కణాల క్షీణతను అరికడుతుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు, థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు దోహదం చేస్తుంది.

మరి ఇన్ని మంచి గుణాలున్న చేమ దుంపలను ఏకాలంలో దొరికినా తింటారు కదూ! 

Don't Miss

Subscribe to RSS - vitamins