vote

14:08 - December 7, 2018

హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారనే వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తిగా తెలుసుకోకుండా మీడియా వార్తలను ఎలా ప్రసారం చేస్తుందంటు ప్రశ్నించారు. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను తప్ప క్యూలో నిలబడలేక కాదని తెలిపారు. క్యూలో నిలుచున్న తనను ఎవరూ అభ్యంతరపెట్టలేదనీ..బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కరం నాకు లేదన్నారు దర్శకేంద్రుడు. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయమని సూచించారు రాఘవేంద్రరావు.
 

13:51 - December 7, 2018

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య సమ్రతతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ ను చూడగానే అభిమానులంతో చుట్టుముట్టారు. సెల్ఫీ అడిగిన అభిమానులను అలరించారు. కాగా కొంతసేపే క్యూ లో నిలబడ్డారు. అభిమానుల సందడి పెరిగిపోవటంతో మీడియా ఆయన చుట్టూ చేరడంతో ఎన్నికల అధికారులు మహేశ్ బాబును నమ్రతను లోపలకు తీసుకువెళ్లి ఓటు వేయించారు. దీంతో మీడియాను అదుపు చేయటం భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాల్సివచ్చింది.
 

 

12:59 - December 7, 2018

హైద‌రాబాద్: టెన్నిస్ స్టార్..తెలంగాణ ఆడబిడ్డ, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మీర్జా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇటీవ‌ల పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన సానియా మీర్జా హై ద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కాగా రాష్ట్ర‌వ్యాప్తంగా టాప్ సెల‌బ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం. కాగా ప్రజలు కూడా గత కంటే ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 23.4 శాతం ఓటింగ్ న‌మోదు అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 
 

12:41 - December 7, 2018

గజ్వేల్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటింగ్ జరుగుతోందని..టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలున్నాయని తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు కేసీఆర్ సతీసమేతంగా చింతమడక గ్రామానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
పోలింగ్ శాతం పెరుగుతుంది...
‘టీఆర్ఎస్‌కు పూర్తి చాలా అనుకూల పవనాలున్నాయి..పవనాలు రోజు మారవు..మంచి ఫలితాలుంటాయి...రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా ఉండబోతోంది..హైదరాబాద్‌‌లో ఇదే పరిస్థితి నెలకొంది...వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆస్తకి కనబరుస్తున్నారు...అంతా సానుకూలంగా ఓటింగ్ జరుగుతోంది...సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో విషయం బయటపడుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు ఉన్నారు. 

12:29 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ లో భాగంగా మెగాస్టార్ కుటుంబ సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మోగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సతీ సమేతంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
 

 

10:07 - December 7, 2018

హైదరాబాద్ : పోలింగ్ సమయంలో కొంతమంది ఓట్లు గల్లంతు కావటం సర్వసాధారణం. డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ఉదయం బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల జాబితాలో పేరు లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఆమె అసంతృప్తితో  వెనుదిరగారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదనీ..ఎందుకు తన పేరును ఓటర్ల లిస్ట్ నుండి తొలగించారో తెలియదని ఆమె వాపోయారు. 
 

09:23 - December 7, 2018

హైదరాబాద్ : ప్రతీ డైలాగ్ కు ముందు రాజా అంటు నవ్వులు పండించే ప్రముఖ నటుడు, రచయిత అయిన సోనాని కృష్ణ మురళి ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ చేసిన ఏర్పాట్లపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోసాని మాట్లాడుతు..ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని పోసాని కృష్ణమురళి ఎన్నికల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తంచేశారు. 
   

07:24 - December 7, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కరీంనగర్‌లో ఎన్నికల అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తెల్లవారుజామునే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పది నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ ప్రారంభం కాకముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 13 నియోజకవర్గాలున్నాయి. మంథని నియోజకవర్గంలో ఒక గంట ముందుగానే పోలింగ్ ముగిసేందుకు ఎన్నికల అధికారులు అనుమతినిచ్చారు. 
13 అసెంబ్లీ నియోజకవర్గాలు...
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 181 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 25 మంది పోటీ పడుతున్నారు. 27 లక్షల 85 వేల 787 మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3519 పోలింగ్ కేంద్రాలుండగా... 735 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 

07:06 - December 7, 2018

ఖమ్మం :  తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలోని రికా బజార్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం అందర్నీ ఆకర్షిస్తోంది. మహిళల కోసం ఆకట్టుకొనే విధంగా పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేశారు. స్వాగత తోరణాలు..రెడ్ కార్పెట్..పూలతో అందంగా అలంకరించారు. ఇక్కడ విధులు నిర్వహించే మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. ఎండ తగులకుండా..మంచి నీటి సదుపాయం..మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. భారతదేశ ఎన్నికల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అధికారి తెలిపారు. మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారనేది ఇక్కడ చూడవచ్చన్నారు. 
ఖమ్మంలో పది నియోజకవర్గాలు...
ఖమ్మం పది నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో 5 నియోజకవర్గాలు..భద్రాద్రి కొత్తగూడెం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుండి సాయంత్రం 4గంటలకు మాత్రమే పోలింగ్ జరుగనుంది. 

06:44 - December 7, 2018

సిద్ధిపేట : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 7వ తేదీ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 1102 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించి...ఏర్పాట్లు తెలుసుకొనేందుకు టెన్‌టివి ప్రయత్నించింది. అందులో భాగంగా 107 పోలింగ్ స్టేషన్ అంబిటస్ స్కూల్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా ఓటు వేయనున్నారు. 
పోలింగ్ కేంద్రంలో సూచనలు...
పోలింగ్ కేంద్రానికి రాగానే ఓటర్ ఎలా వ్యవహరించాలి అనే పోస్టర్‌ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం గుర్తించిన వాటిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పోలింగ్ ఎలా జరుగుతుందో చూడటానికి వెబ్ క్యాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ అధికారులు చూడనున్నారు. ఏజెంట్లు ఎవరు వస్తారనేది పార్టీలు తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. 1102 పోలింగ్ కేంద్రాలు..1612 బ్యాలెట్ యూనిట్లు ద్వారా పోలింగ్ కొనసాగించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - vote