voter id

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

13:47 - June 7, 2017
10:34 - November 12, 2016

గుంటూరు : ఏసీ సీఎం చంద్రబాబు తన ఓటు హక్కును ఉండవల్లికి మార్చుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల ఓటు హక్కును ఉండవల్లికి మార్చారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాల హక్కు వుంది. కానీ స్థానిక కేంద్రం నుండే పూర్తిస్థాయి పాలన అందించాలనీ..ప్రజలకు అందుబాటులో రాజధాని..ప్రజాప్రతినిథులు వుండాలనే ఉద్ధేశ్యంతో రాజధానికి పూర్తిగా చంద్రబాబు నివాసాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి తన ఓటుహక్కును ఏపీ రాజధాని ప్రాంతమైన ఉండవలికి మార్చుకున్నారు. అమరావతి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న నేపథ్యంలో ఓటు హక్కు ఆ ప్రాంతానికే చెంది వుండాలనే ఉద్దేశ్యంతో ఉండవల్లికి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ తో చంద్రబాబుకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లుగా భావించవచ్చు.టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వేలో కూడా చంద్రబాబు..ఆయన కుటుంబ సభ్యులు స్థానిక నివాసం ఉండవల్లిలోనే నమోదు చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఓటుహక్కు హైదరాబాద్ నుండి మార్పించుకోలేదు. 

17:21 - August 14, 2015

ఢిల్లీ: ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం ప్రక్రియ నిలిపివేయబడింది. సుప్రీంకోర్టు తీర్పుతో... ఆధార్‌, ఓటరు కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు... ప్రక్రియ నిలిపివేయాలంటూ ఆదేశించింది.

 

08:32 - July 21, 2015

కార్మిక చట్టాలు అమలు చేస్తే చాలా ప్రమాదకరమని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. టెన్ టివిలో గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో కార్మిక చట్టాల సవరణ..ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం..పార్లమెంట్ సమావేశాలు..వంటి అంశాలపై ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...
''కార్మిక చట్టాలు అడ్డంగా వస్తున్నాయని పారిశ్రామిక అధిపతులు పేర్కొంటున్నారు. పరిశ్రమలు బాగా నడవలేకపోతే ఎలా వ్యవహరించాలి ? కార్మికులను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు..ఎప్పుడైనా తీసేయవచ్చు అనే ధోరణిలో యాజమాన్యాలు ఉంటున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్టు కార్మికుల నిషేధ నియంత్రణ చట్టం సవరించి స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొంటున్నాయి. అమెరికాలాంటి దేశాల్లో ఇలాంటి విధానం ఉంది. దేశ ఆర్తిక వ్యవస్థ, సమాజం ఎంటో చూడాలి. లాభం రానప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వడం..బోనస్..వారి స్థితి గతులు ఎలా చూడాలని వారు పేర్కొనడం సబబుగానే ఉంది. కానీ ఇక్కడ పారిశ్రామిక రంగ స్వభావం..దేశ ఆర్థిక వ్యవస్థ చూడాలి. అమెరికాలో పర్మినెంట్ ఉద్యోగి కన్నా కాంట్రాక్టుగా పనిచేసే కార్మికుడి జీతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. అమెరికాలో కార్మికుడికి సోషల్ సెక్యూర్టీ ఉంది. ఇక్కడ ఉందా ? కార్పొరేట్ రంగం బాధ్యాతాయుతంగా ఉందా ? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందా ? బలమైన సామాజిక భద్రత ఉందా ? పారిశ్రామిక అశాంతి కలుగ చేస్తుంది. కార్మిక చట్టాలు అమలు చేస్తే చాలా ప్రమాదకరం'' అని పేర్కొన్నారు. అలాగే ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం..పార్లమెంట్ సమావేశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. 

Don't Miss

Subscribe to RSS - voter id