voters

17:32 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్టంలోని  119 నియోజక వర్గాల్లో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  రాష్ట్రంలోని 32,815  పోలింగ్ కేంద్రాలలో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని 13  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన  106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 70  శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 

11:30 - December 7, 2018

ఖమ్మం : ‘ఉదయం 7గంటలకు వచ్చినం..ఇంకా క్యూ లైన్‌లోనే ఉన్నం..ఇంకా ఓటేయ్యలే’..అంటూ ఖమ్మం ఓటర్లు పేర్కొంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ఆలోచనలు అమలు చేశారు. ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చే వికలాంగులకు గ్రీన్ కార్పెట్ ద్వారా స్వాగతం పలుకుతున్నారు. పలు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే..భారీగా ఓటర్లు తరలిరావడంతో చాంతాడంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. తాము ఉదయమే వచ్చినా ఇంకా ఓటు వేయలేదన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం...మాక్ పోలింగ్ లేటుగా నిర్వహించడంతో...పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

10:59 - December 5, 2018

హైదరాబాద్ : బాలయ్య అంటే ఏంటీ.. తొడగొట్టుడు.. పంచ్ డైలాగ్స్ పేల్చుడు. సినిమాల్లో అయితే ఓకే.. రియల్ గానూ ఇదే విధంగా మాత్రం ఊరుకుంటారా ఏంటీ.. అస్సలు ఊరుకోరు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ తిరుగుతున్న బాలయ్య.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఉద్యోగులతోనే పెట్టుకున్నారు ఈసారి. ఐటీ ఎంప్లాయిస్ స్పెల్లింగ్స్ కూడా రావని.. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే ఇంగ్లీష్ నేర్చుకున్నారని.. ఇంగ్లీష్ భాష అప్పుడే ఐటీ ఉద్యోగులకు వచ్చిందంటూ తన ధోరణిలో చెప్పుకుపోయారు. ఇక్కడే ఐటీ వాళ్లకు కాలింది. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియాలు చదువుకుని వస్తే.. బాబుగారు స్పెల్లింగ్స్ నేర్పించటం ఏంటీనే ఇగో హర్ట్ అయ్యింది. అసలే ఐటీ ఉద్యోగులు.. ఊరుకుంటారా ఏంటీ వెంటనే ఎన్నికల సంఘానికి బాలయ్యపై కంప్లయింట్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా సూచించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేమైనా సినిమానా అని ప్రశ్నిస్తూనే.. అంతా రీల్ కాదు.. రియల్ లైఫ్ కూడా ఉందని చురకలు అంటిస్తున్నారు.
రాజకీయాల్లోకి ఐటీ ఉద్యోగులను లాగొద్దు :
రాజకీయాల్లోకి ఐటీ ఉద్యోగులను లాగొద్దని కూడా సూచించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాకే..ఐటీ ఉద్యోగులకు స్పెల్పింగ్ నేర్పించారంటూ వ్యాఖ్యలు చేయడం అభ్యంతకరమని తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఐటీ అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ తమ మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ రంగం అభివృద్ధి అనేది ఐటీ ఉద్యోగుల వల్లే జరుగుతుందని..ఏ ఒక్కరి కృషితో జరగదన్నారు. మరి ఐటీ ఉద్యోగుల ఫిర్యాదుతో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి...

09:15 - December 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ - మహారాష్ట్ర - ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్..టెన్షన్..వాతావరణం నెలకొంది. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయని పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందచేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కొద్ది రోజుల కిందటే ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించాలంటే పోలీసుల నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పకుండా గ్రామాలకు వెళ్లొద్దని ఆయా అభ్యర్థులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
అభ్యర్థులకు అదనపు భద్రత...?
కరీంనగర్..ఆదిలాబాద్..ఖమ్మం అభ్యర్థులకు అదనపు భధ్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రత నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు...ఎన్నికలు పూర్తయ్యే దాక అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 
ఛత్తీస్ గడ్‌లో ఎన్ కౌంటర్...
కొద్ది రోజుల క్రితం ఎమ్యెల్యే కిడారి సోమ, మాజీ ఎమ్యెల్యే హత్య అనంతరం ఏపీ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. అంతేగాకుండా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను అడ్డుకొనేందుకు మావోలు ప్రయత్నించారు. పోలింగ్‌కు ముందు రోజు మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. మొదటి దశ పోలింగ్ సమయంలో బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. 

 

12:02 - November 30, 2018

Image result for Thumb Emoji మెసేజ్..వాయిస్ కాల్స్‌తో అభ్యర్థుల ప్రచారం...
Image result for Thumb Emoji ఫోన్  నెంబర్ల సేకరణ...
Image result for Thumb Emoji 2014 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రచారం...
Image result for Thumb Emoji బల్క్ మేసేజ్‌లు...
Image result for Thumb Emoji స్మార్ట్ యుగంలో స్మార్ట్ ప్రచారం...
హైదరాబాద్ :
ఫోన్ రింగ్ కాగానే ఏమంటాం..హాలో అంటాం..అవతలి నుండి పరిచయం లేని గొంతు వినిపిస్తుంది..నేను ఎమ్మెల్యే అభ్యర్థిని..మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి...మీ సమస్యలను పరిష్కరిస్తా..అర్థమ్మయ్యేలోపు ఫోన్ కట్ అవుతుంది. ఎన్నో రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లను కలిసేవారు. కొన్ని ప్రాంతాలు మిగిలి ఉండడం..కొంతమంది ఓటర్లు కలవలేక అభ్యర్థులు పలు సమస్యలు ఎదుర్కొనే వారు. ఇలాంటి సమయంలో మారుతున్నకాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యర్థులు వాడుకుంటున్నారు. కాల్ సెంటర్ల ద్వారా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ వాయిస్ రికార్డు చేసి ఓటర్లకు ఫోన్ చేసి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 
హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని ప్రజలకు కాల్ సెంటర్ల నుండి ఫోన్‌లు వస్తున్నాయి. పలు ఏజెన్సీల ద్వారా ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరించి..వారికి కాల్ సెంటర్ల ద్వారా ఫోన్ వాయిస్ వెళ్లే విధంగా చూస్తున్నారు. నియోజకవర్గంతో ప్రచారం చేసినా..కాల్స్ ద్వారా మరింత ప్రచారం జరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఒక్కో ఫోన్ కాల్‌కు 60 పైసలు ఖర్చవుతోంది. వాట్సప్ మేసేజ్..వాయిస్ మేసేజ్‌ల ద్వారా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి మారుతున్న కాలానికి అనుగుణంగా తమకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకుని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు అభ్యర్థులు. 

18:05 - November 28, 2018

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మద్యప్రదేశ్‌లో 230 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 65.5 శాతం ఓటింగ్ నమోదు కాగా మిజోరంలో 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
కొన్ని చోట్ల ఈవీఎం యంత్రాలు మొరాయించగా... కొన్ని చోట్ల రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మిజోరంలో మధ్యాహ్నం 3 గంటలకు 65 శాతం ఓట్లు నమోదుకాగా, మధ్యప్రదేశ్‌లో 2 గంటలకు కేవలం 34.99 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 23 పోలింగ్ బూతుల్లో ఎవీఎంల పనిచేయకపోవడంతో పోలింగ్ అక్కడ ఆలస్యం అయ్యింది.
 

 

09:58 - November 28, 2018

ఢిల్లీ: మధ్యప్రదేశ్,మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్ధానాలకు మిజోరంలో 40 స్ధానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.ఒకే విడతలో ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్  జరుగుతుంది.  
మధ్యప్రదేశ్ లో  ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు, మిజోరంలో  ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్  జరుగుతుంది. 
మధ్యప్రదేశ్ లో 230 స్ధానాలకు 2,899 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, మొత్తం 5,04.95.251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, లంజీ,బైహార్, పరస్వాద్ లలో  మధ్యాహ్నం 3గటలవరకే పోలింగ్ జరుగుతుంది.  17 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగు గుర్తించి అక్కడ భద్రత పెంచారు.  పోలింగ్ కోసం 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నారు.  2లక్షలమంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద  భద్రత ఏర్పాటు చేశారు.   4వ సారి అధికారం  కోసం బీజేపీ  ప్రయత్నిస్తుండగా, 15 ఏళ్ల  తర్వాత అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 
> అధికార బీజేపీ 230 స్ధానాలకు 
> కాంగ్రెస్ 229స్ధానాలకు 
>లోక్ తాంత్రిక్ జనతాదళ్ 1
>227 బీస్పీ
>51 సమాజ్ వాది పార్టీ
>ఆమ్ ఆద్మీ 208 స్ధానాల్లో పోటీ చేస్తున్నాయి.
మిజోరంలో  7.7 లక్షల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  2008 , 2013 లో అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సారి కూడా అధికారాన్ని  చేజిక్కించుకోవాలని యత్నిస్తోంది. మిజోరంలో 40 అసెంబ్లీ  స్ధానాలకు 209 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా  కాంగ్రెస్, మిజో నేషనల్  ఫ్రంట్ మధ్య  పోటీ నెలకొని ఉంది. 

 

 

10:57 - November 26, 2018

హైదరాబాద్ : ఒక్క పక్క పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల అభ్యర్థులు ఓటర్లను వివిధ రకాల ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయాలని కోరుకోవటం సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ నిఘా కన్నునుండి కూడా తప్పించుకుని అభ్యర్థులు ఓటర్లకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్తువులే కాకుండా నగదును కూడా నిఘాకన్నుకు చిక్కకుండా అందజేసేందుకు నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థులు కొత్తదారి కనిబెట్టారు.
పేటీఎం ద్వారా ఓటర్లకు నాయకుల నగదు తరలింపు..
డబ్బులు, మద్యం తరలింపులపై తనిఖీలను ఉదృతం చేస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కొత్త దారిని  ఎంచుకున్నారు. అదే ‘పేటీఎం యాప్’. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ హవా కొనసాగుతున్న తరుణంలో రాజకీయ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజల వద్ద వారి  ఫోన్ నంబర్లు తీసుకుంటు రాత్రి సమయంలో గుట్టుగా వాళ్ల పేటీఎం వ్యాలెట్ కు నగదును బదిలీ చేస్తున్నారు. దీనికోసం నేతలు ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని కూడా నియమించుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి వచ్చే యువతకు, మహిళలకు కూడా పేటీఏం ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు.  ఈరోజుల్లో చాలా వరకూ నగదు తరలింపులు ఆన్ లైన్ ద్వారానే కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ ట్రాన్సక్షన్ పై కూడా ఎన్నికల సంఘం నిఘా పెట్టాల్సిన అవసరం వుంది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లుగా..రాజకీయ నాయకుల అతి తెలివి తేటలకు ఈసీ చెక్  పెట్టాల్సిన అవసరం కూడా వుంది. 
 

16:36 - November 23, 2018

జగిత్యాల :ఎన్నికల్లో గెలుపు ఓటముల సంగతేమోకానీ, ప్రచార దశలో, ఓటర్లు, అభ్యర్థులకు చుక్కలు చూపించేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వస్తున్న వారిని నిలదీయడమే కాదు.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ హామీ పత్రాలు రాసివ్వమని నిలదీస్తున్నారు. జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి  ఇలాంటిదే విచిత్ర అనుభవం ఎదురైంది. ఓట్లు అడిగేందుకు గ్రామానికి వచ్చిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డని, జనగామ జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెప్పారు. చెరువు నిర్మాణం, నాగిరెడ్డిపల్లి-కొన్నె మధ్య బీటీ రోడ్డు నిర్మాణం, మార్కెట్‌యార్డ్ నిర్మాణానికి భూమి విరాళం ఇస్తానంటూ హామీ పత్రం ఇవ్వాలని పట్టుబట్టారు. ఆమేరకు గ్రామస్తులే బాండ్‌పేపర్‌పై ప్రమాణాన్నీ సిద్ధం చేశారు. ఈ హామీలన్నింటినీ మూడు నెలల్లోపు నెరవేరుస్తామంటేనే ఓట్లేస్తామని కుండబద్దలు కొట్టారు. వారి కోర్కెలు తీర్చలేను అనుకున్నారో.. లేక వారివి గొంతెమ్మ కోర్కెలు అనుకున్నారో తెలియదు కానీ, ముత్తిరెడ్డి గారు, వారికి ఏ హామీ ఇవ్వకుండానే అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - voters