Voting

08:44 - December 9, 2018

హైదరాబాద్ : డిసెంబర్ 11...అందరిలోనూ ఉత్కంఠ...ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ? మళ్లీ గులాబీ గుభాలిస్తుందా లేక మహాకూటమి అధికారం చేపడుతుందా ? అనే ప్రశ్నలకు డిసెంబర్ 11న సమాధానం రానుంది. దీనితో అటు పార్టీలో..ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగిన పోలింగ్‌ దేశ దృష్టిని ఆకర్శించింది. డిసెంబర్ 11న జరిగే 
కౌంటింగ్ కేంద్రాల వివరాలు...

  • మేడ్చల్ : 5 నియోజకవర్గాలు. కీసర హోలీమేరీ ఇంజినీరింగ్ కాలేజీ.
  • రంగారెడ్డి జిల్లా : 8 నియోజకవర్గాలు. 4 నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్ నగర్ : పాలమాకులలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్. 
  • రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి : పాలమాకులలోని ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ.
  • జగిత్యాల : 3 నియోజకవర్గాలు. జగిత్యాల వీఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ.
  • సిరిసిల్ల : 2 నియోజకవర్గాలు. తంగళ్లపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్. 
  • పెద్దపల్లి : 3 నియోజకవర్గాలు. మంథని జేఎన్టీయూహెచ్‌. 
  • కరీంనగర్ : 4 నియోజకవర్గాలు. జిల్లా హెడ్ క్వార్టర్‌ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ.
  • కొమురం భీం ఆసిఫాబాద్ : 2 నియోజకవర్గాలు. ఆసిఫాబాద్‌ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ.
  • మంచిర్యాల : 3 నియోజకవర్గాలు. ఏఎంసీ గోదాం. 
  • ఆదిలాబాద్ : 2 నియోజకవర్గాలు. ఆదిలాబాద్‌ టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌.
  • వికారాబాద్ : 4 నియోజకవర్గాలు. వికారాబాద్‌లోని అగ్రికల్చర్ మార్కెట్‌. 
  • సంగారెడ్డి : 5 అసెంబ్లీ నియోజకవర్గాలు. గీతం యూనివర్సిటీ.
  • మెదక్ : 2 నియోజకవర్గాలు. వైపీఆర్ కాలేజ్‌.
  • సిద్దిపేట : 4 నియోజకవర్గాలు. సిద్దిపేట ఇందూరు ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీ.
  • కామారెడ్డి : 3 నియోజకవర్గాలు. ఏఎంసీ గోదాం.
  • నిర్మల్ : 3 నియోజకవర్గాలు. నిర్మల్‌ పాలిటెక్నిక్ కాలేజీ. 
  • నిజామాబాద్ : 6 నియోజకవర్గాలు. నిజామాబాద్‌ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. 
  • నల్గొండ : 6 నియోజకవర్గాలు. దుప్పలాపల్లి టీఎస్ హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్‌. 
  • సూర్యాపేట : 4 నియోజకవర్గాలు. సూర్యాపేటలోని ఏఎంసీ గోదాం.
  • యాదాద్రి భువనగిరి : 2 నియోజకవర్గాలు. భువనగిరి అరోరా ఇంజినీరింగ్ కాలేజీ.
  • జనగామ : 3 నియోజకవర్గాలు. పెంబర్తి వీబీఐటీ.
  • మహబూబాబాద్ : 2 నియోజకవర్గాలు. ఫాతిమా హైస్కూల్. 
  • మహబూబ్ నగర్ : 5 నియోజకవర్గాలు. నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల కౌంటింగ్ ధర్మపూర్‌ జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల కౌంటింగ్‌ జేపీ కాలేజీలోని అబ్దుల్ కలాం బిల్డింగ్‌. 
  • నాగర్ కర్నూల్ : 3 నియోజకవర్గాలు : నెల్లకొండలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డు.
  • వనపర్తి : న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్‌. 
  • జోగులాంబ గద్వాల : 2 నియోజకవర్గాలు. కౌంటింగ్‌ గద్వాల ఎస్‌కేటీఆర్ కాలేజీ ఓల్డ్ బిల్డింగ్‌.
  • వరంగల్ రూరల్ : 2 నియోజకవర్గాలు : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ యార్డు. 
  • వరంగల్ అర్బన్ : 3 నియోజకవర్గాలు. ఏనుమాముల మార్కెట్ ఎంఎల్‌ఎస్ గోదాం. 
  • భూపాలపల్లి : 2 నియోజకవర్గాలు : అంబేద్కర్ స్టేడియం.
  • భద్రాద్రి కొత్తగూడెం : 5 నియోజకవర్గాలు. కౌంటింగ్ పాల్వంచలోని అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తారు.
  • ఖమ్మం : 5 నియోజకవర్గాలు. ఖమ్మం విజయ ఇంజినీరింగ్ కాలేజీ.
  • హైదరాబాద్ నియోజకవర్గంలో 15 కౌంటింగ్ కేంద్రాలు.
07:51 - December 9, 2018

మధిరలో ఆసక్తికర పోరాటం..
పట్టు వదలని విక్రమార్కుడు..
భట్టితో మూడోసారి కమల్ రాజు ఢీ...
మధిర :
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఓటర్లు అందరికీ ఆదర్శంగా నిలిచారు. దూర ప్రాంతాల నుండి మరీ తరలివచ్చి ఓటు వేయడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. ఏకంగా 91.65 శాతం నమోదై రికార్డు నెలకొల్పింది. గత ఎన్నికల్లో 89.88 పోలింగ్ నమోదైంది. 
ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గంలో మహాకూటమి తరపున భట్టి విక్రమార్క...టీఆర్ఎస్ తరపున కమల్ రాజ్...బీఎల్ఎఫ్ నుండి రాంబాబులు పోటీ చేశారు. మధిరలో హ్యాట్రిక్‌ సాధించాలని భట్టి పట్టుదలతో ఉండగా...ఈసారైనా బోణీ కొట్టాలని రాజు ఆశిస్తున్నారు.
పోలింగ్ శాతం నమోదు కావడంతో విజయం ఎవరిది ? గెలుపు ఎవరిని వరిస్తుంది ? అనే ఉత్కంఠ నెలకొంది. 
2014 ఎన్నికల్లో మధిర నుండి సీపీఎం అభ్యర్థి కమల్ రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2009లో పోటీ పడిన వీరు మరోసారి 2018లో కూడా తలపడ్డారు. కానీ కమల్ రాజు ఈసారి టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. భారీ పోలింగ్ ఎవరికి లబ్ది చేకూరనుందోననే చర్చ జోరుగా కొనసాగుతోంది. 

 

16:19 - December 7, 2018

జైపూర్‌ (రాజస్థాన్) :  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం పోలింగ్‌ కొనసాగుతోంది. జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ సింగ్‌, ఆయన సతీమణి సర్దార్‌పురా నియోజకవర్గంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం కుటుంబీకుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 4.77 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 

16:02 - December 7, 2018

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల మధ్య టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సరదా సరదా ముచ్చట్లు జరిగాయి. హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొని సిరిసిల్లకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలోని సిద్దిపేటలో  హరీష్ రావు‌ను కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా..ఆదరంగా పలకరించుకున్నారు. అంతేకాదు బావా!లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని హరీష్‌తో కేటీఆర్ అంటు సరదాగా..ధీమాగా..ఆప్యాయంగా పలకరించుకోవటంతో ఆహ్లాదకరణ వాతావరణం నెలకొంది. 
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  పోలింగ్ ఎలా వుందో తెలుసుకుంటు హరీష్ రావు  నియోజవర్గంలోని  గ్రామాలు తిరుగుతున్న సమయంలో  గుర్రాలగొంది గ్రామం వద్ద మంత్రి కేటీఆర్, హరీశ్ రావుల కాన్వాయ్ లు  ఎదురెదురుగా వచ్చాయి. దీంతో ఇద్దరు కార్లు దిగి రానున్న మెజారిటీపై ముచ్చటించుకున్నారు. 
అంతేకాదు నీకు వచ్చే మెజారిటీలో కనీసం సగం మెజారిటీ అన్న తెచ్చుకొంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పోతున్నానను.. మీ వాళ్లంతా అక్కడ నీ కోసం ఎదురుచూస్తున్నారని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. 
ఈ మాటలు అనగానే  హరీష్ రావు నవ్వుతూ ఆప్యాయంగా  కేటీఆర్ ను హత్తుకొన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణను విన్న కార్యకర్తలు  సరదాగా నవ్వుకున్నారు.
 

13:58 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లరు అనూహ్యంగా స్పందించారు. మధ్యాహ్నం 1గంటకే 48.3 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివ‌ృద్ధి చేయలేదని...హామీలిచ్చి మరిచిపోయారంటూ..అందుకే ఓటుకు దూరంగా ఉంటున్నామన్నారు. ఓటు వేయాలని..ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే ‘నో్టా’ అనే ఆఫ్షన్ ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 
వనపర్తి...ఎస్టీ కాలనీ...
ఎలాంటి అభివృద్ధి చేయలేదని..హామీలిచ్చి మోసం చేశారంటూ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్టీ కాలనీ గ్రామ ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఏ పార్టీకి ఓటేసేది లేదని గిరిజనులు ఖరాఖండిగా చెబుతున్నారు. వీరికి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. 
రంగాపురంలో ఘర్షణ...
సూర్యాపేట జిల్లా మోతె మండలం కోదాడ నియోజకవర్గంలో రంగాపురంలో ఘర్షణ నెలకొంది. పాలకులు ఎలాంటి అభివృద్ది చేయలేదని...నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అవసరం లేదని బహిష్కరించారు. ఇతరులను కూడా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటును బహిష్కరించిన వారితో అధికారులు మాట్లాడి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. 
లక్ష్మీపురం గ్రామస్థులు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గట్టు లక్షీపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని..రాజకీయ నేతలు..అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వారు వాపోయారు. తాము ఇతర ఊరికి వెళ్లి చదవాలంటే సర్టిఫికేట్ కావాలంటున్నారని..తమకు ఇవ్వాలని కోరుతున్నా స్పందించడం లేదని...దీనికి నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

11:08 - December 7, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి నగరంలోని ప్రశాసన్‌నగర్‌లో గల సెరికల్చర్ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకోగా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నాంపల్లిలోని హనుమాన్ వ్యాయమశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలసి సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్.. నిర్మల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో గల పోలింగ్ బూత్‌లో జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి.. సిద్దిపేట పట్టణం నాసర్‌పురా ఉర్థూ మీడియం స్కూల్లో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగా..అడిషనల్ కమిషన్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
తెలంగాణ, హైదరాబాద్, ఎన్నికలు, ప్రభుత్వ అధికారులు, ఓటుహక్కు, వినియోగం,జీహెచ్‌ఎంసీ, కమిషనర్, దానకిశోర్,కమిషనర్ ఆఫ్ 

09:56 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుండే కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడం...మాక్ పోలింగ్ ఆలస్యం కావడంతో ఓటర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులు..సీనియర్ సిటిజన్స్ సైతం ఓటు వేయడానికి ఆసక్తి కననబరుస్తున్నారు. సెలబ్రెటీలు సైతం ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. 
ఆకర్షనీయంగా పోలింగ్ కేంద్రాలు...
మరోవైపు ఓటు శాతం పెరిగేందుకు పలు కేంద్రాలను అందంగా అలకరించడం..మొదటి ఓటర్‌కు పుష్పగుచ్చాలు ఇవ్వడం..వేసిన ఓటర్లకు మొక్కలు ఇవ్వడం..పలు ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేక పోలింగ్ ఏర్పాటు చేయడం విశేషం. 
ఓటింగ్ శాతం...
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికల్లో 60 శాతం నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం నమోదు కావడం విశేషం. 
నాగార్జున సాగర్ 7.4 శాతం...నల్గొండ 9.0 శాతం...ఖమ్మం 10.0 శాతం..పాలేరు 9.0 శాతం...మధిర 9.0 శాతం...అంబర్ పేట 6.0 శాతం...ముషీరాబాద్ 6.5 శాతం...చాంద్రాయణగుట్ట 6.2 శాతం...ఆదిలాబాద్ 9.0 శాతం...కరీంనగర్ 8.0 శాతం...నిజామాబాద్ 7.5 శాతం...వరంగల్ 10.0 శాతం...మెదక్ 14.0 శాతం...రంగారెడ్డి 10.0 శాతం...హైదరాబాద్ 7.0 శాతం...నల్గొండ 8.5 శాతం...మహబూబ్ నగర్ 11.5 శాతం...ఖమ్మం 9.5 శాతం...ఆదిలాబాద్ 8.0 శాతం...గజ్వేల్ 7.0 శాతం...సిద్దిపేట 10.4 శాతం...సిరిసిల్ల 7.0 శాతం...హుజూర్ నగర్ 8.0 శాతం...కొడంగల్ 8.0 శాతం...గద్వాల 7.8 శాతం...హుస్నాబాద్ 7.0 శాతం...నాగార్జునన సాగర్ 7.4 శాతం...నమోదైంది. 

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

11:04 - December 3, 2018

హైదరాబాద్: ఇప్పటి యూత్‌కు సెల్ఫీల పిచ్చి బాగా ఉంది. మూడ్ వస్తే చాలు సెల్ఫీలు దిగేస్తున్నారు. ప్లేస్ ఏదైనా, సందర్భం మరేదైనా అస్సలు పట్టించుకోవడం లేదు. సెల్ఫీలు దిగడం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టడం.. వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. ఈ క్రమంలో సెల్ఫీలకు బాగా అడిక్ట్ అయిపోయారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఏం చేసినా అనేవాళ్లు లేరు కదా అని డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ దిగితే.. ఆ ఓటును రద్దు చేస్తారు.
పక్కన పడేస్తారు:
ఇలా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం 49ఎం(ఓటు రహస్యం) అనే నియమాన్ని ఉల్లంఘించడమే అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అంటే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. సో.. సెల్ఫీ పిచ్చోళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.. ఆ తర్వాత చింతించినా లాభం ఉండదు.
ప్రతి ఓటరు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన నిబంధనలు:
* నిబంధనల ప్రకారం పోలింగ్‌ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం.
* ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు అతడిని బయటకు పంపేస్తారు.
* ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను అని బూత్‌లో చెప్పడం కూడా నేరమే. వారిని ఓటు వేయనీయరు.
* దివ్యాంగులు ఓటు వేయడానికి సహాయకుడిగా ఒకరిని అనుమతిస్తారు.
* అదే వ్యక్తిని మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా అనుమతించరు.
* పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
* ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు డౌట్ వచ్చినా పోలింగ్‌ ఏజెంట్లు ప్రిసైడింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్‌ గది వరకు వెళ్లొచ్చు.
* అధికారి మాత్రమే అక్కడ ఏమీ జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు.
* ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్‌ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు.

16:59 - November 24, 2018

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఓటువేసేలా వారిని చైతన్య పరిచేందుకు టీటా (తెలంగాణ ఇన్ఫరమేషన్ టెక్నాలజీ అసోసియేషన్) ‘ఉంగ్లీ చాలెంజ్’ పేరుతో మరో ప్రజా చైతన్య ఉద్యమానికి తెరలేపింది.  లుంగీ డ్యాన్స్ లాగా ‘ఉంగ్లీ డ్యాన్స్’ పేరుతో టీటా వ్యవస్థాపక అధ్యక్షులు సుందీప్ కుమార్ డ్యాన్స్ చేస్తూ ఎఫ్బీలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తన చాలెంజ్‌తో టెకీలను ఆకర్షిస్తున్నాడు.  
అధికారిక లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కేవలం 54 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టెకీలు ఎక్కువగా నివసించే శేరిలింగంపల్లి, కుకట్‌పల్లి నియోజకవర్గాల్లో కేవలం 32 శాతం ఓటింగ్ నమోదయ్యింది. టెకీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని.. కాబట్టి ఈ ఉంగ్లీ చాలెంజ్‌లో భాగంగా ముందుగా నిర్ణయించిన డ్యాన్స్ కొరియాగ్రఫీకి అనుగుణంగా డ్యాన్స్ చేయాలని ఓటు హక్కు ఉపయోగించుకొనేందుకు టెకీలందరిలో చైతన్యం తెచ్చేందుకు కృషిచేయాలని టీటా పిలుపునిస్తోంది. ఉంగ్లీ చాలెంజ్‌లో భాగంగా తమ తమ మెస్సేజీలను, ఉంగ్లీ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టు చేయాలని టీటా కోరుతోంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Voting