water problems

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.
ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది.
నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.
వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌లో ఏపీ సాక్షిని ప్రశ్నించడం పూర్తైంది. మూడు రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. ఏపీ సాక్షి, వ్యవసారంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సమాధానాలు వేగంగా చెప్పాలని ఒకదశలో సత్యనారాయణకు ట్రైబ్యునల్ సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 7 నుంచి 9 వరకు జరుగుతుంది.
మహబూబ్ నగర్ : వేసవి మొదలయిందో లేదో తెలంగాణ వ్యాప్తంగా తాగునీకష్టాలు ప్రారంభమయ్యాయి. గుక్కెడు మంచినీటీ కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. పట్టణాలు దాహంతో విలవిల్లాడుతున్నాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి పాలమూర్ జిల్లా తాగునీటి కష్టాలపై టెన్‌టీవీ ఫోకస్.
పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. జూరాల పై ఆధాపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి.. దీంతో జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు ముంచుకొచ్చాయి. 42 లక్షల జనాభా గల ఉమ్మడి పాలమూర్ జిల్లాలో సగానికి పైగా జూరాల ప్రాజెక్ట్ ఆధారంగానే తాగునీటి సరఫరా జరుగుతోంది. కానీ జూరల జలాశయంలో నీరు అడుగంతుండంతో రామన్ పాడు, కోయిల్ సాగర్, జమ్ములమ్మ రిజర్వాయర్ల పరిస్దితి ఆందోళనకరంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల , వనపర్తి, నారాయణపేట, షాద్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అయిజ, కల్వకుర్తి మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు వివిధ వాటర్ స్కీంల ద్వారా నీటి సరఫరా అవుతోంది. జూరాల, రామన్ పాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి జములమ్మ రిజర్వాయర్ తో గద్వాల మున్సిపాలిటీకి రామన్ పాడు రిజర్వాయర్ నుంచే వనపర్తి తో పాటు నాగర్ కర్నూల్, అచ్చంపేట నగరపంచాయతీలకు నీటి సరఫరా జరుగుతోంది. నారాయణపేట మున్సిపాలిటీ, కల్వకుర్తి, షాద్ నగర్ మున్సిపాలిటీలకి మాత్రం బోర్లే దిక్కుగా మారింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బోర్లు ఎండిపోవటంతో తాగునీటి కటకటగా మారింది.
కల్వకుర్తి జనాభా 35 వేలు. పట్టణంలో బోర్లు ఎండిపోవటంతో జనానికి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయిజ మున్సిపాలిటీ పరిధిలో 35 వేల జనాభా ఉండగా.. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్ళు సరిపోవట్లేదు. అచ్చంపేట జనాభా 25 వేలుంటే ఈ మున్సిపాలిటీకి కూడా రామన్‌పాడు ప్రాజెక్టు ఆధారం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర్లోనే ఉన్నా క్రిష్ణానది పక్కనే పారుతున్నా అచ్చంపేటకు నీరు సప్లయ్ కావడం లేదు.
అటు వనపర్తి పట్ట ప్రజలను తాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. తాగునీటి అవసరా కోసం రెండు స్కీంలు పెట్టామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. వీటిలో ఒకటి పడకేసి ఏడాదైంది. రెండో దానికి ఎప్పుడూ ఏదో సమస్య వస్తూనే ఉంది. ఇక్కడి తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రామన్‌పాడు పాత స్కీం గత ఏడాది కాలంగా నిరుపయోగకంగా మారింది. ఇంటెక్విల్, ఎర్రగట్టు, కానాయపల్లి వద్ద పనిచేయాల్సిన మూడు మోటార్లు చెడిపోయినా వాటి గురించి పట్టించుకునే వారు లేరు. కొత్త మోటారుల కొనుగోలుకు రూ. 40 నుంచి 50 లక్షలు వెచ్చిస్తే పథకం దారిలో పడుతుందని స్ధానికులు అంటున్నారు. నాయకులు, అధికారులు ఎప్పటికప్పడు హామీల వరదలు పారిస్తున్నా.. గొంతు తడుపుకోను గుక్కెడు నీరులేక పాలమూరుజిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.
హైదరాబాద్ : మిషన్ భగీరథ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తాగునీటి పేరుతో ప్రభుత్వమే అడ్డగోలుగా... కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కమీషన్ల కోసమే ఆంధ్రా గుత్తేదారులకు కాంట్రాక్టులు అప్పగించారన్న జీవన్ రెడ్డి.. దీనిపై న్యాయ విచారణ జరిపిస్తే.. వాస్తవాలు బయటికొస్తాయని తెలిపారు.
పెద్దపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతన్నలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ ఆగ్రహం ఎలా ఉంటుందో ఆ ప్రజాప్రతినిధులకు చూపెట్టారు. రైతులు చేసిన ఆందోళనతో ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహాయంతో వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను చేపట్టారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీకి చెందిన గోదాంలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వారు ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డు తగిలారు. తమ పంటలు ఎండిపోతున్నాయని..సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారు ? అని రైతులు నిలదీశారు. రైతుల ఆగ్రహం చూసిన ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహయంతో వెనుదిరిగారు.
హైదరాబాద్ : పేరుకు విశ్వనగరం.. మురికివాడల్లో జనానికి నిత్యం నరకం.. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా కనీస సౌకర్యాలులేని అభాగ్యులు ఎందరో..! సొంత ఇంటికోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బస్తీవాసులు. కాగితాలకే పరిమితం అయిన ప్రభుత్వాధినేతల ప్రకటనలు. హైదరాబాద్ అడిక్‌మెట్ ఏరియాల్లో మురికివాడల పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్..
టీ.సర్కార్‌పై ప్రజలు మండిపాటు
ప్రపంచ నగరం, దేశానికే రెండో రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్‌పై హైదరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని అడిక్ మెట్, వడ్డెర బస్తీ లో నిరుపేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . ఉండటానికి సొంత ఇళ్లులేక ..ఇరుకైన గుడిసెల్లో ..వానకు తడుస్తూ..ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు..
చాలీ చాలనీ ఆదాయంతో జీవనం
అడిక్‌మెట్ మురికివాడలోని పేదలంతా ఇండ్లలో పని చేస్తూ చాలీ చాలనీ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కనీసీం తాగునీరు కూడా దొరకని పరిస్థితినెలకొంది. వేసవి రాకముందే ఈ బస్తీలో నీటి ఎద్దడి మొదలైంది. మంచి నీటి సంగతి అలా ఉంచితే.. బస్తీలో డ్రైనేజి వ్యవస్థల సరిగా లేక జనం అనారోగ్యాల పాలవుతున్నారు. మరోవైపు వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైంది . వారం రోజుల కొకసారి వచ్చే నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మురికి నీరు వాడలేక..డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మహిళలు అనేక అవస్థలు
ఇక్కడి మురకివాడలో మహిళలకు కనీసం టాయిలెట్ , మరుగుదొడ్డి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు .ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైక కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళితే రైలు డీకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు . ఎన్ని సార్లు ,ప్రజా ప్రతినిధులు,అదికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు.
మహిళలకు పింఛన్ అందని పరిస్థితి
ఇక పేదల చెంతకు సంక్షేమపథకాలు చేరాలంటే.. అదో యజ్ఞమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న ఒంటరి మహిళలకు పింఛన్ అందని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బస్తీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి సొంతభనం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం అద్దెభవనంలోనే అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. అదికూడా శిథిలావస్థకు చేరుకుంది. ఎపుడు కూలి మీదపడుతుందోనని చిన్నారులు, గర్భిణీస్త్రీలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు సమస్యలు తీర్చాలని అడిక్‌మెట్ వడ్డెర బస్తీ వాసులు కోరుతున్నారు.
పోయిన సంవత్సరం కొంత మంది తనను 300,400 ర్యాంకు వస్తే ఎలా అని అడిగారు దానికి తను మొదటి ర్యాంకు కోసం ప్రయిత్నిస్తా అని చెప్పానని, మరి మొదటి ర్యాంకు వస్తే ఎం చేస్తారని అడిగితే దాన్ని నిలబెట్టుకోవడం చేస్తామని చెప్పానని జీహెచ్ఎంసీ కమిషనర్ అన్నారు. హైదరాబాద్ ను స్వచ్చ సిటీ మార్చాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
కర్నూలు : ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని జన్మభూమి కార్యక్రమం వేదికగా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించి, నీరు విడుదల చేశారు. దీనికి బుడ్డావెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. 119 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ఈ పథకం ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుందని చంద్రబాబు అన్నారు.
ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలి : చంద్రబాబు
నీళ్లు, అడవులు, ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని, రైతులకు రూ. 24వేల కోట్ల రుణమాఫీ చేశామని, రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. సాగునీటి కోసం ఇంతవరకు 50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రజల దృష్టికి తెచ్చారు. కర్నూలు జిల్లాలో కేసీ కాల్వపై నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి-మావూరు ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రంలో చంద్రబాబు పాల్గొంటారు.
కర్నూలు : జిల్లాలో నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకు ప్రాణనాడిగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి..మావూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి... నదుల అనుసంధానం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి కొత్తగా 11 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పారు.
కర్నూలు : సాక్షి... ఓ పనికిమాలిన పేపర్ అని సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిర్వహించిన 'జన్మభూమి మా ఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిసిటీ మానేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పంటలను కొనడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. పద్ధతి ప్రకారం వెళ్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అధికార యంత్రాంగాన్ని మీ గ్రామానికి పంపించామని తెలిపారు. పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని తెలిపారు. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. బెంగుళూరు వల్ల కర్నాటకకు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి నగరాలు మనకు లేవని తెలిపారు. అన్నీ ఇండ్లకు కరెంటు, వంట గ్యాస్ ఇచ్చామని పేర్కొన్నారు. మార్చి లోపు అన్ని ఇళ్లళ్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్ధకోటి పించన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఎవరైనా సహజ మరణం చెందితే చంద్రన్న పథకం కింద ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు 1500 పించన్లు ఇచ్చామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తామని చెప్పారు. అందరూ సహకరిస్తే అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. సంవత్సరాలుగా అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయన్నారు. విశాఖలో 50 వేల ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. అలసత్వం పనికి రాదని అధికారులకు సూచించారు. జవాబుదారి తనాన్ని అలవర్చుకోవాలన్నారు.
Pages
Don't Miss
