west godavari

19:08 - November 20, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అఖిలపక్షనేతలు కదం తొక్కారు. నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్షాలు, వైసీపీ, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై తీర్మానం చేసి.. కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్‌ చేశాయి. స్పాట్

అఖిలపక్షనేతలు ఛలో అసెంబ్లీ
అఖిలపక్షనేతలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం సాయంత్రం నుంచే విజయవాడ, గుంటూరులో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. చలో అసెంబ్లీకి తరలివస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడల్లో పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. మరికొందరు నేతలను గృహ నిర్బంధం విధించారు. విజయవాడ అలంకార్‌ ధర్నా చౌక్ ఆందోళనలతో హోరెత్తింది. ధర్నాచౌక్‌లో మాత్రమే నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో అఖిలక్షనేతలు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబుకు సీట్ల సంఖ్య పెంచడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి నిధులు తేవడంలో లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ, చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అనంతరం ధర్నాచౌక్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ, సహా పలువురు వామపక్ష, వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు ఈడ్చిపారేశారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించడం ఉద్రిక్తతకు దారితీసింది.

సీపీఐ నేతల గృహనిర్బంధం
ఉభయ గోదావరిజిల్లాల్లో వామపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గణపవరం, పోలవరం సీపీఎం డివిజన్‌ కార్యదర్శులతో పాటు పలువురు సీపీఐ నేతలను గృహనిర్బంధం చేశారు. గుండుగొలను, ఏలూరు ఆశ్రంవద్ద జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజమండ్రిలోని సీపీఎం కార్యాలయం నుండి చలో అసెంబ్లీకి బయల్దేరిన కామ్రేడ్లను పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల సీపీఎం, సీపీఐ కార్యాలయాలు, నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్బంధాలు ఎన్ని ఉన్నా చలోఅసెంబ్లీ నిర్వహించి తీరుతామన్నారు వామపక్షనేతలు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం ఆపేదిలేదని హెచ్చరిస్తున్నారు.

18:59 - November 20, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నానాజీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా దార్లజగన్నాధపురంకు చెందిన నానాజీ అదే గ్రామానికి చెందిన సూరిబాబుపై ఫిర్యాదు చేయడానికి సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చాడు. అకస్మాత్తుగా కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్‌కు సమస్యను విన్నవించుకోక ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

07:54 - November 20, 2017

ప.గో : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో సీపీఎం ఇవాళ 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చింది. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గుర్తు చేశారు. ఈ అంశంపై పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరులో జరిగిన సీపీఎం పశ్చిమగోదావరి జిల్లా 24వ మహాసభల్లో పాల్గొన్న మధు... చలో అసెంబ్లీకి అన్ని వర్గాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే వామపక్షాల చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 

 

15:44 - November 12, 2017

పశ్చిమగోదావరి : ఆకతాయిల వేధింపులు తాళలేక తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఘన్‌ బజారుకు చెందిన షేక్‌ ఖాజా బాను అనే మైనర్‌ బాలిక సీఎస్సీ అలెక్జాండర్ స్కూళ్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే నిన్న రాత్రి 7 గంటలకు షాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాకేష్‌, సురేష్‌, విజయ్‌ అనే ముగ్గురు యువకులు వెంటబడి, వేధిస్తూ కత్తితో దాడి చేశారని ఆరోపిస్తున్నారు ఖాజా బాను తండ్రి. బాలిక వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో పాల్పడిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

 

08:56 - November 11, 2017
18:42 - November 6, 2017

కాకినాడ : అప్రకటిత విద్యుత్ కోతలతో జీజీహెచ్ ఆసుపత్రి రోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానమైన ఎక్స్ రే సేవలు నిలిచిపోతున్నాయి. దీనితో దూర ప్రాంతాల నుండి వచ్చే ఔట్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్ కో అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వ్యవహరించడమే కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్ర పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తొలగించాలని రోగులు కోరుతున్నారు. 

20:23 - November 5, 2017
14:25 - November 4, 2017

తూర్పుగోదావరి : మరోసారి సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను అమలు చేయాలని కోరుతున్న వారిపై మరోసారి పోలీసులు విరుచకపడ్డారు. కాకినాడ సెజ్ లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులు..సీపీఎం నేతలను ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలను అమలు చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. మరోవైపు జీఎంఆర్ యాజమాన్య సంస్థ పొలాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకొంటోంది. రెండు రోజులుగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలంటూ పలువురు రహదారిపై బైఠాయించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

18:42 - November 2, 2017

తూర్పుగోదావరి : ఆలయ వ్యవహారాలు వీధికెక్కుతున్నాయి. పాలకమండలి, అధికారుల్లో విభేదాలు పెరుగుతున్నాయి. ప్రసిద్ధ శనీశ్వరాలయంగా చెప్పుకునే తూర్పుగోదావరి జిల్లా, మందపల్లి దేవస్థానంలో పరిణామాలు చర్చనీయాంశాలవుతున్నాయి. అధికారులు విచారించి ఈవో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంతో పేరున్న ప్రముఖ శనీశ్వరాలయం. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని ఈ శనీశ్వరాలయానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రతీ శని త్రయోదశి రోజు ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల్లో సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈవో పని తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శనిత్రయోదశి సందర్భంగా శివునికి నూనెతో అభిషేకాలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు విశ్వాసంతో చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలను కొందరు ఆలయ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయిల్‌తో అభిషేకాలు కొందరు ఆన్‌లైన్‌ డబ్బులు చెల్లించి ఆలయ సిబ్బంది చేతుల మీదగా చేయించాలని కోరుతుంటారు. అలాంటి వారందరి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వాడేసిన నూనెను వినియోగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొబ్బరి తోట ఆదాయం విషయంలో కూడా ఈవో సహా మరి కొందరు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కమిటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఇటీవల చేసిన నిర్మాణాల విషయంలో కూడా భారీగా అక్రమాలకు తెరలేపినట్టు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాల మీద పలువురు అధికారులకు ఫిర్యాదు చేశామంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

పాలకమండలి సభ్యుల ఫిర్యాదులో ఇప్పటికే హుండీ లెక్కింపులో ఆలయ సొమ్ము పక్కదారి పట్టిందన్న దానిపై విచారణ జరిపారు. కానీ ఆధారాలు లభించలేదంటూ అధికారులు వ్యవహారాన్ని మసి పూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారని అంటున్నారు. కొందరి అక్రమాల వల్ల ఇప్పుడు ఆలయ ప్రతిష్టకే భంగం కలుగుతున్నట్టు పలువురు వాపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయడానికి తగినట్టుగా పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.

19:11 - November 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లా.. ఏలూరు కుమ్మరి రేవు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బొమ్మను మింగి ఓ బాలుడు మృతి చెందాడు. మీసాల నిరిక్షణ్‌ అనే నాలుగేళ్ల బాలుడు తినుబండారాల ప్యాక్‌ కొని తింటుండగా.. అందులోని బొమ్మ గొంతుకు అడ్డంపడి ఊపిరి ఆడలేదు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నిరిక్షణ్‌ను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నిరిక్షణ్‌ మృతి చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు తీవ్ర శోకంలోకి వెళ్లిపోయారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - west godavari