withdrawal

16:43 - December 6, 2018

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధారే ఆధారంగా వుంది. కాగా విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ వర్తించాలంటే ఈ ఆధార్ కార్డే ఆధారం. 
ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్ష‌న్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది. 
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు..
దీంతో ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్ర‌తిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి కూడా. దీంతో దేశ పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. 
18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం..
దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 
పాన్ కార్డు లేని వారికి కొత్త నిబంధ‌న ఉప‌యోగం..
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది. 

21:53 - November 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బరిలో ఉండద్దని పలు పార్టీల నేతల బుజ్జగింపులతో కొంతమంది రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే అంశంపై స్పష్టత వచ్చింది. పలు రాజకీయ పార్టీల్లో ఎప్పటి నుంచో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అనేక మంది రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. రెబల్ నేతలతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించడంతో వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
ముఖ్యనేతలు నామినేషన్ల ఉపసంహరణ
మహేశ్వరం నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన (టీఆర్ఎస్) మనోహర్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్ ఛార్జీ శశిధర్ రెడ్డి, రామగుండం నుండి రెబల్‌గా ఉన్న గోప ఐలయ్యలు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రెబెల్‌గా నామినేషన్ వేశారు. అయితే పార్టీ నేతల బుజ్జగింపులతో సమ్మయ్య నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. సూర్యపేట నుండి కాంగ్రెస్ రెబల్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి నుండి బరిలో ఉన్న భిక్షపతి యాదవ్...కోరుట్ల నుండి కొమరెడ్డి జ్యోతి, కొండాపూర్ నుండి జగదీశ్వర్ రావు, తుంగతుర్తి నుండి రవితోపాటు కొంతమంది ముఖ్యనేతలు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. 
మహాకూటమిలో 11 స్థానాలపై సందిగ్ధత
మరోవైపు మహాకూటమిలో 11 స్థానాలపై సందిగ్ధత నెలకొంది. ఈ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్..తెలంగాణ జనసమితి..మరో రెండు స్థానాల్లో టీడీపీ..జనసమితి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. బరి నుండి తప్పుకోవాలని నేతలు కోరినా అభ్యర్థులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం నామినేషన్లను ఉపసంహించుకోలేదని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ మద్దతు తెలియచేసింది. 
నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థుల సంఖ్యను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1824 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు..
* హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 313 మంది అభ్యర్థులు 
* రంగారెడ్డి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో 304 మంది అభ్యర్థులు
* ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు
* కరీంనగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు
* నిజామాబాద్‌ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 91 మంది అభ్యర్థులు
* వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 172 మంది అభ్యర్థులు
* నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 211 మంది అభ్యర్థులు
* మెదక్‌ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 124 మంది అభ్యర్థులు
* ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 123 మంది అభ్యర్థులు
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 178 మంది అభ్యర్థులు

నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు..

 • మేడ్చల్ - జంగయ్య యాదవ్
 • ​ఖమ్మం - ఫజల్
 • సూర్యాపేట - శ్రీనివాస్ 
 • ఇల్లందు - దల్ సింగ్ 
 • సికింద్రాబాద్ - బండా కార్తీకరెడ్డి
 • మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాస్
 • సిద్ధిపేటలో 17 మంది అభ్యర్థులు
 • నారాయణఖేడ్‌లో నల్గురు అభ్యర్థులు
 • మంచిర్యాలలో ఇద్దరు అభ్యర్థులు
 • బెల్లంపల్లిలో ముగ్గురు అభ్యర్థులు 
 • సిర్పూర్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు
 • చెన్నూరులో ఒకరు 
 • జహీరాబాద్‌‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు

 

16:03 - November 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నవంబర్ 22వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో ఉండద్దని పలు పార్టీల నేతల బుజ్జగింపులతో రెబెల్స్ కొంతమంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన (టీఆర్ఎస్) మనోహర్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్ ఛార్జీ శశిధర్ రెడ్డి..రామగుండం నుండి రెబల్‌గా ఉన్న గోప ఐలయ్యలు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రెబెల్ గా నామినేషన్ వేశారు. పార్టీ నేతల బుజ్జగింపులతో సమ్మయ్య మెత్తబడి నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. 
కాంగ్రెస్ : సూర్యపేట నుండి కాంగ్రెస్ నుండి రెబల్‌గా నిలిచిన పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగం నుండి భిక్షపతి యాదవ్...కోరుట్ల నుండి కొమరెడ్డి జ్యోతి, కొండాపూర్ నుండి జగదీశ్వర్ రావు, తుంగతుర్తి నుండి రవిలు కొంతమంది ముఖ్యనేతలు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. 
మరోవైపు మహాకూటమిలో 11 స్థానాలపై సందిగ్ధత నెలకొంది. ఈ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్..తెలంగాణ జనసమితి..మరో రెండు స్థానాల్లో టీడీపీ..జనసమితి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. బరి నుండి తప్పుకోవాలని నేతలు కోరినా అభ్యర్థులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం నామినేషన్లను ఉపసంహించుకోలేదని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ మద్దతు తెలియచేసింది. 
నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు.
> మేడ్చల్ - జంగయ్య యాదవ్.., ఖమ్మం - ఫజల్.., సూర్యాపేట - శ్రీనివాస్.., ఇల్లందు - దల్ సింగ్.., సికింద్రాబాద్ - బండా కార్తీకరెడ్డి.., మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాస్...,
> సిద్ధిపేటలో 17 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.
> నారాయణఖేడ్‌లో 4గురు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.
> మంచిర్యాలలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.
> బెల్లంపల్లిలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.
> సిర్పూర్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.
> చెన్నూరులో ఒకరు నామినేషన్ ఉపసంహరణ.
> జహీరాబాద్‌‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ.

10:24 - October 31, 2018

హైదరాబాద్ : మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా ? అయితే బుధవారం నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పలు ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఒక రోజులో రూ. 20, 000 కన్నా ఎక్కువ డ్రా చేయకూడదని నిబంధన పెట్టింది.  ఇంతకుముందు రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. దీనితో ఎస్‌బీఐ ఖాతాదారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోవాలంటే వారు ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. 
ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు పెరిగిపోతుండడం...తదితర ఫిర్యాదులు రావడంతో బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ లకు అలవాటు పడాలని ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

13:13 - February 26, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది. దీంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. వివిధ పార్టీల నేతలతో కార్పొరేషన్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. 

10:17 - October 17, 2015

ఉద్యోగులకు శుభవార్త. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సొమ్ముల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులకు త్వరలోనే తెర పడనుంది. పీఎఫ్‌ సొమ్ముల కోసం దరఖాస్తు అందిన మూడు గంటల్లో క్లైమ్‌లను సెటిల్‌ చేసే విధంగా 'ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (ఈపీఎఫ్‌ఓ) త్వరలో అన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్‌ వాడకాన్ని స్వచ్ఛందం చేస్తూ సుప్రీకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ ఈ దిశగా మరింత ముందుకు సాగాలని నిర్ణయింది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఈఫీఎఫ్‌ఓ ఖాతాదారు పీఎఫ్‌ సొమ్ము వెనక్కి తీసుకొనేందుకు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సదరు సొమ్ము ఇక నేరుగా ఆ ఖాతాదారు బ్యాంకు అకౌంట్‌లో జమ చేయబడుతుంది. ఈ కొత్త విధానం అమలునకు అనుమతించాల్సిందిగా తాము కార్మిక శాఖకు అభ్యర్థనను పంపినట్లు కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ కె.కె.జలానీ తెలిపారు. ఈ వ్యవస్థకు అనుమతులు లభించేకంటే ముందే పీఎఫ్‌ సోమ్ము ఉపసంహరణ కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి పరిచేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆధార్‌ సంఖ్యతో కూడిన విత్‌డ్రా అభ్యర్థలను కేవలం మూడు రోజుల్లోనే సెటిల్‌ చేసేలా పని చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం 20 రోజుల సమయాన్ని ఈపీఎఫ్‌ఓ అధికారులు తీసుకుంటున్నారు. పీఎఫ్‌ ఖాతాను, బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకున్న వారు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా లబ్దిపొందేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎప్రిల్ నుండి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అయిదు కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గాను కేవలం 40 శాతం మంది మాత్రమే ఇలా తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

Don't Miss

Subscribe to RSS - withdrawal