women empowerment

20:52 - March 18, 2017

సర్కార్ హాస్టల్ విద్యార్థులతో మల్లన్నముచ్చటించాడు. మోటకొండూరు మండల కేంద్రంలోని హాస్టల్ భవనంలో సగం హాస్టల్, సగం మండల కార్యాలయంగా ఉంది. మహిళలతో మాట్లాడాడు. సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:44 - March 14, 2017

హైదరాబాద్: పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. ఆరోగ్య సమస్యలు వెన్నంటినా మొక్కవోని దీక్షతో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కంకణం కట్టుకుని శ్రామిక మహిళల సమస్యలపై పోరాడుతూ.. కొన్ని నెలల క్రితం సుదీర్ఘ మహాజన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సంమయంలో తనకు ఎదురై సంఘటనలు, ఊహించని ఘటనలు చిన్నవేనని ఆమె భావించారు. ఈ వారం మానవి' స్ఫూర్'తి ఎస్. రమ ఇతివృత్తం. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:01 - March 7, 2017

స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశబ్దాలు దాటినా హక్కులను..చట్టాలను పోరాటాల ద్వారానే సాధించుకున్న మహిళల స్థితిగతులు పెద్దగా మారలేదు. సంఘటిత రంగం..అసంఘటిత రంగం అనే తేడా లేకుండా మహిళా వేతనాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. పోరాడి సాధించుకున్న వేతనాలు..పనిగంటల విషయంలో ఇంకా ఎన్నాళ్లు మహిళలపై వివక్ష..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త), అరుణ (ఏల్ఐసీ తెలంగాణ జోనల్ కన్వీనర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి విశేష్లణ కోసం వీడియో క్లిక్ చేయండి.

19:38 - February 28, 2017

హైదరాబాద్ : ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా మహిళా సంఘం గళమెత్తింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒంటరి మహిళల రాష్ట్ర సదస్సు నిర్వహించింది. ఒంటరి మహిళలకు ప్రభుత్వం వెయ్యి పెన్షన్‌ ప్రకటించడాన్ని ఐద్వా స్వాగతిస్తుందని ఆ సంఘం ఉపాధ్యక్షురాలు జ్యోతి అన్నారు.  సమాజంలో ఒంటరి మహిళల పట్ల ఉన్న చులకన భావం, మూఢనమ్మకాలు రూపుమాపడానికి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మహిళలంతా ఐక్యంగా ఉంటేనే వారి సమస్యలు పరిష్కరమవుతాయని యూటీఎఫ్‌ నాయకురాలు సంయుక్త చెప్పారు.

 

21:26 - February 21, 2017

హైదరాబాద్: ఏపీ, తెలంగాణాల్లోని 10 శాసనమండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రల్లోని ఎమ్మెల్యే , స్థానికసంస్థల ఎమ్మెల్సీ లకు మార్చి 29తో పదవీకాలం ముగుస్తోంది. ఏపీలో 7, తెలంగాణాలో 3 స్ధానాలకు షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 7, మార్చి 8 న నామినేషన్ల పరిశీలన, పదిన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఈసీ తెలిపింది. మార్చి 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు పోలీంగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని.. మార్చి 20తో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

 

19:30 - February 21, 2017
18:43 - February 21, 2017

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ను మార్చి 13న ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రణాళిక శాఖ.. వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రజెంటేషన్‌ సమర్పించింది.

 

18:42 - February 21, 2017

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల తీరుతెన్నులపై ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా ప్రాజెక్ట్‌ పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్మాణ సంస్థలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. పనుల ఆలస్యంపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ అధికారి రమేష్‌బాబును చంద్రబాబు నిలదీశారు. అయితే.. యంత్రసామాగ్రి పూర్తిగా చేరకపోవడం, చిల్లింగ్ ప్లాంట్లు రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని రమేష్‌బాబు సీఎంకు వివరించారు.

జాప్యాన్ని ఇక సహించేది లేదని చంద్రబాబు స్పష్టం...

పోలవరం పనుల్లో జాప్యాన్ని ఇక సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం చోటుచేసుకుంటే వేటు తప్పదని చంద్రబాబు సీరియస్‌గా హెచ్చరించారు. పర్యవేక్షణ అధికారి రమేష్ బాబు, కన్సల్టెంట్ మేనేజర్ తో పర్యవేక్షణలో ప్రతిరోజు సీఎం కార్యాలయంతో సమన్వయం చేసుకునేలా అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.

ఎల్‌ అండ్‌ టీ బావర్‌ గొంతెమ్మ కోర్కెలతో ...

మరోవైపు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థ ఎల్‌ అండ్‌ టీ బావర్‌ గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వానికి, అధికారులకు తలనొప్పిగా మారింది. దీనికి సంబంధించి ఎల్‌ అండ్‌ టీ కంపెనీపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. సమస్యలుంటే పరిష్కరించి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

09:31 - February 21, 2017

విజయవాడ : తన ట్రాక్ రికార్డు చూసి అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారని తన ట్రాక్ రికార్డు ఏంటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దానిపై మళ్లీ రోజా ప్రభుత్వంపై గళమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనపై అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపోరాటం చేస్తానని, మహిళలు భయపడకుండా తిరగబడాలని పిలుపునిచ్చారు. తానేమన్నా విధ్వంసాలు చేశానా ? వైస్రాయ్ హోటల్ లో గుమికూడి ప్రభుత్వాన్ని కూల్చేశానా ? ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో తెలుపాలని సూటిగా ప్రశ్నించారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుందా ?అని ప్రశ్నించారు. ప్రతిపక్షం మీద..పోలీసులను అడ్డం పెట్టుకుని నడిపిస్తున్నారని, ఇందుకు తానే ఉదాహరణ అని తెలిపారు. పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానం పలికి తనను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. దీనిని చూసి దేశం నివ్వెర పోయిందని, హక్కులకు కలిగిన భంగం న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు భయ పడకుండా తిరగబడి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సదస్సులో మహిళా మంత్రుల ఫొటోలు కూడా లేవని, సదస్సులో ప్రజాప్రతినిధుల సతీమణులు మాత్రమే ఉండాలా ? మల్లు స్వరాజ్యం, బృందా కారత్ తదితర మేధావులను పిలవలేదని విమర్శించారు. కామన్ మహిళా సదస్సా ? అని జనాలు ఆశ్చర్యపోయారని తెలిపారు. మహిళా హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని, విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కపోయారని, ఇందులో ఓ పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. బాబు..డీజీపీ ఇక్కడున్న తరువాత ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో గతంలో జరిగిన ఘటనలు చూస్తే తెలుస్తుందన్నారు. మహిళలపై జరుగుతున్న హింసలు కనిపించడం లేదా అని డీజీపీని ప్రశ్నించారు.

08:32 - February 18, 2017

ఉత్తర్ ప్రదేశ్ : బస్సులో వేధిస్తున్న కీచకునికి ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ దేహశుద్ధి చేసింది. భాగ్‌పట్‌ బస్సులో నిత్యం వేధిస్తున్న ఓ పోకిరీని యువతి చెప్పుతో చితకబాదింది. నిత్యం తనను వేధిస్తున్న కీచకునికి బుద్ధి చెప్పాలని బస్సుదిగగానే పిడికిలి బిగించిన ఆ మహిళ.. అతని చొక్కాపట్టుకుని నడిరోడ్డులోకి ఈడ్చుకొచ్చి చెప్పుతో చితకబాదింది. విషయం తెలుసుకున్న మిగతా ప్రయాణికులు తలో చెయ్యేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోకిరీని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - women empowerment