women security

14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:45 - October 11, 2017

మద్యాన్ని ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి. కులదురంహకార హత్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాలి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే ఆమోదించాలి. ఇవి రెండు రోజులు జరిగినా ఐద్వా మహాసభలు ఇచ్చిన డిమాండ్ల పై చర్చ. ఇప్పటికి ఆడపిల్లలంటే చులకనగా చూస్తున్నారని, ఆడవారిని వంటింటికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని, బీజేపీ మనువాదంతో మహిళలను అణగదొక్కుతున్నారని, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఐద్వా గట్టి పోరాటలు చేశాయని, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మద్యన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయని, దీంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, దీని వల్ల కుటుంబాలు విచ్చిన్న అవుతున్నాయిని, దశలవారిగా మద్యన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందిని, ప్రభుత్వాలు ఆదాయం కోసం ఇతర మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉందని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మీ అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:43 - October 11, 2017

 

హైదరాబాద్ : హైదరాబాద్ ప్రగతినగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐద్వా మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా ఐద్వా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఐద్వా విస్తరణ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐద్వా నూతన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐద్వా పోరాడాలన్నారు. తెలంగాణాలో మహిళలు ఎక్కువగా నిరక్షరాస్యులుగా ఉన్నారని ఐద్వా నూతన అధ్యక్షురాలు బుగ్గవీటి సరళ ఆన్నారు.

ప్రభుత్వం విఫలమైంది..
నిరక్షరాస్యతను పోగొట్టే క్రమంలో బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారన్నారు. మహిళలపై హింస, అత్యాచారాలు పెరగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా జాతీయ కార్యదర్శి మరియన్‌ దావలె అన్నారు. ఉపాధి హామీ పథకంలో మహిళలు ఎక్కువగా పని చేస్తున్నారని, దానిని పటిష్టంగా అమలు చేయాలని ఆమె కోరారు. తెలంగాణలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని వారిక అండగా నిలబడి పోరటం చేయాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో అశ్లీలతను నియంత్రించేలా సెన్సార్‌ బోర్డు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాలన్నింటిలో పాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై హింసకు సంబంధించిన కేసులను వెంటనే పరిష్కరించి, దోషులను శిక్షించాలన్నారు. మహిళా సమస్యలపై ఏకకాలంలో ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని మహాసభ పిలుపునిచ్చింది. మహిళలపై బాధ్యతగా ఉంటూ భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా నూతన కమిటీ తెలిపింది. 

11:02 - February 10, 2017

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది.  లోక్ సభలోని 62 మంది మహిళా ఎంపిలు, రాజ్యసభలోని 20 మంది మహిళా ఎంపిలతో పాటు  వివిధ రాష్ట్రాలకు చెందిన 405 మంది  మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం. దాదాపు 1200మంది దేశ విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతున్న సందర్భంలో స్త్రీలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలు సహజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఏపి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకులు స్వరూపారాణి గారితో 10టీవీ ఇంటర్వ్యూ నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:38 - January 11, 2017

భర్త పనిచేయడం లేదు..కుటుంబ పోషణ భారంగా మారింది..డబ్బు లేదు..అత్తారింటికి రానివ్వడం లేదు..దీనితో ఆ ఇళ్లాలు ఉద్యోగం చేస్తోంది..సంసార భారాన్ని మోస్తోంది. అయినా ఆ కట్న పిశాచులు వదలలేదు. డబ్బు కావాలంటూ వేధిస్తున్నారు. భర్తను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటనీ అత్తారింటికి వెళితే..వాళ్లు ఏం చేశారు ? విజయవాడకు చెందిన పద్మకు శిఖామణి ప్రాంతానికి చెందిన సందీప్ తో మూడేళ్ల కింద వివాహం జరిగింది. మరి వీరి కాపురం ఇలా ఎందుకు అయ్యింది. కారణం ఎవరు ? తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

13:46 - August 19, 2016

కాలేజీకి యువతులు..ఏదో పని మీద బయటకు గృహిణిలు..ఒంటరిగా వెళుతుంటారు. సిటీ బస్సు దిగిన తరువాత వారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలో ఆకతాయలు వెంటపడి వేధిస్తుంటారు. కొంచెం ఆత్మస్థైర్యంతో వారిని ఎదుర్కొనవచ్చు. కొన్ని టెక్నిక్స్ ద్వారా రక్షించుకోవచ్చు. ఆ టెక్నిక్స్ ఎంటో వీడియోలో చూడండి. 

13:45 - August 12, 2016

ఇంటా, బైటా అంతటా ఆడపిల్లలకు అభద్రతతో కూడిన పరిస్థితులే. ఎప్పుడూ తమని తాము రక్షించుకునేందుకు భయపడాల్సిన స్థితిగతులే. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. అవి పూర్తిగా మన చేతుల్లో లేవు. అందుకే వ్యక్తిగతంగానైనా మనని మనం రక్షించుకునేందుకు ఆత్మరక్షణా మార్గాలు నేర్చుకోవడం ఎంతో కొంత అవసరం. అలాంటి టెక్నిక్స్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:36 - April 30, 2016

కరీంనగర్: గల్ఫ్ లో దళారీల చేతిలో మోసపోయిన కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మహిళ అనురాధ ఎంపీ కవిత సహాయంతో జిల్లాకు చేరింది. 30 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి దుబాయ్ పంపించి.. అక్కడ నుండి మస్కట్ కు అమ్మేసారని.. అనురాధ తెలిపింది. అక్కడ నరకం చూశానని.. తన పాస్ పోర్టు లాగేసుకున్నారని.. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేయడంతో.. ఎంపీ కవిత విదేశాంగ శాఖ సహాయంకోరిందని తెలిపింది. మంత్రి సుష్మాస్వరాజ్ ఒమన్ ఎంబసీతో మాట్లాడి తనను విడిపించారంది. తనను దళారీల భారీ నుండి రక్షించినందుకు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపింది బాధిత మహిళ అనురాధ. 

10:47 - March 8, 2016

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.  ప్రతి ఏటా మార్చి 8న వచ్చే మహిళా దినోత్సవం ఈ ఏడాది కూడా అనేక సవాళ్లను మరింత తీవ్రంగా మనకు గుర్తు చేస్తోంది. దాదాపు 66 కోట్ల మంది పురుషులు, 62 కోట్ల మంది స్త్రీలు వున్న దేశం మనది. ఈ లెక్కను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మనం ఇక ఏమాత్రం అలక్ష్యం చేయడానికి వీలులేని ఓ హెచ్చరిక ఈ లెక్కల్లో దాగి వున్నది. స్మార్ట్ సిటీలు, అమృత నగరాలు సృష్టిస్తామని చెప్పే నాయకులు చాలామంది వున్నారు. కానీ, ఓ అయిదేళ్లకో, పదేళ్లకో స్త్రీ పురుష జనాభాను సరిసమానం చేస్తామని హామీ ఇచ్చే నాయకుడు ఒక్కడైనా వున్నాడా? లేడు గాక లేడు. 
ఇంకా తగ్గిపోతున్న స్త్రీల సంఖ్య
అవును. ఇది పచ్చినిజం. మనదేశంలో జనాభాను లెక్కగట్టిన ప్రతిసారీ ఆవేదనే మిగులుతోంది. ఆ గణాంకాలు పరిశీలించిన ప్రతి సందర్భంలోనూ మన మనస్సు చెదిరిపోతోంది. లెక్కవేసినా కొద్ది స్త్రీల సంఖ్య ఇంకా ఇంకా తగ్గిపోతోంది.  ఇంకోవైపు హింస పెరుగుతోంది.  ఏ ఇంటిలో ఎప్పుడు గ్యాస్‌ పేలుతుందో తెలియదు. ఇలాంటి గ్యాస్‌ పేలుళ్లల్లో ఎప్పుడూ కొత్త కోడళ్లే చనిపోతూ వుంటారు. ఇంటిలో భద్రతలేదు. వీధిలో రక్షణలేదు. బడిలో, గుడిలో, బస్సులో, ట్రైన్‌లో ఎక్కడికివెళ్లినా యాసిడ్‌ దాడి చేయడానికో, అత్యాచారం చేయడానికో ఎవడో ఒకడు కాచుకునేవుంటాడు. 
అష్టకష్టాలకోర్చి విజయాలు సాధిస్తున్న స్త్రీలు 
వాస్తవిక లెక్కలు, వాస్తవిక దృశ్యాలు ఇంత కఠోరంగా వుంటే- కొంతమంది స్త్రీలు అష్టకష్టాలకు ఓర్చి , కొన్ని రంగాలలో సాధించిన విజయాలను చూసి స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయని మురిసిపోదామా?  545 మంది ఎంపీలున్న లోక్‌సభకు 60మంది స్త్రీలు ఎన్నికవ్వడమే అబ్బురంగా కనిపిస్తుంటే విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం ఎక్కడ వచ్చినట్టు? 
ప్రతి మహిళా నిజంగా స్ఫూర్తిదాతే
మన దేశంలోని మొత్తం ఎగ్జిక్యూటివ్ స్థానాల్లో స్త్రీలకు కనీసం ఆరేడు శాతమైనా దక్కడంలేదన్నది నిష్టూర సత్యం. ఆ కొద్దిమంది స్త్రీలైనా అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి  ఎన్ని విషనాగులను తప్పించుకోవాల్సి వచ్చిందో, ఎన్ని రోజులు కలతతతో, వేదనతో నిద్ర పట్టని రాత్రులు గడపాల్సి వచ్చిందో. ఇవాళ వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఏ మహిళ హ్రుదయాంతరాలను కదలించినా తాను ఆ స్థితికి చేరుకోవడానికి పడిన వేదననీ, తాను భరించిన అవహేళనలనూ, తాను ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంటుంది. భరించలేనంత బాధనీ, ఆపుకోలేనంత దు:ఖాన్ని గుండెల్లో దాచుకుంటే తప్ప  ఉన్నత స్థానాలకు చేరుకోవడం, అక్కడ నిలదొక్కుకోవడం సాధ్యంకానిపని. ఇన్ని బాధల సుడిగుండాల మధ్య, కన్నీటి కొలనులను ఈదుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ప్రతి మహిళా నిజంగా స్ఫూర్తిదాతే. 
ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అవమానాలు
తాను ఎంచుకున్న ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే ఎన్నో అవరోధాలు. ఎన్నెన్నో అవమానాలు. మరెన్నో అవహేళనలు.  వీటికి తోడు తాను వేసుకునే డ్రస్సుల మీద కామెంట్స్. చీకటిపడ్డ తర్వాత రోడ్డు వెంట కనిపించడం నేరం. పట్టపగలైనా ఒంటరిగా ప్రయాణించడం పాపం. నలుగురితో కలిసి నవ్వుతూ మాట్లాడడం మహా ఘోరం. వళ్లంతా పశుత్వం నింపుకుని, క్రూరాతిక్రూరంగా ప్రవర్తిస్తున్నరాస్కెల్స్ కూడా  ఆడపిల్లల డ్రస్సుల గురించి, స్నేహాల గురించి మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్లను ఏమనాలి? ఏం చేయాలి?  ఆడపిల్లను చూడగానే రంకెలేసే ధైర్యం ఈ మృగాలకు ఎక్కడి నుంచి వస్తోంది?  సాయంత్రం చీకటి పడ్డ తర్వాత బయటకు రావద్దు, స్నేహితులతో కలిసి తిరగొద్దు అంటూ వెర్రిమొర్రి ఆంక్షలు పెట్టే  సాహసం ఈ కామాంధులు ఎలా చేయగలుతున్నారు? ఆడపిల్లను చూడగానే సొంగగార్చే బలహీనుడు, డ్రస్‌లను చూసి మృగంగా మారేవాడు, అలాంటి అర్భకుల పక్షాన వకాల్తాపుచ్చుకుంటున్నవాడు అసలు మన మధ్య తిరగడానికి అర్హుడేనా ?  కనీసం తన జుత్తు తాను దువ్వుకోలేని, తన గౌను తాను వేసుకోలేని పసిబిడ్డల మీద కూడా అత్యాచారం చేస్తున్నారంటే ఆ లోపం ఎవరిది? 
పిల్లలను పెంచే విధానంలోనే తప్పు 
పిల్లలను పెంచే విధానంలోనే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మన కడుపున పుట్టిన మన పిల్లల్లోనే ఒకడికి అంతులేని స్వేచ్ఛనిస్తున్నాం. వాడు ఆడపిల్ల డ్రస్ చూడగానే సొల్లగార్చేంత మానసిక దుర్భలడిగా తయారవుతున్నాడు. బలాదూర్ గా తిరిగినవాడు మృగంగా మారుతున్నాడు. మరొకబిడ్డకు అడగడుగునా ఆంక్షల సంకెళ్లు బిగిస్తున్నాం. .   అణకువ నేర్చుకున్న పిల్ల బాధితురాలవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలా? అమ్మాయిలు స్వేచ్ఛగానూ, అబ్బాయిలు మనుషుల్లాగానూ బతికే  వాతావరణాన్ని మనం సృష్టించుకోలేమా? ప్రతి స్త్రీని తన తోటి మనిషిగా గుర్తించి గౌరవించే  సంస్కారవంతుడైన  పరిపూర్ణ పురుషుడిని మనం ఆవిష్కరించుకోలేమా?  

 

10:40 - March 8, 2016

మహిళలపై వేధింపులు ఆపాలని ఐఎఫ్ టీయూ నాయకురాలు ఎస్ఎల్.పద్మ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవానికున్న ప్రాధాన్యతేమిటి? ప్రస్తుతం మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యేలేమిటి? స్త్రీ స్వేచ్ఛకు , స్త్రీల అభ్యున్నతికి, స్త్రీల భద్రతకు అడ్డంకిగా వున్న అంశాలేమిటి'? ఇలాంటి అంశాలపై పద్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - women security