world

08:52 - December 6, 2018

జర్మనీ : ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ బైక్ రోడ్డెక్కింది. నెరా పేరుతో తయారైన ఈ త్రీడీ బైక్ ను బిగ్ రెప్, నౌలబ్ అనే జర్మన్ కంపెనీలు రూపొందించాయి. నెరా త్రీడీ బైక్ రోడ్డుపై పరుగులు పెట్టింది. జర్మన్ త్రీడీ దిగ్గజం బిగ్ రెప్, నౌలబ్ లు సంయుక్తంగా ఈ బైక్ ను రూపొందించాయి. కొత్తతరం అనే అర్థం వచ్చే న్యూఎరా నుంచి తీసుకున్న పదాలతో నెరా అనే పేరు పెట్టారు.

నెరా బైక్ తయారీలో ఎలక్ట్రిక్ కాంపోనెంట్ బ్యాటరీ తప్పితే మిగిలినవన్నీ కూడా త్రీడీ టెక్నాలజీతోనే తయారు చేసిన భాగాలు వాడతారు. బైక్ బరువు కూడా చాలా తక్కువ...దాదాపు 60 కేజీలు మాత్రమే ఉండగా.. బైక్ తయారీకి 12 వారాల గడువే పట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం స్పీడ్ తక్కువున్న నెరా బైక్ ను కమర్షియల్ గా విక్రయించడం లేదు. 

 

13:02 - November 19, 2018

బీరే కదా అని లైట్ తీసుకోకండి..
పాము విషం ఎంత ప్రమాదమో..ఇది అంతే..
గొంతు కాలిపోయినా ఆశ్చర్యం వద్దు..
ఎంత దమ్మునోళ్లైనా..ఇది డైరెక్టుగా తాగితే..స్వర్గానికి టిక్కేటే..
హాట్ డ్రింక్స్‌లో అబ్సింతేలోనే 60 శాతం అల్కహాల్ కంటెంట్..

ఢిల్లీ : మందుబాబుల కోసం ఘాటైన లిక్కర్ తయారవుతోంది. బీరే కదా..అని లైట్ తీసుకోకండి..అందులో ఉండే అల్కహాలిక్ బట్టి మత్తు ప్రభావం ఉంటుంది. నాలుగైదు బీర్లు తాగిన కొందరు స్టడీగానే ఉంటారు. ఎందుకంటే మత్తు ఎక్కలేదని అంటుంటారు. మాములు బీరులో ఉన్న మత్తు కంటే మూడింతలు ఎక్కువ ఉండేలా తయారు చేస్తున్నారంట. వాసన చూస్తే చాలు దిమ్మ తిరుగుతుందంట. కొత్త బీరు తయారు చేస్తున్నారు. కానీ స్కాట్లాండ్ లో్ని బ్రూ మాస్టర్ కంపెనీ ఓ ఘాటైన బీర్‌ని తయారు చేస్తోంది. ‘స్నేక్ వినోమ్’ పేరిట బీర్ తయారు చేస్తోంది. ఈ బీర్‌ని సేవిస్తే మాత్రం నిషా నిషాళానికి అంటడం ఖాయమంటున్నారు.
బ్రాందీ..విస్కీ..ఇతర వాటిల్లో 8-11 శాతం వరకు అల్కాహాల్ ఉంటుంది. అదే స్నేక్ వినోమ్ బీర్‌లో 67.5 శాతం అల్కహాల్ ఉంటుందంట. అంటే ఎంత ఘాటు బీరో మీరే ఆలోచించండి. హాట్ డ్రింక్స్‌లో అబ్సింతేలోనే అనే మద్యం హాట్ డ్రింక్‌గా పేరుంది. ఇందులో 60 శాతం అల్కహాల్ కంటెంట్ ఉంటుంది. మరి అత్యంత ప్రమాదకరమైన బీర్ కదా..అందుకే వార్నింగ్ లేబుల్ కూడా అమరుచుతోంది...దమ్మునోళ్లు మాత్రమే ఈ బాటిల్ జోలికి రండి..ఒక బాటిల్ అవుట్ అయ్యే వాళ్లు ఈ బీర్ జోలికి రావద్దని హెచ్చరిస్తోంది. 

19:24 - October 31, 2018

గుజరాత్ : మేరు నగర ధీరుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్. అఖండ భారతావని తునాతునకలుగా విడిపోతున్న సమయంలో అకుంఠిత దీక్షా దక్షతతో ఉక్కు సంకల్పంతో రక్త రహితంగా 565 సంస్థానాలను భారత్ లో విలీనం చేసేందుకు పటేల్ పడిన తపన, దీక్ష, అపర చాణుక్యుడిగా సందర్భాను సారంగా సంప్రదింపులు జరిపి ఉక్కు సంకల్పంతో ఉక్కు మనిషిగా మారిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ యొక్క అత్యంత భారీ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’నిర్మించి భరత జాతి ఆయనకు జన్మదినం రోజు ఘన నివాళులర్పించింది. ఈ విగ్రహమే ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా పేరొందింది. మరి మన సర్ధార్ కు ఎవరూ సాటిరారు కదా..మరి ప్రపంచంలో వున్న అతి భారీ విగ్రహాల గురించి తెలుసుకుందాం...

Image result for sardar patel statue height in modi and top 10 statesస్టాట్యూ ఆఫ్ యూనిటీ: 597 అడుగుల ఎత్తులో వున్న స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టిన ఈ సర్దార్ విగ్రహం చైనాలోని బుద్ధ విగ్రహం కంటే 100 అడుగుల ఎత్తు ఎక్కువ. అంతేకాదు అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెట్టింపు ఎత్తు మన సర్ధార్ సొంతం. Image result for Spring Temple Buddha in china

స్పింగ్ టెంపుల్ బుద్ధ : చైనాలోని హెవెన్ ప్రావిన్స్ లో నిర్మించిన డ 503 అడుగుల ఎత్తు. ఇందులో 66 అడుగుల ఎత్తున లోటస్ వుంటుంది. 
లెక్యున్ సెట్క్యార్ : లెక్యున్ సెట్క్యార్ పేరుతో వుండే ఈ విగ్రహం 427 అడుగులు. ఈ విగ్రహం కంటే సర్ధార్ పటేల్ విగ్రహం 173 అడుగుల ఎత్తు ఎక్కువ.
ఉషుకి : జపాన్ లోని ఉషుకిలో వుండే బుద్ధుడి ప్రతిమ 394 అడుగుల ఎత్తు. ఇందులో 30 అడుగులు బేస్ వుంటే మరో 30 అడుగుల ఎత్తులో లోటస్ వుంటుంది.
గునియన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సాన్యా : గునియన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సాన్యా గా పేరొందిన ఈ తదాగతుడు ప్రతిమ చైనాలో వుంది. దీని ఎత్తు 354 అడుగులు. 

ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు ెప్రాచుర్యం పొందాయి. బుద్ధుడు, ఏసు క్రీస్తు, ఝాన్సీ లక్ష్మీభాయ్, శివుడు, మేరీ మాత ఇలా ఎన్నో, ఎన్నెన్నో. కానీ ఇప్పటి వరకూ పేరొందిన అన్ని విగ్రహాల కంటే మన  భరతజాతి ఐక్య గీతక..కార్యసాధకుడు సర్దార్ పటేల్ విగ్రహానికి సాటిరావు కదా..

 
 
 
 
13:58 - September 29, 2018

ఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ అలైస్‌ వైద్యన్‌ చోటు దక్కించుకున్నారు. మనదేశం నుంచి జాబితాలో స్థానం పొందింది ఈమె ఒక్కరే. ప్రస్తుత సంవత్సరానికి గాను అమెరికా వెలుపల 50 మంది శక్తిమంత మహిళా వ్యాపారులతో ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అలైస్‌ వైద్యన్‌కు 47వ ర్యాంకు లభించింది. 

 

18:49 - September 25, 2017

విశాఖ : ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఈ నెల 27న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్‌ 2 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమరావతి, తిరుపతి, రాజమండ్రికి చందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. విశాఖ ఉత్సవ్‌, అరకు, భీమిలి ఫెస్టివల్స్‌తో పాటుగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, కుకింగ్‌ ఒలంపియాడ్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

16:45 - September 13, 2017
12:08 - July 23, 2017

స్పోర్ట్స్ : మహిళల క్రికెట్‌ మహా సంగ్రామానికి మిథాలీ సేన సై అంటే సై అంటోంది. మూడు సార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి తొలి సారిగా వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని టీమిండియా తహతహలాడుతోంది.ఓ వైపు ఇంగ్లండ్‌.... మరోవైపు ఇండియా ...క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో ఇరు జట్ల మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఫైట్‌....అసలు సిసలు క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత జట్టుకు...గ్రూప్‌ దశ నుంచి సెమీస్‌ వరకూ పోటీనే లేకుండా పోయింది. 7 రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ 5 విజయాలు సాధించింది. సెమీఫైనల్‌లో పవర్‌ ప్యాకెడ్‌ ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చి టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ సెన్సేషనల్‌ సెంచరీతో టీమిండియా ఆస్ట్రేలియాకు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. ఇంగ్లండ్‌తో ఫైనల్‌లోనూ అంచనాలకు మించి రాణించాలని మిథాలీ రాజ్‌ అండ్‌ కో...పట్టుదలతో ఉంది. మిథాలీ రాజ్‌,పూనమ్‌ రౌత్‌, స్మృతి మందన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్టమూర్తి, జులన్‌ గోస్వామీ,షికా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వర్‌ గైక్వాడ్‌,పూనమ్‌ యాదవ్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భారత జట్టు అన్ని విభాగాల్లో పవర్‌ఫుల్‌గా ఉంది. మిథాలీ రాజ్‌,పూనమ్‌ రౌత్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్టమూర్తి సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు బ్యాటింగ్‌ విభాగంలో మునుపెన్నడూ లేనంతలా పటిష్టంగా ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఎలా ఉన్నా....ఫైనల్‌ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించడం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి. తొలి సారిగా టీమిండియా ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మిథాలీ సేన విశ్వవిజేతగా నిలిస్తే...భారత మహిళల క్రికెట్‌లోనే చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అనుమానమే లేదు. 

18:07 - June 9, 2017

హైదరాబాద్ : వయస్సు చిన్నదే కానీ.. వండర్స్‌ సృష్టిస్తుంది... అద్భుత విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. రికార్డులపై.. రికార్డులు సాధిస్తూ... ఆశ్చర్యపరుస్తోంది. కరాటేలో నైపుణ్యం సాధించడమే కాదు... సాహసోపేతమైన విన్యాసాలతో ఆకట్టుకుంటున్న బాలికపై ప్రత్యేక కథనం
కరాటేలో ప్రతిభ కనబరుస్తున్న అమృత
హైదరాబాద్‌కు చెందిన ... అమృత కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్ రికార్డ్‌ సాధించి. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. సెవెన్త్‌ క్లాస్‌ చదువుతున్న అమృత బర్కత్‌పురాలోని జీవీఆర్‌ కరాటే అకాడమీలో రెండో సంవత్సరం నుంచే శిక్షణ తీసుకుంటోంది.
అమృత సాహోసోపేతమైన విన్యాసాల ప్రదర్శన
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమృత సాహసోపేతమైన విన్యాసాలను ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ ఏర్పడి వెయ్యి అరవై తొమ్మిది రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని... అన్ని మేకులపై పడుకుంది. అలాగే రాష్ట్రమొచ్చి 36 నెలలు పూర్తైనందుకు చిహ్నంగా .. 36 గ్రానైట్స్‌ను పగలగొట్టింది. రెండు నిమిషాల 58 సెకండ్లలో ఇది పూర్తి చేసింది. దీంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అంతేకాదు, ఈ చిన్నారి ప్రతిభకు బుక్‌ ఆఫ్‌ లిటిల్‌ గౌరవమూ దక్కింది. సంబంధిత ప్రశంసా పత్రాలను అందుకుంది. ఈ సందర్భంగా అమృత సచివాలయంలో పలువురు ప్రముఖులను కలిసింది. తనకు మరింత ప్రోత్సాహం అందిస్తే..రాష్ట్రానికి పేరు తీసుకు వస్తానని అంటుంది. అమృత సాహసోపేత విన్యాసాలను రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు సహా పలువురు అభినందించారు. 

 

17:26 - June 4, 2017

ఇంగ్లాండ్ : లండన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ఆరుగురు ప్రజలు ప్రాణాలు బలి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రదాడి అనంతరం లండన్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.  
ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ లండన్‌ 
ఉగ్రదాడితో లండన్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ఆరుగురి ప్రాణాలు తీశారు ముష్కరులు . బ్రిటన్‌ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10గంటల సమయంలో ఓ వ్యాన్‌లో వచ్చిన ఉగ్రవాదుల బృందం లండన్‌ బ్రిడ్జ్‌పై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం అదపుతప్పిన ఆ వ్యాన్‌ ఓ రెస్టారెంట్‌ వద్ద గోడను ఢీకొట్టి ఆగిపోయింది. వ్యానులోంచి దిగిన ముగ్గురు ఉగ్రవాదులు..ఆ తర్వాత కత్తులతో స్వైరవిహారం చేశారు. సమీపంలోని స్పానిష్‌ రెస్టారెంట్‌కు వచ్చిన వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓ బాలికను ఈ రకంగా సుమారు 15సార్లు పొడవడంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
8 ని.ల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు 
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది నిమిషాల్లోనే ఉగ్రమూకల ఆటకట్టించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10.08 నిమిషాలకు పోలీసులకు తొలి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రాత్రి 10 గంటల 16 నిమిషాల కల్లా ముగ్గురు ముష్కరులను కాల్చేశారు. అయితే ఈ ముష్కరుల నడుముకు పేలుడు పదార్థాలు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు..అవి పేలకుండా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనల్లో గాయపడిన మొత్తం 30 మంది బాధితులను లండన్‌లోని ఆరు వైద్యశాలలకు తరలించనట్లు అధికారులు చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే లండన్‌ వంతెన సమీపంలోని ఆసుపత్రులను భద్రతా కారణాల రీత్యా మూసివేశారు.
ఉగ్రదాడులను ఖండించిన ప్రధాని థెరిస్సామే 
లండన్‌ ఉగ్రదాడి ఘటనపై బ్రిటన్‌ ప్రధాని థెరిస్సామే వెంటనే అప్రమత్తయ్యారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన థెరిస్సామే..పరిస్థితిని సమీక్షించారు. దాడుల ఘటనను ఉగ్రవాదం భయకర రూపంగా చూస్తామని ఆమె తెలిపారు. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇక లండన్‌లో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. విపత్కర సమయంలో బ్రిటన్‌ ఏం సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. లండన్‌ ఉగ్రదాడులపై భారత ప్రధాని మోదీ ట్విటర్‌లో స్పందించారు. లండన్‌పై దాడులు దిగ్భ్రాంతికరం, దారుణమన్నారు. దాడులను భారత్‌ తీవ్రంగా ఖండిస్తుందని..బాధితుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

 

06:48 - May 30, 2017

ఢిల్లీ : ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఐరోపా దేశాలు నేతృత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా బెర్లిన్‌లో స్థానిక న్యూస్‌ ఏజెన్సీలతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని.. దానిని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పోరాడాలన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం యూరోప్‌ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణిని విడిచిపెడితేనే ప్రపంచ ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. సరుకుల చేరవేత, పెట్టుబడుల ప్రవాహం, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని మోదీ అన్నారు. ఇవాళ జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మార్కెల్‌తో సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు.

Pages

Don't Miss

Subscribe to RSS - world