writer

21:30 - November 3, 2017

ఢిల్లీ : 2017కు గాను సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్‌ అవార్డు ప్రకటించారు. ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణా సోబతిని అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్ఞానపీఠ్‌ డైరెక్టర్ లీలాధర్‌ మండలోయి తెలిపారు. హిందీ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను కృష్ణా సోబతిని 53వ జ్ఞానపీఠ పురస్కారం వరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు కింద పురస్కార గ్రహీతకు 11 లక్షల రూపాయలు, ప్రశంసా పత్రాన్ని ఇవ్వనున్నారు. కృష్ణా సోబతి రచించిన 'జిందగీ నామా'కు గాను1996లో సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

15:05 - October 22, 2017

ప్రముఖ నవలా రచయిత యండమూరి రచించిన 'తులసిదళం’ లో ఏమీ లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా యండమూరి రచించిన ‘తులసిదళం’ నవలపై స్పందించారు. సీరియల్ గా వస్తున్న సమయంలో తనకు కొంతమంది చెప్పారని..గొప్ప నవల అని చెప్పడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకపోవడంతో అంతగా దృష్టి సారించలేదన్నారు. కానీ జ్యోతి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది..ఎందుకిలా జరిగిందనే ఆసక్తి తనలో నెలకొందన్నారు. పెళ్లి సాధ్యం కాదు..ఎంజాయ్ చేద్దాం అనే ఉత్తరంలో ఉందని..అమ్మాయి షాక్ అయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం పుస్తకం చదివానని..కానీ అందులో ఏమీ లేదన్నారు. ఎంత తుక్కు కథ..అంటే అంత తుక్కు కథ అని విమర్శించారు. ఓ డాక్టర్ ముందుమాటలో నవలను మెచ్చుకోవడం జరిగిందన్నారు. దీనిపై తాను ‘గంజాయి దమ్ము’ అని పుస్తకం రాసి..డాక్టర్ పై కూడా తాను విమర్శ చేయడం జరిగిందన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ తనపై కేసు పెట్టలేదని..ముందుమాట రాసిన వ్యక్తి కేసు పెట్టడం జరిగిందని..క్షమాపణ చెప్పాలని ఉత్తరంలో ఆ వ్యక్తి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జైల్లో పెట్టాలి..లేదా రూ. వెయ్యి జరిమాన కట్టాలని జడ్జి పేర్కొనడంతో జరిమాన కట్టేసి వచ్చామన్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

14:58 - October 22, 2017

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:49 - October 22, 2017

దేవుడనేది అబద్ధమని ప్రముఖ రచయిత్రి రంగానాయకమ్మ పేర్కొన్నారు. టెన్ టివి రంగనాయకమ్మతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విశేషాలు తెలియచేశారు. అందులో నాస్తికత్వంపై స్పందించారు. 20 ఏళ్ల వరకు నమ్మకాలు..ఉండేవన్నారు. కానీ కందుకూరి వీరేశిలింగం గారి పుస్తకం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కందుకూరి నాస్తికుడు కారని, కానీ ఆ బుక్ లో కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు తాను అప్పటి వరకు గ్రహించలేదని..ఎవరూ తనకూ చెప్పలేదన్నారు. తనకు..కుటుంబసభ్యులకు -14 కంటి సైట్ ఉందని..సూర్య నమస్కారం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని పలువురు చెప్పారని పేర్కొన్నారు. కానీ చేసినా మార్పు రాలేదన్నారు. తరువాత నాస్తికత్వం అలవాటై పోయిందని..అలా నాస్తికత్వం పుస్తకాలు చదువుతూ చివరకు దేవుడు అబద్ధమనే అభిప్రాయం వచ్చిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:55 - October 9, 2017

ప్రకాశం : ప్రముఖ తెలుగు సినీ రచయిత హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రిలో మరణించారు. 150 పైగా సినిమాలకు డైలాగ్‌లు రాశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు ఆయన రాసిన సంభాషణలకు గాను నంది అవార్డులు పొందారు. ప్రముఖ డైరెక్టర్‌ టీ కృష్ణ ద్వారా సినీ పరిశ్రమకు పరిచమైన హరనాథరావు... స్వయంకృషి, సూత్రధారులు, ప్రతిఘటన సినిమాల కథలతోపాటు సంభాషణలు రాశారు. రాక్షసుడు, స్వయంకృషి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గుంటూరులో చదివిన హరనాథరావు, చిన్నతనంలోనే నాటకాల్లో బాల నటుడి పాత్రలు పోషించారు. 

12:52 - April 10, 2017

హైదరాబాద్: తెల్లటి కాగితంపై నల్లని అక్షరాలు ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. బడుగు, బలహీన జీవుల వెనకబడి వెతలను ఆవిష్కరించే ఆయుధాలు అవి. అవి ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తాయి. ఆలోచింపచేస్తాయి. బడుగు, బలహీన వర్గాల, పీడితుల బాధితుల సమస్యలను అక్షరీకరించిన మహారచయిత్రులు ఎందురో ఉన్నారు. అటువంటి అక్షర కణికల ద్వారా సమాజాన్ని ప్రశ్నించిన ఓ అతివ కథనంతో మీ ముందుకు వచ్చింది స్ఫూర్తి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:57 - January 22, 2017

సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉపయోగ పడుతుంది. వివిధ చారిత్రక సందర్భాలకు ఆధారాలను అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన కవులు రచయితలు ఎందరో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎందరో కథారచయితలు అద్భుతమైన కథలను రాస్తున్నారు. అరుదైన కథలు సృష్టిస్తున్నారు. వారిలో కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఒకరు. ఆయన కార్గిల్ కథలు పేరుతో కథానికా సంకలనాన్నివెలువరించారు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలను చేపట్టి తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ పై మరిన్న విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

19:45 - January 15, 2017
13:35 - December 11, 2016

ప్రపంచ దేశాల కవిత్వానికి వేల ఏళ్ళ చరిత్ర వుంది. మాతృభాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లో కవిత్వాలను పరికించాలనే తపన అనేకమంది పాఠకుల్లో వుంటుంది. అటువంటి వారికోసం ప్రముఖ అనువాద రచయిత 'ముకుంద రామారావు అనే గాలి పేరుతో వివిధ దేశాల కవిత్వాన్ని అనువాదం చేశారు. అవేంటో చూద్దాం..

20:21 - December 6, 2016

చెన్నై : తమిళనాట జయలలిత తర్వాత అంతే సమర్థంగా అన్నాడీఎంకేను నడిపించే నాయకుడెవరు? జయకు వారసులుగా ఎవరు ఉండబోతున్నారు? ప్రస్తుతానికి పన్నీరు సెల్వంను సీఎంగా ప్రకటించినా రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? పన్నీరు సెల్వం సీఎంగా కొనసాగేందుకు జయలలిత సహచరి శశికళ సహకరిస్తుందా? లేక అధికారపీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుందా? అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం కావాలంటే సినీ హీరో అజిత్‌ అమ్మకు వారసుడిగా రానున్నారా? అమ్మ మృతితో.. తమిళనాడు అంతటా ఇదే చర్చ సాగుతోంది.

సీఎంగా పన్నీర్ సెల్వం..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం.. ఆమె వారసుడెవరు అన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ..ఆయన జనాకర్షక నేత కాకపోవడంతో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే మూడు అధికార కేంద్రాలు నడిచాయనే ప్రచారం ఉంది. జయలలిత సహచరి శశికళ... నెంబర్‌ టూ గా వ్యవహరించారు. ఇప్పుడు, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది.

అనేక ప్రశ్నలు..
పోరాట యోధురాలిగా, అత్యంత ప్రజాకర్షణ ఉన్న నేతగా ఉన్న జయలలిత స్థానంలో.. ఆమె వారసుడిగా పన్నీరు సెల్వంను అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు ఎంత వరకూ అంగీకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. కోర్టు కేసులు, వివిధ కారణాలతో జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు పన్నీరు సెల్వం రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయ మంత్రిత్వ శాఖల బాధ్యతలన్నీ ఆయనే చూశారు. రాష్ట్రంలో ప్రధాన అధికార కేంద్రంగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లకు గాను..136 స్థానాలతో అన్నాడీఎంకే పూర్తి మెజారిటీ సాధించింది. అయితే, శశికళ కోటరీలో 60 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీరు సెల్వంను శశికళ తాత్కాలికంగా సీఎంగా అంగీకరించినా, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు భారీగా మారతాయని రాజకీయ విశ్లేషకుల భావన. ప్రధానంగా, శశికళ, పన్నీరు సెల్వం మధ్య పోరు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

షీలా బాలకృష్ణన్..
అన్నాడీఎంకే రథసారథి రేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్‌ పేరు వినిపిస్తోంది. జయలలిత సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్‌.. పాలనపరంగా వ్యవహారాలన్నీ చూశారు. అదే సమయంలో, పన్నీరు సెల్వంను జయలలిత విశ్వసించినట్లుగా శశికళ ఏ మాత్రం నమ్మరు. పన్నీరు సెల్వం కంటే కూడా ఆమె మాజీ సీఎస్‌ షీలా బాలకృష్ణన్‌ తెరపైకి తీసుకురావడానికే మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ హీరో అజిత్..
జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. సినీ హీరో అజిత్‌ జయకు అత్యంత సన్నిహిత బంధువు. జయలలితను అమ్మగా పిలుస్తూ ఆమెతో ఆప్యాయంగా ఉండేవాడు. డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా..అజిత్ వంటి ప్రజాకర్షణ గల వ్యక్తిని వారసుడిగా తెరపైకి తీసుకు రావడమే మంచిదనే అభిప్రాయాలను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తన మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని పార్టీ వర్గాలను జయ ఆదేశించారన్న వార్తలు వస్తున్నాయి.

బీజేపీ బలం నామమాత్రమే..
రాబోయే ఆరు నెలల వరకూ పన్నీరు సర్కార్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో బీజేపీ బలం నామమాత్రమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. దక్షిణాదిలో పార్టీని బలపరచాలన్న కసరత్తులో తమిళనాడు మీద కమలనాథులు కన్నేశారు. ఓవైపు సీఎం జయలలితకు స్నేహ హస్తం అందిస్తూనే.. మరోవైపు తమిళనాడులో పార్టీకి బలమైన పునాదులు వేసే ప్లాన్‌ చేశారు. జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందర్ రాజన్ దాకా బీజేపీ అగ్ర నేతలు జయకు అందుతున్న వైద్య సేవల పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచారు. ఇలాంటి చర్యల ద్వారా అన్నాడీఎంకేకు చాలా దగ్గరై భవిష్యత్ రాజకీయాలు నడపాలన్నదే బీజేపీ వ్యూహం అని తెలుస్తోంది. ఈ సమీకరణల్లో భాగంగానే పన్నీర్ సెల్వంతో బీజేపీ పెద్దలు తరచూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే 6 నెలల్లో అన్నాడీఎంకేలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారుతాయన్నది తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది.

Pages

Don't Miss

Subscribe to RSS - writer