ycp mla roja

11:42 - April 30, 2018

విశాఖపట్నం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కోసం చంద్రబాబు దీక్షల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. విశాఖలో వైసీపీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షలో ఆమె పాల్గొన్నారు.

15:18 - April 11, 2018

హైదరాబాద్ : టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. తన తప్పులను విపక్షాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వ పథకాల్లో నిధులన్నీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని నెత్తికెత్తుకున్నారని రోజా విమర్శించారు. 30సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదాను అడగలేదన్నారు.

 

13:32 - April 11, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అంతా ఇచ్చేశారంటూ మోడీ..జైట్లీని ఆకాశానికెత్తేసి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసింది ప్రభుత్వమయితే తమపై ఎందుకు బురద చల్లుతున్నారని, విభజన హోదా అమలు కోసం వెళ్లేలేదని..వెళితే వినతిపత్రాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని, ప్రత్యేక హోదా సాధించడమే వైసీపీ లక్ష్యమయితే హోదాకు వెన్నుపోటు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓ పత్రికలో పథకాలపై 71 శాతం సంతృప్తిగా ఉన్నట్లు ఓ వార్త ప్రచురితమైందని..ఇది అసత్యమని తెలిపారు. 

18:23 - January 10, 2018

చిత్తూరు : ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు 'బాబు జాబేదీ'..'ఇంటికో ఉద్యోగం ఇంకెన్నాళ్లీ మోసం' అంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే రోజా పాల్గొని విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఉద్యోగులు వలసలు...ఆత్మహత్యలు ఎంచుకుంటున్నారని, యువతను చైతన్య పరిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి తనయుడు లోకేష్ కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 

13:53 - December 30, 2017

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికల్లో మహిళలకు అన్ని అబద్ధాలే చెప్పారని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్రంలో మహిళల తలరాత మారిందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి కూడా మహిళలకు పంగ నామాలు పెట్టారని విమర్శించారు. టీడీపీ మహిళలకు చేసిందేమీ లేదన్నారు. ఈనెల 31 న బార్లు, 
వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా, వారిపై అత్యాచారాలు, హత్యలు జరిగినా పర్వాలేదని ప్రభుత్వం అనుకుంటుందని ఆరోపించారు. దీన్ని చూస్తేనే రాష్ట్రంలో పరిపాలన ఎంత దిగజారిపోతుం దో అర్థం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు అవకాశవాదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

 

14:03 - October 17, 2017
15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

14:31 - July 17, 2017

గుంటూరు : ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీలో వైసీపీ నేత జగన్‌ ఎమ్మెల్యేలతో కలిసి రోజా తొలి సారిగా ఓటు వేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పినట్టు గా బీజేపీ బలపరిచిన అభ్యర్ధి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఓటు వేసినట్టు తెలిపారు.. తొలిసారిగా రాష్ట్రపతికి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రితో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం స్పీకర్‌ పదవికే అవమానకరం అని రోజా అన్నారు.

 

18:52 - June 2, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అధికారులతో అధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు... రాష్ట్రానికి ఎయిర్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ సరిగాలేదని వారితో అన్నారు.. ఈ సమస్య వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలని... మరిన్ని విమాన సర్వీసులు అందించే సంస్థలను ఆహ్వానించాలని అధికారుల్ని లోకేష్ కోరారు.. వీటితోపాటు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం, అమరావతికి ఎయిర్ కనెక్టివిటీపై ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని సూచించారు.. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప ఎయిర్ పోర్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను అధికారులు లోకేష్‌కు వివరించారు.

18:50 - June 2, 2017

గుంటూరు : ప్రతిజ్ఞ బూనుదాం... ప్రగతి సాదిద్ధామనే నినాదంతో ఏపీ ప్రజలు ముందుకు కదిలారు. అన్ని జిల్లాల్లో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతపురంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగం కావాలని కలెక్టర్ వీరపాండ్యన్‌ పిలుపునిచ్చారు.అలాగే గుంటూరు జిల్లా.. తెనాలిలోనూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి నక్కా ఆనంద్‌ఆబు, ఎమ్మెల్యే ఆలపాటిరాజా పేదవారికి భూ పట్టాలు పంపిణీ చేశారు.పశ్చిమగోదావరి జిల్లా..ఏలూరు పేరెడ్‌ గ్రౌండ్‌ నుంచి ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పితాని, ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌... పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ కలక్టర్ కార్యాలయం నుంచి బాలజీ చెరువు సెంటర్ వరకూ..ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలో జరిగిన ర్యాలీని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. జిల్లావాసులు పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 8న నవ నిర్మాణ దీక్ష ముగియనుంది. ముగింపు సభను .. కాకినాడలో నిర్వహించనున్నారు. దీని కోసం ఆనంద్‌ భారతి గ్రౌండ్‌ను హోంమంత్రి చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - ycp mla roja