YCP MLAs

21:36 - August 5, 2018

తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, కత్తిపూడి సభల్లో మండిపడ్డారు. అటవీ భూములను సైతం వదలకుండా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకుంటూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేవుణ్ని కూడా టీడీపీ నాయకులు విడిచిపెట్టడంలేదని జగన్‌ విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులు బంధువులకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కాయన్నారు. పత్తిపాడు నియోజకవ్గరంలోని సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం  చేశారు. జగన్‌ సభలకు భారీగా జనం తరలివచ్చారు. 
 

15:36 - March 13, 2018

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే రాంబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన 22 మంది వైపీసీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్‌ కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ కేబినెట్‌లో చేరిన మంత్రులకూ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:21 - February 22, 2018

గుంటూరు : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 67 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకుంది. అయితే ఎన్నికల తర్వాత ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు వైసీపీ విలవిల్లాడిపోయింది. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 44కు తగ్గింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురికి మాత్రమే మంత్రిపదవులు దక్కాయి. మిగిలిన వారికి ఎలాంటి పదవులు లేవు. దీంతో వారంతా టీడీపీపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీలో ప్రధాన్యత లేకుండా పోయింది.
వైసీపీనీ వీడి టీడీపీ కండువాకప్పుకున్న ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రధాన్యత లేకుండా పోయింది. టీడీపీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు వారివారి నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానంపై జంపింగ్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తమ పనులు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో ఇమడలేకపోతున్నానని బహిరంగంగానే చెప్పారు. టీడీపీ నేతలు తనను చాలా రకాలుగా ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ వైపు
టీడీపీలో ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి కూడా వీరికి ఆహ్వానం పలుకుతున్నారని సమాచారం. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారిని వెనక్కి వస్తే రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని వైసీపీ చెబుతోంది. పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు... త్వరలోనే మళ్లీ వైసీపీలో చేరుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున... ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో 5 నుంచి 10 మందిని వెనక్కి రప్పించే వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. మొత్తానికి టీడీపీలోకి జంప్‌ అయిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంతగూటివైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బ్యాక్‌ రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది త్వరలోనే తేలనుంది.

 

18:39 - December 4, 2017

అనంతపురం : అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడేళ్లుగా అబద్దాలు, మోసాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పేవారు, మోసాలు చేసే వారు రాష్ట్రానికి నాయకుడిగా ఉండాలా అని ప్రశ్నించారు. అందుకే రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని కోరారు. జగన్‌ తన పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన సభలో ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తెరమరుగు చేశారని ఆరోపించారు. 

14:48 - December 4, 2017

కడప : జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అభివృద్ధి పనులకు అడ్డంపడుతూ టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు కమాలపురం టీడీపీ ఇంచార్జ్‌ పుత్త నరసింహారెడ్డి. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సర్వరాయసాగర్‌ ప్రాజెక్టును ఇతర చెరువులను ఆయన పరిశీలించారు. నీటితో చెరువులను చూసి హర్షం వ్యక్తం చేశారు. కమాలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడానికి కారణం రవీంద్రనాథ్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

21:27 - November 22, 2017

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బాలపూర్‌ క్రాస్‌రోడ్స్‌, పెండేకల్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. గ్రామ, గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మహిళలు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలుసుకుని సమస్యలు ఏకరవు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గంలో పూర్తైన జగన్‌ పాదయాత్ర... వెల్దుర్తి మండలం నర్సరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు 212 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

21:19 - November 21, 2017

కర్నూలు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్.జగన్ ఆరోపించారు. అబద్ధాలు చెప్పే వ్యక్తి సీఎం స్ధానంలో ఉన్నారని.. అలాంటి వ్యక్తిని పొరపాటున తిరిగి ఎన్నుకోవద్దని సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు బేతంచర్లలో జరిగిన సభలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. 14వ రోజు డోన్‌ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి షేక్‌ షా వలీ దర్గాకు చేరుకున్న జగన్ డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో అనంతరం పాణ్యం నేతలతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్లకు చేరుకున్న జగన్‌ బస్టాండ్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు, ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు అందరూ గుర్తు చేసుకోవాలన్నారు జగన్. అలాంటి నేతను తిరిగి ఎన్నుకునేముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా డయాలసిస్ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు వైఎస్.జగన్. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిడ్నీ పేషెంట్లకు అండగా నిలబడటమే కాకుండా.. వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

18:26 - November 21, 2017

కర్నూలు : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మంగళవారానికి 14వ రోజు చేరుకుంది. గోరుగుట్ల నుండి పాదయాత్ర మొదలైంది. షేక్ షా వలీ దర్గా వద్ద డోన్, పాణ్యం నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపారు. బేతంచర్ల బస్టాండు సర్కిల్ లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ సీఎంగా ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. రాత్రికి కోలుములెపల్లిలో జగన్ బస చేయనున్నారు. 

21:28 - November 20, 2017

కర్నూలు : 13వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రారంభమైంది. బాతులూరుపాడు, ఎన్నకొండల, హుసేనాపురం, పాలకూరు క్రాస్‌రోడ్స్, గోవిందదిన్నె మీదుగా సాగి, బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించిన జగన్‌... వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోవిందదిన్నెలో విద్యార్థి జేఏసీ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పార్టీ ప్రకటించిన నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం
హుసేనాపురం వైసీపీ మహిళా సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని జగన్‌ తప్పుపట్టారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. మద్యం బెల్టు షాపులు, విద్యుత్‌ బిల్లుల మోత, నిరుద్యోగం, డ్వాక్రా రుణమాఫీ, రేషన్‌ షాపుల్లో 9 రకాల సరకులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను మహిళలు జగన్‌ దృష్టికి తెచ్చారు. వీటిపై తీవ్రంగా స్పందించిన జగన్‌.. ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అని ప్రశ్నించారు. హుసేనాపురం మహిళా సదస్సులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా... జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హుసేనాపురం నుంచి పాలుకూరు క్రాస్‌రోడ్స్‌, గోవిందదిన్నె మీదుగా సాగిన జగన్‌ పాదయాత్ర బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో జగన్‌ సమావేశమైన జగన్‌, వారి సమస్యలు తెలుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

19:04 - November 20, 2017

కర్నూలు : జిల్లాలో జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. బనగానపల్లె నుంచి బయలుదేరిన పాదయాత్ర గోవిందిన్నె వరకు కొనసాగింది. పలు గ్రామాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరించారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలతోపాటు వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మద్యం బెల్టు షాపులు, నిరుద్యోగం, కరెంటు బిల్లుల మోత, రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరకుల నిలిపివేత వంటి సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అన్ని జగన్‌ ప్రశ్నించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందుని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - YCP MLAs