YCP MPs

06:44 - February 13, 2018

విజయవాడ : 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీ మాకొద్దు' అనే నినాదంతో పోరాటానికి వైసీపీ సిద్దమైంది. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని.. అవసరమైతే ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్దమైంది వైసీపీ.

'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో పోరుబాటకు సిద్దమవుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది వైసీపీ. వచ్చే నెల 1వ తేదీన 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్చి 5న "ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీ వద్దు' అనే నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 3న జగన్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోదన్నారు భూమన. తమ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఎంపీలు ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నారు భూమన. వైసీపీపై అభాండాలు వేసేందుకు టీడీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. టీడీపీ వైఖరిని ప్రజలందరూ చూస్తున్నారని.. దీనికి సరైన సమయంలో సరైన సమాధానం చెబుతుందన్నారు. మొత్తానికి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. మరి వైసీపీ పోరాటంతో కేంద్రం ఏ మేరకు దిగివస్తుందో చూడాలి !

15:13 - February 9, 2018

ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ పోతురాజు వేషధారణలో నిరసన తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ పూనినట్లు నిరసన ప్రదర్శన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని శివప్రసాద్‌ అన్నారు. 

09:42 - February 7, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రజలను మోసం చేసేలా పార్లమెంట్‌లో టీడీపీ డ్రామాలు ఆడుతోందని వైసీపీ ఆరోపించింది. అరుణ్‌ జైట్లీ ప్రకటన చేయగానే.. టీడీపీ నిరసన విరమించి రెండు నాల్కల థోరణిని కనబరిచిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విభజన హామీల అమలులో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీతో భాగస్వామ్యులుగా ఉండి.. చట్టాలు అమలుపరచాల్సిన వాళ్లు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విభజన చట్టం హామీల అమలు కోసం వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. 

 

16:17 - February 6, 2018
16:16 - February 6, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై టిడిపి గుస్సాగా ఉన్న సంగతి తెలిసిందే. విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు లోక్ సభ..రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. మంగళవారం ఎప్పటిలాగానే టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నట్లు, అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగిందన్నారు. ఈఏపీ నిధుల మంజూరుపై చర్చిస్తున్నట్లు, రెవిన్యూ లోటు కింద ఏపీకి రూ. 3900 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. రైల్వే జోన్ విషయంపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 

16:08 - February 6, 2018
15:59 - February 6, 2018

ఢిల్లీ : మన్మోహన్ సింగ్ చేసేది సరిపోదని..తన కాళ్లపై నిలబడే విధంగా చేస్తామని అధికారంలోకి రాకముందు బీజేపీ ఎన్నో హామీలిచ్చిందని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అప్పట్లో వాగ్ధానాలు ఇచ్చారని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్యసభలో తాను ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లు సభ ఎదుట పెట్టలేమని..తిరిగి బిల్లును తనకు పంపించారని తెలిపారు. అయినా ఎలాంటి వెనకడుగు వేయకుండా తన పోరాటం చేస్తానని హామీనిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపనకు నీళ్లు..మట్టి తీసుకొచ్చారని, తాము అప్పట్లోనే తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు. సభలో..సభ బయట ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబుకు ఇలాంటి ఆలోచన తట్టిందని..ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యినందుకు తనకు సంతోషం కలిగిందన్నారు. 

15:51 - February 6, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన అంశం చాలా సున్నితమైనదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ లోక్‌సభలో అన్నారు. ఇప్పటికే ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. మిత్రపక్షమైన టిడిపి సభ్యులు, వైసిపి సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సహకరించాలని సభ్యులను కోరారు. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

15:16 - February 6, 2018

ఢిల్లీ : లోక్ సభలో టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విభజన హామీలపై ప్రధాన మంత్రి నుండి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదని తెలుస్తోంది. టిడిపి ఎంపీలు జరుపుతున్న ఆందోళనలను విరమింప చేసే విధంగా చూడాలని సుజనాకు మోడీ సూచించినట్లు సమాచారం. తన చేతుల్లో లేదని సుజనా పేర్కొనడంతో నేరుగా సీఎం బాబుతో మాట్లాడుతానని మోడీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్ సభ వాయిదా పడగా మళ్లీ సమావేశం ప్రారంభమైంది. కానీ ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 3.30గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభలో కూడా టిడిపి ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ వెల్ లోకి వచ్చి ప్లకార్డులతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై నేరుగా ప్రధాన మంత్రి..సంబంధిత మంత్రితో చర్చించాలని డిప్యూటి ఛైర్మన్ సూచించారు. కానీ ఎంపీలు ఏ మాత్రం వినిపించుకోలేదు. చివరకు కొద్దిసేపటి అనంతరం ప్రభుత్వం సమాధానం ఇచ్చే అవకాశం ఉందని..చూద్దామని..అంతవరకు ఆందోళన విరమించాలని డిప్యూటి ఛైర్మన్ సూచించడంతో టిడిపి ఎంపీలు శాంతించారు. 

14:49 - February 6, 2018

ఢిల్లీ : విభజన చట్టం హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేపడుతున్నారు. వెల్ లోకి వెళ్లి ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీనితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. ప్రధాన మంత్రితో ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఎంపీల ఆందోళనలు విరమింప చేయాలని సుజనాకి మోడీ సూచించినట్లు తెలుస్తోంది. తన చేతుల్లో ప్రస్తుతం లేదని సుజనా పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడుతానని పీఎం మోడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - YCP MPs