Ys Jagan Padayatra

15:27 - November 23, 2017
21:27 - November 22, 2017

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బాలపూర్‌ క్రాస్‌రోడ్స్‌, పెండేకల్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. గ్రామ, గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మహిళలు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలుసుకుని సమస్యలు ఏకరవు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గంలో పూర్తైన జగన్‌ పాదయాత్ర... వెల్దుర్తి మండలం నర్సరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు 212 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

07:41 - November 22, 2017

జగన్ పాదయాత్ర, టీడీపీ ప్రభుత్వ పాలనపై వక్తలు హాట్ హాట్ గా చర్చించారు. భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు పద్మజా రెడ్డి, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. పరస్పరం వాదోపవాదాలకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:24 - November 19, 2017

కర్నూలు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో యాత్ర చేశారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల పార్టీ జెండాలు ఆవిష్కరించారు. వృద్ధులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ల మంజూరు వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలును ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేశారని బనగాలనపల్లె సహా పలు సభల్లో జగన్‌ విమర్శించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. 

12:41 - November 18, 2017

హైదరాబాద్ : వైసీపీలో ప్రస్తుతం పికే హవా నడుస్తోంది.. 2019లో అధికారంలోకి రావాలంటే ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలు సలహాలు తప్పకుండా అమలు చేయ్యాలని జగన్‌ భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పాదయాత్రను నమ్ముకునే ముందుకు సాగుతుంది. ఆరు నెలల పాటు పాదయాత్ర చెయ్యనున్న జగన్‌ అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీలో నిన్నటి వరకూ జగన్‌ ఒక్కరే వన్‌ అండ్‌ ఓన్లీగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం వైసీపీలో ప్రశాంత్‌ కిషోర్‌ ఏం చెబితే అదే నడుస్తుంది. పార్టీ వేసే ప్రతి అడుగులో పికే రోల్‌ కచ్చితంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాదయాత్రలో కూడా పికే టీం డైరక్షన్‌ కీ రోల్‌గా మారింది.

పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌
పార్టీ కార్యక్రమాలను వివిధ రూపాల్లో పికే టీం రూపొందించారు. పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌ కనిపిస్తుంది. ఎన్ని గంటలు పాదయాత్ర చెయ్యాలి.. ఎంత దూరం నడవాలి.. మార్గ మధ్యలో ఎవరెవరిని కలవాలి అనే అంశాలపై పికే టీం రూట్‌ మ్యాప్‌ ద్వారానే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజూ రైతులతో నేరుగా మాట్లాడటం, విద్యార్ధులతో ముఖాముఖి, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహించడం, సాయంత్రం ఏదో ఒక కీలక అంశం ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు జగన్‌ లైవ్‌ అప్‌ డేట్స్‌ అందుబాటులో ఉండేలా 70మందితో టీం వర్క్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం జగన్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియా వైసీపీ, వైఎస్‌ఆర్‌ కుటుంబం, జై జగన్, ప్రజా సంకల్ప యాత్ర లైవ్‌ అంటూ పదికి పైగా లైవ్‌ పేజ్‌ల ద్వారా పాదయాత్రపై మరింత ఫోకస్‌ పెరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు.

డ్రెస్‌ కోడ్‌
జగన్‌ పాదయాత్రను ఐదు పికే టీంలు ఫాలో అవుతున్నాయి. ఈ టీంలు పాదయాత్రలో అన్ని వైపుల నుండి ఫాలో అవుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు వీరిని గుర్తించేందుకు డ్రెస్‌ కోడ్‌ ధరిస్తున్నారు. ఒక్కో టీంలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు జగన్‌తో పాటు నడుస్తుంటారు.. జగన్‌ ఎవరెవరిని కలుస్తున్నారో.. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో.. వారి ఫొటోలు వీడియోలు రికార్డు చేస్తున్నారు. వీరు తీసిన ఫొటోలు ఎప్పటికప్పుడు హై స్పీడ్‌ నెట్‌ ద్వారా హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపిస్తారు.. వాటిలో బెస్ట్‌ సెలెక్ట్‌ చేసి సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తున్నారు. వీలైనన్ని గ్రూపులకు ఈ మెసేజ్‌లు ఫోటోలు పంపిస్తున్నారు. జగన్‌ స్పీచ్‌ పాదయాత్ర ముఖాముఖి వంటి కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో లైవ్‌ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుండి స్పందనను తీసుకుని వాటిని పికే కు పంపిస్తున్నారు. ఇక రెండవ టీం మీడియాతో ఉంటుంది. మూడవ టీం ప్రజల్లో కలిసిపోతుంది. ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది. నాల్గవ టీం ప్రధానంగా వృద్ధులు, విద్యార్ధులు, మహిళలతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇక ఐదవ టీం స్థానికుల ఫోన్‌ నెంబర్లను.. వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇలా మొత్తానికి జగన్‌ పాదయాత్రలో ప్రషాంత్‌ కిషోర్‌ టీం హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.. అయితే పికే టీంతో కొంతమంది నేతలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. అధినేత జగన్‌ మాత్రం పికే టీంలకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

22:03 - November 12, 2017


కడప : చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టామన్నారు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. ఆరో రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చెన్నమరాజుపల్లె, చాపాడు కెనాల్‌, కామనూర్‌, రాధానగర్‌ మీదుగా 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చేనేత కార్మికులు, ఇతర కుల సంఘాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్తలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలన్నారు జగన్‌. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావాలన్నారు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికే పాదయాత్ర చేస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలు దిద్దిన మానిఫెస్టో తీసుకువస్తానన్నారు. ప్రజల భయంతోనే చంద్రబాబు మానిఫెస్టో నెట్‌లో పెట్టలేదని విమర్శించారు.

 

16:32 - November 12, 2017

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్‌ అయ్యారు. విజయవాడలో మీడియాతో మట్లాడిన ఆయన... జగన్‌ చేసే అవినీతి రాజకీయాలు ఆదర్శంగా తీసుకుంటే యువత నష్టపోతారని ధ్వజమెత్తారు. అవినీతి సామ్రజ్యానికి జగన్‌ మాట,నడక ఒక భస్మాసుర అస్త్రం అని దుయ్యబట్టారు. జగన్‌ అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరువస్తుందని మండిపడ్డారు. ఇలాంటి నాయకుడు రాజకీయాలకు అనవసరమన్నారు.

 

21:50 - November 11, 2017
19:57 - November 11, 2017

కడప : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఐదో రోజు పాదయాత్ర ఎర్రగుంట్ల - ప్రొద్దుటూరు రోడ్డు నుంచి ప్రారంభమైంది. పొట్లదుర్తిలో జగన్‌ వైసీపీ జెండా ఎగరవేశారు. వాల్మీకి - బోయ సంఘాలు జగన్‌ను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్‌బీఎస్‌కే ఉద్యోగులు, 108 ఉద్యోగులు, వీఆర్‌ఏల ప్రతినిధులు,  ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఉద్యోగులు, వికలాంగులు, వృద్ధులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వారికి అండగా ఉంటానని జగన్‌ హామీ ఇచ్చారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Ys Jagan Padayatra