Ys Jagan Praja Sankalpa Yatra

21:26 - February 12, 2018
18:09 - February 12, 2018

నెల్లూరు : ఏపీకి విభజన హామీలు అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే పలు వ్యాఖ్యలు చేస్తుండడం..పవన్ ఇందులో జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు కారణంగా వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని..కేంద్ర బడ్జెట్ లో కూడా వైసీపీ అధినేత జగన్ స్పందించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా పాదయాత్రలో ఉన్న జగన్ అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెద్దకొండూరుకు చేరుకుంది. వైసీపీ ఎంపీలు..ముఖ్య నేతలు..అందుబాటులో ఉన్న నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయాలి ? కేంద్రంపై వత్తిడి ఎలా తేవాలనే దానిపై చర్చించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చించనున్నారు. 

20:52 - February 10, 2018

కేంద్ర బడ్జెట్...కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై సంతృప్తిగా లేదని, కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ప్రభుత్వం వత్తిడి తేలేదని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు..తదితర అంశాలపై టెన్ టివి ముచ్చటించింది. 8వ తేదీన వామపక్షాలు బంద్ కు పిలుపునిస్తే తాము మద్దతు తెలియచేయడం జరిగిందన్నారు. టిడిపి డ్రామాల్లాగా చేయడం లేదని, ప్రధాన మంత్రి స్పీచ్ సమయంలో తమ సభ్యులు వాకౌట్ చేయడం జరిగిందన్నారు. బిజెపి పొత్తుకు తాము తహ తహ ఆడడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:34 - February 6, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రను సద్వినియోగం చేసుకోవడంలో నేతలు విఫలమవుతున్నారా...? పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చినట్లు కనిపిస్తున్నా... పార్టీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది... వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలిందేంటి...?
అధికారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర
సుమారు వెయ్యి కిలోమీటర్లు... ఎనభై రోజులు.. ఆరు జిల్లాలు, 36కు పైగా నియోజకవర్గాలు.. అడుగడుగునా జనంతో కలయిక.. ప్రజా సమస్యలపై ఆరా.. ఇలా కొనసాగుతోంది వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతోందీ పాదయాత్ర..  ప్రజా సమస్యలను అధ్యాయనం చేస్తూ ముందుకు వెలుతున్నారు జగన్. కానీ.... దానివల్ల వస్తున్న స్పందనను నేతలు  సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. 
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే 
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని...  నెల్లూరు రూరల్‌లో కొనసాగిస్తున్నారు. ఇంతవరకూ పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే చేసింది. పాదయాత్ర సమయంలో ఉన్న జోష్‌ తర్వాత కనిపించడంలేదని ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై స్థానిక కార్యకర్తలు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి వారే అన్నచందంగా నేతల తీరు
జగన్ పాదయాత్ర సమయంలో కలిసికట్టుగా కనిపించే నేతలు ఆ తర్వాత ఎవరికి వారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.  క్షేత్ర స్థాయిలో జోష్‌ వచ్చిందని సంబరాలు చేసుకున్న నేతలు... దాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఆయా ప్రాంతాల్లో సమన్వయకర్తలే  అభ్యర్థులమని భావిస్తున్నారు. ఈవిషయం  కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఆయా నేతల వ్యవహార శైలిపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇకపై స్థానిక నేతలపై దృష్టి పెట్టకపోతే.. పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వైసీపీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై అలాంటి నేతలపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

 

21:30 - January 1, 2018
06:39 - December 15, 2017

అనంతపురం : లంచాలకు కక్కుర్తిపడి వందలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే ఎఫ్‌సిఐ గోదాములను మూసివేశారని వైసిపి అధినేత వైఎస్ జగన్‌ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్ర 35వ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. రాప్తాడు నియోజక వర్గం గంగులకుంట నుంచి కందుకూరు, హంపాపురం, చిగిచెర్ల వరకు కొనసాగింది. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేటితో రాప్తాడు నియోజక వర్గంలో ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. తిరిగి 16 నుంచి ధర్మవరం నియోజక వర్గంలో 36వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం శుక్రవారం కోర్టుకు హజరు కావాల్సి ఉండటంతో హైదరాబాద్ కు బయలు దేరి వెళ్ళారు.

 

21:55 - December 14, 2017

అనంతపురం : లంచల కోసమే ఎఫ్ సీఐ గోదాములు మూశారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన ప్రజాసంకల్ప యాత్రకు స్వల్ప విరామన్ని ఇచ్చారు. రేపు కోర్టుకు హాజరుకవాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

11:14 - December 7, 2017

విజయవాడ : పోలవరంకు నేతలు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా పోలవరం నిర్మాణంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ యాత్ర చేపట్టింది. గురువారం వైసీపీ ప్రజాప్రతినిధులు పోలవరానికి బస్సుల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రతిపక్ష బాధ్యతను నెరవేర్చడానికి పోలవరం సందర్శించనున్నట్లు తెలిపారు. సందర్శన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుకనున్న అంశాలను ప్రజలకు తెలియచేస్తామని, 2019 వరకు ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెస్తామని పేర్కొన్నారు. 

09:39 - December 7, 2017

విజయవాడ : పోలవరం నిర్మాణ ప్రాజెక్టు స్థలానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవలే పోలవరం నిర్మాణంపై కేంద్రం లేఖ రాయడం..దానిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలవరం నిర్మాణ ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమౌతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడ నుండి ప్రత్యేక బస్సుల్లో వైసీపీ ప్రతినిధి బృందం బయలుదేరనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న అంశాలను ప్రజలకు తెలియచేస్తామని, అంతేగాకుండా నిర్మాణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని పార్థసారధి డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

22:09 - December 6, 2017

అనంతపురం : 28వ రోజు తరిమెలలో పాదయాత్ర చేస్తున్న జగన్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని అసత్యపు హామీలిచ్చారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని అబద్ధాలు, మోసాలే ఉన్నాయన్నారు. ఎన్నికల మానిఫెస్టో తీసుకొచ్చి ప్రతి పేజిని ఒక కులానికి మోసం చేయడానికి కేటాయించారన్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Ys Jagan Praja Sankalpa Yatra