YSR

17:01 - July 8, 2017

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 68వ జయంతిని ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయని.. ఆయన వల్ల ప్రతి ఒక్కరూ లబ్దిపొందారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ.. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

15:59 - July 1, 2017

గుంటూరు : వైసీపీ జాతీయ ప్లీనరీకి సిద్ధమవుతోంది. ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టింది. ఈనెల 8,9 తేదీల్లో రెండు రోజులపాటు గుంటూరులోని ఎన్టీరంగా యూనివర్సిటీ సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ప్లీనరీ కోసం దాదాపు 12 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ప్లీనరీ విజయవంతం కోసం మొత్తంగా 18 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఇక వైసీపీ ప్లీనరీలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు భవిష్యత్‌ కార్యక్రమాలను ప్లీనరీలో రూపొందించనున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు. పార్టీ బలోపేతంపైనా ప్లీనరీలో చర్చించనున్నారు. పలు ప్రజా సమస్యలపై ప్లీనరీ తీర్మానాలను ఆమోదించనుంది. ఈ ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇందుకోసం 8వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 9వ తేదీన నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే జగనే మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. 

16:41 - April 21, 2017

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పేర్కొంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వాదనలు విని, ఈ నెల 28కి తీర్పును వాయిదా వేసింది. అయితే, మ‌రోవైపు న్యూజిలాండ్ వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు. మే 15 నుంచి జూన్ 15 మ‌ధ్య 15 రోజులు వెళ్లేందుకు ఆయ‌న‌ అనుమ‌తి కోరారు. వేస‌వి సెల‌వుల నిమిత్తం కుటుంబంతో క‌లిసి వెళ్లాల‌ని జ‌గ‌న్ పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారించిన కోర్టు ప‌లు అభ్యంత‌రాలు తెలుపుతూ త‌మ‌ నిర్ణ‌యం ఈ నెల 28న తెలుపుతామ‌ని చెప్పింది.

15:55 - January 11, 2017

కడప : భవిష్యత్ లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. . పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడికి చప్పట్లు అవసరం లేదని, 2019 వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేస్తే కృష్ణా నీళ్లు కాదు..గోదావరి నీళ్లు వస్తాయన్నారు. కన్న కలలు సాకారం కావాలంటే సపోర్టు చేయాల్సిందేనన్నారు. రెడ్ల కులం అధిపత్యంపై కూడా ఆయన మాట్లాడారు. కులం..వర్గం ఇవేమి పెట్టుకోవద్దని..బాబుకు సమస్యలు పెట్టే వారు ఎవరూ లేరని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

 

15:40 - January 11, 2017

కడప : 'నీ ఇంటికి వస్తా..నీ నట్టింటికి వస్తా' అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అదే డైలాగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలికితే ఎలా ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ఎంపీ జేసీ తనదైన శైలిలో విమర్శలు..ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం బాబు చొరవతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'బూట్లు నాకే వ్యక్తి అని అయితే ఎప్పుడూ మంత్రిగా ఉండేవాడిని..మా ఇంట..వంట..సారాయి తాగే అలవాటు లేదు..నాలుక చీరుస్తావా..అంత మొగడివా..నీ ఇంటికి వస్తా..పులివెందులకు వస్తా' అంటూ డైలాగ్స్ పలికారు. 1981లో మొట్టమొదటిసారిగా తాడిపత్రికి పిలిపించి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

15:40 - January 11, 2017

కడప : పైడిపాలెం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు సాక్షిగా దివంగత రాజశేఖరరెడ్డిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పొగిడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, 650 కోట్లతో పనుల్ని ఇంచుమించు పూర్తిచేశారు. మిగిలిన పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో రాజశేఖరరెడ్డి కల నెరవేరిందని అన్నారు. అలాగే 2012-13 శనగపంట బీమా గురించి చాలా సార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. అలాగే ఎస్సీఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వెంటనే సీఎం కల్పించుకుని, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో ఎస్సీఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వెంటనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

13:27 - September 2, 2016

కడప : వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపాయల చేరుకున్న జగన్ వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు విజయలక్ష్మి, భారతి, షర్మిళ, పార్టీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వై.వి సుబ్బారెడ్డి మరియు ఎమ్మెల్యేలు అంజాంద్ పాషాలతో పాటు పలువురు నివాళులర్పించారు. వై.ఎస్ సమాధి వద్ద జగన్, విజయలక్ష్మిలతో పాటు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్దనలు చేశారు.

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు...
వైఎస్‌ఆర్ హయాంలోనే ఇంతకు ముందెన్నడూలేని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్ ఏడవ వర్థంతి సందర్భంగా వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రాజమోహన్‌రెడ్డి, ఎంపీ బుట్టారేణుక, లక్ష్మీపార్వతి ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

10:59 - September 2, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో తొలగింపుపై వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈమేరకు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ ఫొటో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో మిగిలిన ఫొటోల సంగతేంటని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎప్ ఫొటో ఉందంటున్నారు.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో చాలా ఫొటోలున్నాయని..మరి ఆ ఫొటోలు నిబంధనలకు విరుద్ధంగా లేవా అని ప్రశ్నించారు. వైఎస్ బతికుంటే కరువు ఉండేదా- అన్నారు. వైఎస్ తన చిరునవ్వుతో మేఘాలు మధించి వర్షాలు కురిపించారని కొనడియారు.

 

 

19:02 - September 1, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేలును జగన్‌ వివరిస్తే.. హోదా వల్ల మాత్రమే అన్నీ వచ్చే అవకాశం లేదన్నారు ఏపీ సీఎం.

ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలపై...

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలపై, దానివల్ల కలిగే లాభాలపై శాసనసభలో సుదీర్ఘ చర్చజరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ.. స్పెషల్‌ స్టేటస్‌ వల్ల రాష్ట్రానికి 90 శాతం నిధులు గ్రాంటుగా రావడంతో పాటు మరెన్నో లాభాలున్నాయని చెప్పారు. అయితే.. జగన్‌ చూపిస్తున్న ఆధారాలకు హేతుబద్ధత లేదన్నారు చంద్రబాబు. పీఎస్ఆర్‌ అనేది శాసన సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే సంస్థ మాత్రమే అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న జగన్‌.. దీనివల్ల ఎక్సైజ్‌, కస్టమ్స్‌ డ్యూటీ, ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ వంటి ఎన్నో విభాగాల్లో రాయితీలు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే.. గతంలో ప్రత్యేక హోదా ద్వారా ఈ రాయితీలన్నీ వచ్చిన మాట వాస్తవమేనన్న బాబు.. రానురానూ వాటిల్లో కోత విధిస్తూ వచ్చారని, ఇప్పుడు హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదన్నారు.

నరేంద్ర మోదీ అనుకుంటే నిమిషాల్లో పని....

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నరేంద్ర మోదీ అనుకుంటే నిమిషాల్లో పని అన్న జగన్‌.. ఇప్పటి వరకూ ఇచ్చిన 11 రాష్ట్రాలకూ కేంద్ర కేబినెట్‌ సమావేశాల్లోనే ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన బాబు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, మేలు జరిగే అన్ని అవకాశాల కోసం పోరాడుతున్నామని బాబు చెప్పారు. వాదోపవాదాలతోపాటు, సుదీర్ఘంగా చర్చజరిగిన తర్వాత.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

13:18 - September 1, 2015

హైదరాబాద్ : గతంలో వైఎస్ ఆర్ .. తనపై 25 విచారణలను వేశారని... కానీ ఏం చేయలేకపోయారని కాబట్టి నీతండ్రి వల్లే కాలేదు.. నీవల్లేమవుతుందని జగన్ చేసని వ్యాఖ్యలను ఉద్దేశించి... చంద్రబాబు అన్నారు. జగన్ పై 11 ఛార్జీషీట్ ఉన్నాయని తెలిపారు. తన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని.. నిప్పులాంటి వ్యక్తినని తెలిపారు. అవినీతిరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. వైసిపి సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. గతంలో తాను బూతులు మాట్లాడలేదు కానీ వైసిపి సభ్యులు బూతులు మాట్లాడుతున్నారు. ఆనాడు సభలో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి మహానేతలు ఉన్నప్పుడు తాను హుందాగా వ్యవహరించానని చెప్పారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. గతంలో వైఆర్ ఆర్ ప్రభుత్వంలో మాట్లాడుకోవడానికి మైక్ కూడా ఇవ్వలేదని... కానీ ఇప్పుడు జగన్ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నామని తెలిపారు. 

 

Don't Miss

Subscribe to RSS - YSR