YSRCP Party

14:37 - February 22, 2018

హైదరాబాద్ : టిడిపి..బిజెపి పార్టీలపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానంపై ఆయన మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఒక డ్రామ ఆడిందని..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని..13 జిల్లాల కోరుకుంటున్నారంటూ ఉద్యమాలు చేస్తున్నామని...పోరాటాలు చేస్తున్నామంటూ ఆనాడు మంత్రులుగా ఉన్నవారు చక్కగా నటించారని విమర్శించారు. అలాంటి డ్రామాలు వేసిన కాంగ్రెస్ కు తరువాత ఎలాంటి గతి పట్టిందో అలాంటి గతి బిజెపి..టిడిపికి పడుతుందని పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో టిడిపి..బిజెపి పార్టీలకు డిపాజిట్ లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.

ఎన్టీరామారావు అధికారంలోని నుండి దించడమే కాకుండా పార్టీని..గుర్తుని..ఎన్నో లాక్కొన్నారని, ఆయన మరణించడానికి బాబు కారకులని ఆరోపించారు. ఎన్టీరామారావు బొమ్మలు పెట్టి...ఆశయ సాధన కోసం పాటు పడుతామని చెప్పడం దౌర్భాగ్యమన్నారు. ఆయనను నమ్ముకున్న ఓ వర్గం వారు గ్రహించాలని..బాబు పచ్చిమోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడని అంబటి విమర్శించారు. 

07:05 - February 11, 2018

హైదరాబాద్ : లెప్ట్ పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తారు..  రైట్ పార్టీలతో స్నేహానికి సిద్ధమంటారు... ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయరు... రాష్ట్రంలో మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు మద్దతిస్తారు... ఇంతకీ వైసీపీ అధినేత వైఖరేంటి..? జగన్‌ రెండు పడవల ప్రయాణం ఎంతవరకు సాగనుంది..? 

రాష్ట్ర విభజన,  కేంద్ర బడ్జెట్‌లో అన్యాయానికి వ్యతిరేకంగా ఏపీలోని అన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమాలు చేయపట్టింది.  అయితే కేంద్రంపై పోరాటం విషయంలో జగన్ ఒక్క వైపు కమలంపార్టీతో సానుకూలదొరణతో వ్యవహరిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో  బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఆందోళన నిర్వహించడం.. చర్చనీయాంశంగా మారింది. 

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై  టీడీపీ నేతలు ఎన్డీయే లో బాగ్యాస్వామ్యలుగా ఉన్న అప్పటికి కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. మరివైపు వైసీపీ సైతం పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నా.. విభజన హామీలు అమలు కాకపోవటానికి టీడీపీ కారణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తుందే తప్ప.. కేంద్రాన్ని కాని ప్రధాని మోడిని కాని ఒక్క మాట కూడా అనడంలేదు.  దీంతో కేంద్ర పై జగన్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ జగన్ చేస్తున్న కామెంట్ లు  జగన్ బిజేపికి దగ్గిరయ్యేందుకు సంకేతాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయంపై నిర్వహించిన వామపక్షాలు బంద్‌కు వైసీపీ మద్దతు తెలపడంతో పాటు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా  బంద్ లో పాల్గున్నారు. గతంలోనూ అనేక ప్రజా సమస్యలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన ఆందోళనలకు జగన్ పూర్తిగా మద్దతు ప్రకటించారు. అయితే జాతీయ స్థాయిలో పూర్తి వ్యతిరేకులుగా ఉన్న బీజేపీ, వామపక్షాలతో జగన్ రాష్ట్ర స్థాయిలో ఒకేసారి కలిసి పనిచెయ్యడంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో అవకాశాలు బట్టి బీజేపీతో లేదా వామపక్షాలతో పొత్తు దిశగా జగన్ ఇలాంటి విధానం అనుసరిస్తున్నారని పార్టీలోనూ చర్చ జరుగుతోంది.

భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే జగన్‌ ఇలా ద్విముఖవ్యూహంతో వెళుతున్నారని వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు   వామపక్షాల సపోర్టు కీలకమని జగన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎన్నికల అనంతరం  కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీతో చెలిమి ఉపయోగపడతాయని వైసీపీ అధినాయకత్తం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ అనుసరిస్తున్న రెండు పడవల ప్రయాణం మొదటికే మోసం తెచ్చే అవకాశం ఉందన్న  విశ్లేషణలు కూడా రాజకీయవర్గాలనుంచి  వస్తున్నాయి. 

16:15 - January 12, 2018
07:41 - January 6, 2018

టీడీపీ ఎంపీలు ఈ రోజు నిద్రలేచరని, విభజన హామీలు ఇంతవరు అలాగే ఉన్నాయని, శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీళ్లు ఇచ్చారు తప్ప ఏమీ ఇవ్వలేదని, టీడీపీ ఎంపీలు ఖాళీగా ఉన్నారని, వారి అసెంబ్లీ పెంచడమనేది తప్ప వేరే విషయం లేదని, ప్రభుత్వం ఏది కట్టిన తాత్కలికంగా నిర్మిస్తున్నారని వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విభజన హామీలు అమలు జరగలేదని మంత్రి సుజన చౌదరితో సహా బీజేపీ నేతలు అంగీరించారని, వారు ప్రధాని నుంచి ఒక్క హామీ పొందారు అదేంటంటే సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడమని, 20 వేల కోట్లు రావాలని సీఎం చెప్పారని, ఇంతవరకు రైల్వే జోన్ రాలేదని, రాయలసీమకు ప్యాకెజీలు కూడా రాలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. రాష్ట్ర నేతలు మోడీని అనేక దఫాలుగా కలిశారని, సీఎం చంద్రబాబు అనేక సార్లు ప్రధానిని కలిశారని, తాడేపల్లిగూడెంలో నీట్ వచ్చింది, తిరుపతిలో వచ్చింది కానీ కొంత జాప్యం జరిగిందని, నిర్ధిష్టమైన సమయంలో ఇవ్వన్ని వస్తాయ అని అంటే చెప్పలేమని టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

21:17 - November 21, 2017

విజయవాడ : వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తర్వలోనే సరఫరా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలు లేనప్పుడే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుందని ఈ అంశంపై సభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు.

ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధిపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొని... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ అంశంపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల సమాధానం ఇచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటున్నా సంక్షేమం, అభివృద్ధిక సమాన ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు.

ఆ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ స్థానాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడిన తీరు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఇచ్చిన నోటీసుకు హక్కుల కమిటీకి నివేదించాలని కోరారు.

అనంతరం వ్యవసాయ, అనుబంధ రంగాలపై జరిగిన చర్చకు... వ్యవయసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని.. వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలు లేనిరోజే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి చెందినట్టు అవుతుందంటూ.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ, అనుంబంధ రంగాలపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్‌ కోడెల అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.

08:50 - November 20, 2017

గుంటూరు : నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉపాధి హామీ, వ్యవసాయం రంగాలపై శాసన సభలో చర్చించనున్నారు. సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై శాసనమండలిలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:59 - November 1, 2017

ఢిల్లీ : నారయణ, శ్రీ చైతన్య కాలేజీలలో విద్యార్ధుల ఆత్మహత్యలపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషనర్‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిసారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల యజమానులే మంత్రులుగా ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. స్పల్ప వ్యవధిలోనే 40మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తొందని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

12:28 - October 20, 2017
11:07 - October 20, 2017

హైదరాబాద్ : కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. నేడు జగన్ పాదయాత్ర పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. పాదయాత్ర నేపథ్యంలో 6 నెలలపాటు ప్రత్యేక్ష విచారణ నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. తీర్పు ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:20 - October 17, 2017

అనంతపురం : ప్రముఖ వ్యాపార వేత్త వై.వి.శివారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మీడియాకు తెలియచేశారు. పరిశ్రమలను నెలకొల్పి పరోక్షంగా..ప్రత్యక్షంగా..అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. మూడు వేల మంది కార్యకర్తలు..మూడు వందల వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరుగుతోందని, పదవిని ఆశించి రావడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని..అందర్నీ కలుపుకొని వెళుతానని తెలిపారు.

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - YSRCP Party