yv subba reddy

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

09:38 - June 22, 2018
06:44 - June 22, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఎట్టకేలకు ఆమోదం పొందాయి. ఏప్రిల్‌ 6న వారు ఇచ్చిన రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఉప వైసీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి చేసిన రాజీనామాలను రెండున్నర నెలల తర్వాత స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ఎట్టకేలకు ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది.బుధవారం నుంచే రాజీనామాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న విడివిడిగా రాజీనామా లేఖలను స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు అందించారు. అయితే అప్పటి నుంచి వాటిని ఆమోదించకుండా స్పీకర్‌ పెండింగ్‌లో ఉంచారు. ప్రత్యేకహోదా కోసం తాము పదవీత్యాగం చేశామని, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్‌, ఎంపీలు చెబుతూ వచ్చారు. కానీ ఆ రాజీనామాలు ఆమోదం పొందలేదు. అంతేకాదు.. కర్నాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌... అంతకుముందే రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మే 29న రాజీనామాలపై చర్చించడానికి వైసీపీ ఎంపీలను ఆహ్వానించారు. భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో రాజీనామాలు చేశారని... పునరాలోచించుకుని రావాలని స్పీకర్‌ సూచించారు. ఈనెల 6న వారితో మరోసారి భేటీ అయ్యారు. అయితే రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. దీంతో ఎట్టకేలకు వారి రాజీనామాలు ఆమోదంపొందాయి.

ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించడంతో.. ఇప్పుడు వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా... లేదా అన్నది సర్వత్రా విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే ఉప ఎన్నికలు రావన్నదే నిపుణుల మాట. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 151 (ఏ)సెక్షన్‌ ప్రకారం ఎంపీల పదవీకాలం మరో ఏడాదిలోపు మాత్రమే మిగిలి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు. ఏ స్థానమైనా ఖాళీ అయిన 6 నెలల్లో ఉప ఎఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది చివరి ఏడాదికి వర్తించదని అదే చట్టం చెబుతోంది. దీన్ని ఈసీ వర్గాలు కూడా ధృవీకరించాయి. గతంలోనూ లోక్‌సభ చివరి ఏడాదిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నడూ ఎన్నికలు జరుగలేదని గుర్తు చేస్తున్నాయి. దీని ప్రకారం జూన్‌ 5 తర్వాత ఖాళీ అయిన ఏ లోక్‌సభ సీటుకూ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేనట్లే. వైసీపీ ఎంపీల రాజీనామాలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి కాబట్టి ఈ స్థానాలకు ఎప ఎన్నికలు జరగవని అధికారవర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ ఐదుగురు ఎంపీలు మాజీలు కావడంతప్ప ఏమీ ఉండబోదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

13:50 - April 7, 2018

ఢిల్లీ : భారతదేశంలో ఏపీ అంతర్భాగమా... కాదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలోని 125 కోట్ల ప్రజల్లో 5 కోట్ల మంది ఏపీ ప్రజలు భాగస్వాములా..కాదా అని ప్రశ్నించారు. దేశంలోని రాజ్యాంగ చట్టాలు ఏపీకి వర్తిస్తాయా లేదా... అని అడిగారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలను ఏపీలో ఎందుకు అమలు జరుపరని ఆయన నిలదీశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని విమర్శించారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ కలిసి రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించాయని విమర్శించారు. వారికి కావాల్సిన రాజకీయాలు, అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే వారి సంగతి తేల్చుతారని తెలిపారు. తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే నటులని, డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం దురృష్టకరమన్నారు. 
నేను ఆరోగ్యంగానే ఉన్నా : మేకపాటి.. 
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వదని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయరని అన్నారు. ఆందుకే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మనకు మంచి రోజులు వస్తాయన్నారు. మన అవసరం కూడా కేంద్రప్రభుత్వానికి పడుతుందన్నారు.

 

12:21 - April 7, 2018

ఢిల్లీ : ఏపీ భనవ్ లో వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. ప్రత్యేకహోదా కోరుతూ దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు అన్నారు. చివరి అస్త్రంగా రాజీనామా చేస్తామని ఎంపీలు అంటున్నారు. 

 

08:27 - April 7, 2018

ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ లో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం క్షీణిస్తోందని నిరాహార దీక్షను విరమించాలని వైద్యులు మేకపాటికి సూంచించారు. 

 

19:26 - April 2, 2018

ఢిల్లీ : ఆమరణ నిరాహార దీక్షకు వైసీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో సమావేశమైయ్యారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని తెలియచేస్తానని రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. 

19:20 - April 2, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 9వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్‌మాల్యాను లండన్‌లో కలవలేదా అని ప్రశ్నించారు. 2016 మార్చి 2న విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోయాడని.. సరిగ్గా 10 రోజుల తర్వాత లండన్‌ వెళ్లిన చంద్రబాబు మాల్యాను కలిశారని అన్నారు. 2009, 2014 ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్‌ కింద మాల్యా నుంచి చంద్రబాబు 150 కోట్ల రూపాయలు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.   

18:18 - April 2, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానాలపై కేంద్రం తప్పించుకునే థోరణిలో వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నట్లున్నారని మేకపాటి విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంలో ఉండి సాధించలేని వాళ్లు ఇప్పుడు ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందంటున్న మేకపాటితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:04 - April 1, 2018

ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగడుతున్నామన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్‌ ఆరున వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా పోరాటానికి కలిసి రావాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - yv subba reddy