zoo

11:12 - July 17, 2017

హైదరాబాద్: గజరాజు ఆనందంగా నీటిలోకి వచ్చి... తొండంతో పాటు కాళ్లతో నీటిని కొడుతూ ఈదింది. కొన్ని స్టంట్స్‌ కూడా చేసింది. అమెరికాలోని ఆరిజోనా జూ వారు ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. వాళ్ల జూలో ఉండే సముద్ర అనే ఏనుగు స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో అది. జంతుప్రదర్శనశాలలో ఓ జంతు ప్రేమికుడు వాటర్‌ మెలన్‌ను విసిరేశాడు. వెంటనే ఏనుగు అందుకుని తిన్నది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షల 98 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు.

16:39 - May 4, 2017

నాగర్‌కర్నూల్‌ : జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఓ చిరుతను ఫారెస్ట్‌ అధికారులు రక్షించారు. అచ్చంపేట మండలం .. భక్కలింగాయపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత బావిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన రైతులు సమాచారం ఇవ్వడంతో...వరంగల్‌ రెస్క్యు టీం రంగంలోకి దిగి..చిరుతపులిని రక్షించారు.

 

21:51 - May 22, 2016

 హైదరాబాద్ : నగరంలోని జూపార్కులో సింహాల లాంజ్‌లోకి సందర్శకుడు దూకడం కలకలం రేపింది. వెంటనే క్యూరేటర్లు స్పందించి.. సందర్శకుడికి బయటకు తీసుకురావడంతో... ప్రమాదం తప్పింది. సందర్శకుడు మద్యం మత్తులో ఉన్నాడని జూ అధికారులు తెలిపారు. 

 

14:40 - April 25, 2016

బిలాస్ పూర్: ఎండవేడికి ఓ ఏనుగు తట్టుకోలేకపోయింది.. గొలుసుల్ని తెంపుకొని పైప్‌ను పగలగొట్టి వేసవితాపాన్ని తీర్చుకుంది.. చాలాసేపు నీటికింద స్నానం చేస్తూ సేద తీరింది.. చత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని నేషనల్‌ పార్కులో ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడిని భరించలేని ఏనుగు.. గొలుసుల్ని లాగేసింది... పరుగు పరుగున పైప్‌ దగ్గరకు చేరింది.. ఆ పైప్‌ను తన్నేసి నీళ్లు బయటకు వచ్చేలా చేసింది.. ఈ నీటిలో శరీరమంతా తడుపుకుంటూ స్నానం చేసింది.. 

17:58 - April 5, 2016

హైదరాబాద్‌ : ఇటీవల సెల్ఫీ తీసుకోబోయి మరణిస్తున్న సంఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఎంతటి ప్రమాద ప్రదేశాల్లోనైనా సెల్ఫీలు తీసుకోవడానికి భయపడడం లేదు. సెల్ఫీ వీడియోల కోసం వెళ్లి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ సంగతి అటుంచితే.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజగా ఇవాళ హైదరాబాద్ లో మరో ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు ముగిసాయి. హాయిగా గడపడానికి విద్యార్థి జూపార్క్ కు వెళ్లాడు. అంతలోనే విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. పురానాపూల్‌ కు చెందిన మంజిత్‌ కుమార్‌ పదో తరగతి చదువుతున్నాడు. పదోతరగతి పరీక్షలు ముగియడంతో జూపార్క్ కు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ దిగుతుండగా.. కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. 108 అంబులెన్స్ సకాలంలో రాలేదని మృతుని బంధువులు ఆరోపించారు. 

 

12:45 - December 22, 2015

బీజింగ్‌: తన జిమ్నాస్టిక్‌ విన్యాసాలను ఓ పులి ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నించాడో కుర్రాడు. జూ సందర్శిం చేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు కేబుల్‌ కార్‌ లో కూచుని తొలుత శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌పైకి వచ్చేప్పటికి సాహసం చేయాలనిపించింది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్‌ క్లోజర్‌ నెట్‌ పైకి దూకేశాడు. చైనా జంతు ప్రదర్శన శాలలో పులులకు ప్రత్యేక ఎన్‌ క్లోజర్‌ ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్‌ క్లోజర్‌ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్‌ కార్‌ ద్వారా (రోప్‌వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్‌ వే ఛైర్‌ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు. జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనిం చిన్న పులులు ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్‌ న్యూసెన్స్‌ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్‌ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం. పులుల ఎన్‌క్లోజర్‌లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్‌ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్‌ క్లోజర్‌ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్‌ చేస్తూ నానా హంగామా చేశాడు. పులుల మూడ్‌ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్‌క్లోజర్‌లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. 

10:57 - August 2, 2015

విశాఖపట్టణం : నలభై ఏళ్ల నాటి ఇందిరా జూలాజికల్ పార్కు తరలించడంపై ప్రజలు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. జూ ఎక్కడికి తరలించవద్దని నినాదాలు చేశారు. ఇతర చోటికి తరలించడం రాజ్యాంగం ప్రకారం నేరమని సీపీఎం నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో క్లబ్ ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందని, ప్రైవేటు కంపెనీలకు ధారదాత్తం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అసలు జూను ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని, వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవగాహన లేదని మంత్రి గంటా వ్యాఖ్యానిస్తున్నారని, ఎలాంటి అవాహన ఉందో ఆయే చెప్పాలన్నారు. కాలుష్యంలో విశాఖ ప్రథమ స్థానంలో ఉందని, వెంటనే ఈ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

Don't Miss

Subscribe to RSS - zoo