మంగళగిరిలో టీడీపీ కార్యకర్త హత్య

Submitted on 25 June 2019
Tdp Activist murder in Mangalagiri

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయంటూ ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీపై ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ నేతలపై దాడులు మాత్రం ఆగట్లేదు. ప్రకాశం జిల్లాలో టీడీపీ మహిళా నేతను చంపి 24గంటలు గడవక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీ కార్యకర్తను దారుణంగా కత్తులతో పొడిచి చంపారు కొందరు దుండగులు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇంద్ర నగర్ నాలుగో వార్డులో టీడీపీ కార్యకర్త తాడిబోయిన ఉమా యాదవ్‌ను కత్తితో పొడిచి చంపారు దుండగులు. ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. పాత కక్షలే కారణం అని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఏంటి? ఎవరు చేశారనే విషయాలపై క్లారిటీ రావలసి ఉంది.

tdp activist
murder
mangalagiri

మరిన్ని వార్తలు