కుట్ర జరిగింది : తిరుపతి ఎన్నికల ఫలితంపై హైకోర్టుకి వెళ్తా

Submitted on 13 June 2019
tdp leader sugunamma to approach highcourt on election result

తిరుపటి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ సంచలన ప్రకటన చేశారు. తిరుపతి ఎన్నికల ఫలితంపై హైకోర్టుని ఆశ్రయిస్తానని తెలిపారు. పోస్టల బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అధికారులను నిలదీసిన తమపైకి పోలీసులను పంపించి బెదిరించారని అన్నారు. పోస్టల్  బ్యాలెట్ లెక్కింపులో అక్రమాలు చేసి అధికారులే తనను ఓడించారని సుగుణమ్మ అంటున్నారు. తన గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారని.. అలాంటి సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కుట్ర జరిగిందని.. నన్ను ఓడించారని సుగుణమ్మ చెప్పారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై హైకోర్టుకి వెళ్తానని సుగుణమ్మ చెప్పారు. రీ కౌంటింగ్ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. 11వ రౌండ్ వరకు తానే ఆధిక్యంలో ఉన్నానని చెప్పారు. 12వ రౌండ్ లో సడెన్ గా ఫలితం మారిపోయిందన్నారు. దీని వెనుక కుట్ర జరిగిందన్నారు. ఫలితాలు తారుమారు కావడం వెనుక అధికారుల హస్తం ఉందని సుగుణమ్మ ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై తాను ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసి తిరుపతిలో టీడీపీ గెలుపు నిరూపిస్తానని చెప్పారు.

Tirupati
TDP
Sugunamma
Postal Ballot
tirupati result
ap elections
re counting

మరిన్ని వార్తలు