వాళ్లు జగన్‌కు బంట్రోతులా.. క్షమాపణ చెప్పాల్సిందే: అచ్చెన్నాయుడు

Submitted on 13 June 2019
TDP MLA Acham Naidu Comments in AP Assembly

స్పీకర్‌ చైర్‌ వరకు చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే తనని, తోటి శాసన సభ్యుడిని బంట్రోతులం అంటూ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సభలో అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ మాటలు అన్నందుకు సభలో చెవిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రికార్డులు చేసి .. ఆ వ్యాఖ్యలు ఉంటే తొలగిస్తానని వెల్లడించారు. స్పీకర్ వ్యాఖ్యలపై సంతృప్తి చెందని అచ్చెన్నాయుడు.. తాము ప్రజాప్రతినిధులమా లేక బంట్రోతులమా? అన్నది స్పీకర్ చెప్పాలని, చంద్రబాబుకు మేము బంట్రోతులమైతే వైసీపీకి చెందిన 151మంది ప్రజాప్రతినిధులు.. జగన్‌కు బంట్రోతులని ఒప్పుకుంటే తాము కూడా చంద్రబాబు బంట్రోతులమని ఒప్పుకుంటామని అన్నారు.

ఈ క్రమంలోనే సభలో గందరగోళం చెలరేగగా.. చంద్రబాబు జోక్యం చేసుకుని.. ఈ విషయాన్ని ఇంకా రెచ్చగొట్టడం తనకు ఇష్టం లేదని, స్పీకరే ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు కోరారు. దీనిపై సభాపతి మాట్లాడుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించి.. అటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలస్తామని అన్నారు. 

TDP MLA Acham Naidu
AP Assembly
YCP
Jagan

మరిన్ని వార్తలు