వెస్టిండీస్ టూర్ కు భారత్ : విండీస్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్

Submitted on 13 June 2019
Team India to begin ICC World Test Championship against Windies

వరల్ట్ కప్ టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఆగస్టు 22 నుంచి విండీస్ తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ క్యాంపియన్ ప్రారంభం కానుంది. ఐదువారాల పర్యటనలో టెస్టు మ్యాచ్ కు ముందుగానే రెండు జట్ల మధ్య మూడు టీ20లు, వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి.

ఆ తర్వాత ఆగస్టు 22 నుంచి రెండు టెస్టు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆంటిగాలోని వివియాన్ రిచార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఆగస్టు 22 నుంచి 26 వరకు ఒక టెస్టు మ్యాచ్.. జమైకాలోని సబీనా పార్కులో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది. 

వచ్చే రెండేళ్లలో కొత్త ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లను నిర్వహించనున్నారు. టెస్టు మ్యాచ్ లుకు ముందుగా తొలి రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు అమెరికాలోని ఫ్లోరిడాలో బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం వేదికగా ఆగస్టు 3 నుంచి 4 వరకు జరుగనున్నాయి. మూడో టీ20 మ్యాచ్.. ఆగస్టు 6న గయానాలోని నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది.

ఆగస్టు 8న 50ఓవర్ల ఫార్మాట్ తో తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. దక్షిణ అమెరికా దేశంలో రెండు వైపుల వన్డే మ్యాచ్ లు ఆడటం మూడు దశబ్దాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రిన్ డాడ్ లో జరుగబోయే క్వీన్ పార్క్ ఓవల్ తో వన్డే సిరీస్ ముగియనుంది. రెండో వన్డే ఆగస్టు 11న , మూడో వన్డే ఆగస్టు 14న జరుగనుంది. 

Team India
 ICC World Test Championship
Windies
World cup tourny
New ICC Test Matches

మరిన్ని వార్తలు