తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Submitted on 6 July 2019
Telangana 10th Supplementary Results 2019 Released

తెలంగాణ‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో శనివారం (జులై 6, 2019) మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి.

ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాదిలో జూన్ 10 నుంచి 24 వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. 

పదోతరగతి సప్లమెంటరీ పరీక్షలకు 61వేల 431 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 53.59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 36వేల 931 మంది బాలురు ఉండగా 24వేల 500 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రంలో 260 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 

Telangana
10th Supplementary
results
released
2019


మరిన్ని వార్తలు