జులై 06న ఎంసెట్ ఆప్షన్లు

Submitted on 5 July 2019
Telangana Eamcet Options Postponed

ఎంసెట్ ఆప్షన్లు మరోసారి వాయిదా పడింది. జులై 05వ తేదీ శుక్రవారం స్టార్ట్ కావాల్సిన ప్రక్రియ జులై 06న కానుంది. 08వ తేదీ వరకు కళాశాలలను వాటిల్లోని బ్రాంచీలను ఎంచుకోవచ్చని ఎంసెట్ కమీషనర్ వెల్లడించారు. ఫీజుల విషయంలో 83 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. తీర్పు  అనంతరం TAFRCకి ఛైర్మన్‌ను నియమించింది ప్రభుత్వం. కళాశాలలకు  వచ్చే మూడేళ్లకు గాను ఫీజులను కన్ఫామ్ చేసింది.

హైకోర్టుకు వెళ్లని 108  కళాశాలలకూ ఫీజులను నిర్ణయించే ప్రక్రియ జులై 06వ తేదీ వరకు  జరుగుతుందన్నారు. కళాశాలలకు ఫీజుల ఖరారు కాకుండానే కౌన్సెలింగ్  మొదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ హైకోర్టుకు వెళ్లిన కాలేజీలకు మాత్రం  కమిటీ ఖరారు చేసిన ఫీజులుంటాయి. లేనిపక్షంలో అన్ని కాలేజీలకు  తాత్కాలిక ఫీజుల నిబంధన విధించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.  

జులై 04వ తేదీ గురువారం టీఏఎఫ్ ఆర్ సీ మొత్తం 103 కళాశాలలకు  ఫీజులను ఖరారు చేసింది. మరోవైపు బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సులకు  ఇప్పటి వరకు ఏమీ ఫీజుల ప్రక్రియను ప్రారంభించలేదు. బీ ఫార్మసీ  కాలేజీలకు 5, 6 తేదీల్లో కమిటీ విచారణ జరిపి ఫీజులను ఖరారు  చేస్తుందని వెల్లడిస్తున్నారు.

Telangana
TS EAMCET
Options
web options
postponed

మరిన్ని వార్తలు