తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Submitted on 9 June 2019
Telangana EAMCET results released today

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET-2019 ఫలితాలు ఆదివారం (జూన్ 9)న  విడుదల అయ్యాయి. కూకట్ పల్లి JNTUలోని UGC ఆడిటోరియంలో మధ్యాహ్నాం 12 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ టి.పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎన్‌.యాదయ్య ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఇంజినీరింగ్ లో అబ్బాయిలదే హవా :
ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాల్లో అబ్బాయిలే హవా సృష్టించారు. టాప్ 10 ర్యాంకుల్లో ఒక్కరే అమ్మాయి నిలిచింది. కె.రవిశ్రీతేజ (తాడేపల్లిగూడెం) ఫస్ట్ ర్యాంకు సాధించగా.. హైదరాబాద్ కు చెందిన డి.చంద్రశేఖర్ రెడ్డి రెండో ర్యాంకు సాధించాడు. ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్, మాదాపూర్) మూడో ర్యాంకు సాధించాడు.

ఎంసెట్ పరీక్షకు మొత్తం 1లక్ష 31వేల 209 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను 68వేల మంది విద్యార్థులు రాశారు. ఇంజినీరింగ్ పరీక్షను లక్షా 30వేల మంది విద్యార్థులు రాశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు గత నెల (మే 3, 2019) నుంచి మే 9వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు.


ఇంజినీరింగ్ లో :
ఫస్ట్ ఫస్ట్ : ర్యాంకు కె.రవిశ్రీతేజ (తాడేపల్లిగూడెం), 
సెకండ్ ర్యాంకు : డి. చంద్రశేఖర్ (హైదరాబాద్, మాదాపూర్)
థర్డ్ ర్యాంకు : ఆకాష్ రెడ్డి (హైదరాబాద్, మాదాపూర్)
నాల్గో ర్యాంకు : కార్తికేయ (హైదరాబాద్‌)
5.  గొర్తి భానుదత్త
6.  బి. సాయి వంశి
7. సూరపనేని సాయి విజ్ఞ    
8. జి.హితేంద్ర కశ్యప్‌
9.  పి.వేద ప్రణవ్‌
10. అప్పకొండ అభిజిత్‌రెడ్డి    

అగ్రికల్చర్, ఫార్మసీలో : 
ఫస్ట్ ర్యాంకు : కుశ్వంత్ (భూపాల పల్లి)
సెకండ్ ర్యాంకు : కిరణ్ కుమార్ (రాజమండ్రి)
థర్డ్ ర్యాంకు : అరుణతేజ 
నాలుగో ర్యాంకు : సుంకర  సాయి స్వాతి
5. ఆరె  అక్షయ్‌
6. మోనిషా ప్రియ
7. బుర్రా శివానీ శ్రీవాత్సవ
8. సిద్దార్ధ భరధ్వాజ్‌
9. వి.పూజ
10. తిప్పరాజు హర్షిత
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Telangana
Eamcet Results
JNTU
UGC
Papireddy
engineering students
First Rank

మరిన్ని వార్తలు