ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Submitted on 5 July 2019
Telangana government finalized fees in engineering colleges

తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. 103 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మిగతా 88 కాలేజీల్లో 15-20 శాతం ఫీజులను పెంచారు. రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల్లో 15 శాతం పెంచారు. రూ.50 వేల కంటే తక్కువ ఫీజులున్న కాలేజీల్లో 20 శాతం పెంచారు. ఈ విద్యా సంవత్సరంతోపాటు మూడేళ్లకు ఫీజులు ఖరారు చేశారు. 

సీబీఐటీ కాలేజీ ఫీజు రూ.లక్షా 34 వేలు, వాసవి లక్షా 30వేలు, వర్ధమాన్ కాలేజీ లక్షా 25 వేలు, గోకరాపు గంగరాజు లక్షా 22 వేలు, నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కాలేజీ రూ.లక్షా 20వేలు, ఇబ్రహీంపట్నం సీవీఆర్ కాలేజీ రూ.లక్షా 15 వేలుగా ఖరారు చేశారు.

కౌన్సెలింగ్ తోపాటు వెబ్ ఆప్షన్ల్ ఇవ్వడంలో కూడా కొంత ఆలస్యం జరిగింది. రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ జరుగనుంది. దీంతో విద్యార్థులకు ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచాలని హుటాహుటినా తెలంగాణ ఏఎస్ ఆర్సీ ఫీజులు ఖరారు చేసింది. అయితే వీటిలో 103 కాలేజీలకు సంబంధించి వారు సూచించిన ప్రతిపాదనలను బట్టి ఫీజులను పెంచారు. 
అంతేకాకుండా మిగతా 88 కాలేజీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీలు 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు, రూ.50 వేల కంటే తక్కువ ఫీజులున్న కాలేజీలు 20 శాతం ఫీజులు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 

ఇంజనీరింగ్ తోపాటు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించిన కాలేజీలకు కూడా ఈ ఫీజులు వర్తిస్తాయి. అయితే ఇప్పుడు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించి టాప్ 10 కాలేజీలకు లక్షాకు పైగానే ఫీజును నిర్ణయించారు. 
 

telangana government
finalized
fees
Engineering Colleges
Hyderabad

మరిన్ని వార్తలు