సచివాలయం కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు

Submitted on 12 July 2019
Telangana High Court Demolition Secretariat

అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు, సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్య పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఎర్రమంజిల్ లోని 150 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడంపై పిటిషనర్ తరవు న్యాయవాదులు 2019, జులై 12వ తేదీ శుక్రవారం మరోసారి హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 2015 పురాతన భవనాల జాబితా నుండి ఎర్రమంజిల్ ప్యాలెస్‌‌ను ప్రభుత్వం కావాలనే తొలగించిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో స్థలాన్ని ఆక్రమించు కోవాలని విడుదల చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు  వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2019, జులై 15వ తేదీ సోమవారంకు వాయిదా వేసింది.

మరోవైపు స‌చివాలయం త‌ర‌లింపుపై ప్ర‌భుత్వం నియ‌మించిన టెక్నికల్ క‌మీటీ..సెక్ర‌ట‌రియేట్‌ను సంద‌ర్శించింది. స‌చివాల‌యంలోని ప‌ది బ్లాక్‌ల‌ను ప‌రిశీలించింది. భ‌వ‌నాల ప్ర‌స్తుత నాణ్యాత‌, వాటి లైఫ్ టైం త‌దిత‌ర అన్నికోణాల‌లో ప‌రిశీలించింది నలుగురు స‌భ్యుల క‌మిటీ. దీనికి సంబందించిన రిపోర్ట్‌ను ప్ర‌భుత్వం వేసిన మంత్రుల స‌బ్ క‌మిటీకి అందించ‌నుంది టెక్నిల్ క‌మిటీ. ఈ క‌మిటీలో..ఆర్అండ్‌బీ, ఇరిగేష‌న్, పంచాయితీ రాజ్ శాఖ‌ల ఈఎన్‌సీలు స‌భ్యులుగా ఉన్నారు.

Telangana
High Court
demolition
Secretariat


మరిన్ని వార్తలు