తెలంగాణ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఓ హామీ అమలవుతుందా ? లేదా ? అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసిన కేసీఆర్..ఈ హామీని కూడా అమలు చేస్తారని సర్కారీ జీతగాళ్లు అనుకుంటున్నారు.

హైదరాబాద్: చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గజగజ వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది.

హైదరాబాద్ : బతుకమ్మ...తెలంగాణ పూల పండుగ...గత సంవత్సరం నుండి పేదలకు బతుకమ్మ పేరిట చీరల పంపిణీని ప్రభుత్వం చేపడుతోంది.

హైదరాబాద్ : ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన హైదరాబాద్ మెట్రో రైలు కార్యరూపం ధరించింది. వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే మెట్రో పరుగులు తీస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి.

కరీంనగర్ : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండే పనులు మొదలెట్టేశారు.

హైదరాబాద్ : తెలంగాణ హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ డిసెంబర్ 20వ తేదీ గురువారం బాధ్యతలను స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మ్రోగించిన సంగతి తెలిసిందే. తిరిగి రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ : సీబీఐ అదనపు డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావుకు ప్రమోషన్ లభించింది. సీబీఐ తాత్కాలికగా డైరెక్టర్ గా ఇటీవలే నియమితులైన నాగేశ్వరరావుకు సీబీఐ అదనపు డైరెక్టర్ గా పదోన్నతి కల్పిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : ఓటర్ లిస్ట్ సవరణపై రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఓట్ల మిస్సింగ్ పై పరిశీలన చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. 1.1.2019 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు.

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు తప్పులతడకగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ కు అభ్యర్థులు మెమోరాండం ఇచ్చారు. పంచాయతీ రాజ్ ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. 

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలకు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలకు నోటీసులు పంపారు.

Pages

Don't Miss