తెలంగాణ

మహబూబ్ నగర్ : జిల్లాలోని నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.

 

హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. సుమారు గంటసేపటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. కుషాయిగూడ, ఈసీఐఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ లో భారీవర్షం పడింది. చాలాచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

నల్గొండ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అనునిత్యం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ భరించలేక తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం రేగట్టికిచెందిన లోయపల్లి అచ్చాలు పత్తి సాగు చేశాడు. తన సొంత భూమి ఐదెకరాలతోపాటు...

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను టీ.టీడీపీ బృందం కలిసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. రైతు సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 1,300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్ : జల్లాలోని జనగాం పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. బ్రోకర్లను ఆశ్రయించిన వారికి మాత్రమే రుణాలిస్తూ మిగతా వారికి రుణాలివ్వడంలేదని రైతులు ఆందోళన చేశారు.

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు... 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను టీ.టీడీపీ బృందం కలిసింది. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

వరంగల్ : రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు వరంగల్ లో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్‌ది అసమర్థపాలన అని తమ్మినేని విమర్శించారు. టిఆర్ ఎస్ సర్కార్ వచ్చి 14 నెలలైనా.. ఏ హామీ అమలు కాలేదన్నారు.

మెదక్ : జిల్లాలో దళితులను అవమానించిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎల్లారం దళితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మల్కాజ్‌గిరి బీ.జే.ఆర్. నగర్ కు చెందిన నవ్య అనే విద్యార్థిని ఈసీఐఎల్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కొద్ది రోజులుగా మూడీగా ఉంటుంది.

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో ముగిసిన టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. రైతు ఆత్మహత్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని టీటీడీపీ నిర్ణయించింది.

Pages

Don't Miss