తెలంగాణ

నల్లగొండ: జిల్లాలో వైద్యుల మధ్య విభేదాల కారణంగా ఓ శిశువు గర్భంలోనే మృతిచెందింది. తల్లి స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటన జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. చిట్యాలకు చెందిన గర్భిని సాయికళ.. ప్రసవానికి ఆస్పత్రికి వచ్చింది.

ఆదిలాబాద్: జిల్లాలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. తాంసి మండలంలోని వామన్‌నగర్ గ్రామానికి చెందిన మెస్రం రమేష్, మెస్రం ప్రమీల దంపతులు. ప్రమీల తన ఇద్దరు పిల్లలతో వ్యవసాయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

తాజా పరిస్థితులు గమనిస్తే... తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ కలయిక లేనట్లే కనిపిస్తోంది. నిన్నటి నుంచి కేసీఆర్ జర్వంతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్ విందుకు కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. అన్ని అపాయింట్ మెంట్లు రద్దు చేసినట్లు సీఎంవో ప్రకటించింది.

 

హైదరాబాద్: రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభం అయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ దంపతులు, ఎపి సీఎం చంద్రబాబు, ఎపి మండలి ఛైర్మన్ చక్రపాణి, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. 

హైదరాబాద్: ఆదాయపు పన్నుకింద బేవరేజెస్ నుంచి కోల్పోయిన డబ్బుకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. న్యాయపరంగా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్కారు.. ఇన్‌కం టాక్స్ శాఖకు నోటీసులు పంపింది.

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం రసాభాస అయ్యింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎదుటే కార్యకర్తలు గొడవకు దిగారు. సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతుండగా.. అంజన్‌కుమార్ యాదవ్‌ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీహెచ్‌..

హైదరాబాద్: ఎపి మంత్రులపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. కేసును తప్పించేందుకు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో సీమాంధ్రులకు భద్రత ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

 

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టీ విక్రమార్క మండిపడ్డారు. తక్షణమే తలసాని శ్రీనివాస్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు నెలలు పూర్తయినా... తలసాని ఎందుకు రాజీనామా చేయడం లేదని భట్టీ ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో టీఆర్ ఎస్ లో చేరనున్నారు. కొంతకాలంగా అధిష్టానంపై డీఎస్ అలకబూనారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీ ఎస్ బరిలోకి దిగనున్నారు.

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి బెయిల్ పై రేవంత్ రెడ్డి రేపు విడుదల కానున్నారు. బెయిల్ ఉత్తర్వులు అందినా... పూచీకత్తు ప్రక్రియలో ఆలస్యం అవుతుండమే కారణంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తమ్ముళ్లు తీవ్ర నిరాశలో ఉన్నారు.

 

Pages

Don't Miss