తెలంగాణ

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు.

డిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను వెనక్కి తీసుకుంది. కేంద్రప్రభుత్వం  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.190.78 కోట్లు మంజూరు చేసింది.

హైదరాబాద్ : చమురు ధరలు కిందకు దిగి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నా ఏ మాత్రం ధరల్లో తగ్గుదల లేదు. దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన పడిపోతున్నారు.

హైదరాబాద్ : విదేశీ మద్యానికి క్రేజ్‌ పెరుగుతోంది...విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల బ్రాండ్‌లకు నగరంలోని మద్యం ప్రియులు ఫిదా అవుతున్నారు..దీనికితోడు విదేశీ మద్యం తాగడం అన్నది హోదాకు చిహ్నంగా మారిపోతోంది..

జగిత్యాల : జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని హత మార్చాడు. తాటిపెల్లిలో నివాసముంటున్న నవీన్, శ్రవణ్ స్నేహితులు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో నవీన్, శ్రవణ్ గొడవ పడ్డారు. శ్రవణ్ పెన్ కత్తితో నవీన్‌ను పొడిచాడు.

హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీలో నేతల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయంతో అసమ్మతి నేతలపై వేటు వేస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెట్టబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపై చర్చించేందుకు ఇవాళ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై కూడా నేతలు చర్చించనున్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో జనసేన పోటీ చేయరాదని... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రకు ప్రజా స్పందన బాగుందని..టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని మరోసారి చెప్పారు.

హైదరాబాద్ : జబర్దస్త్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తు ఎన్నాళ్టినుండో మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహిళలను కించపరుస్తు ఈ కార్యక్రమంలో స్కిట్స్ వున్నాయంటు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి..ముందే అభ్యర్థులను ప్రకటించేసిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు.

Pages

Don't Miss