తెలంగాణ

కొడంగల్ (మహబూబ్ నగర్) : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం డేగకళ్లతో పర్యవేక్షిస్తోంది.

గజ్వేల్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటింగ్ జరుగుతోందని..టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలున్నాయని తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ లో భాగంగా మెగాస్టార్ కుటుంబ సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ : తొలిసారిగా చేసిన ఏ పని అయినా అదొక తీపిగుర్తుగా వుండిపోతుంది.

హైదరాబాద్: డిసెంబర్ 7 రాష్ట్రం అంతా ఓట్ల కోలాహలంగా వుంది. పలువురు రాజకీయా నేతలుతమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రచారంతో ఓట్లు అడిగిన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే కాక అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రికార్డు శాతం ఓటింగ్ నమోదు కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటలు వరకు 23 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజకీయ నాయకులు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఖమ్మం : ‘ఉదయం 7గంటలకు వచ్చినం..ఇంకా క్యూ లైన్‌లోనే ఉన్నం..ఇంకా ఓటేయ్యలే’..అంటూ ఖమ్మం ఓటర్లు పేర్కొంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

Pages

Don't Miss