TG News

Monday, January 16, 2017 - 16:19

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఏపీ రాష్ట్రం విభజన అయిపోయి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. కానీ విభజన తాలూకు అంశాలు అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో విభజన పునర్ వ్యవస్థీకరణపై 24 పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని 24 పిటిషన్లలో పిటిషనర్లు పేర్కొన్నారు....

Monday, January 16, 2017 - 15:08

నిజామాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటుక బట్టీలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. నిబంధలకు నీళ్లొదిలి ఇటుక బట్టీలను నడుపుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు పొగబారి పోతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి వందల సంఖ్యల్లో బట్టీలు నడుస్తున్నాయి. ఇక వీటిలో చాలా వాటికి అసలు అనుమతులే ఉండవు. నిబంధనలకు విరుద్దంగా వీటిని యజమానులు నడుపుతున్నారు....

Monday, January 16, 2017 - 13:46

హైదరాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. అటు రుణాలు తీసుకోలేక... ఇటు బీమా చెల్లించక రెండువిధాలా నష్టపోతున్నారు.. నోట్ల రద్దు దెబ్బనుంచి కోలుకోలేక అవస్థలు అనుభవిస్తున్నారు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 4లక్షల...

Monday, January 16, 2017 - 13:33

ఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే రాష్ర్ట ప్రభుత్వం బడ్జెట్‌ ఆధారపడి ఉండొచ్చన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదాయం పెరగాలంటే.. పెద్ద డీలర్ల నుంచే పన్నులు వసూలు చేయాలని కేంద్రానికి సూచించామని ఈటెల తెలిపారు. పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గితే.. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గు ఉండే...

Monday, January 16, 2017 - 13:29

హైదరాబాద్: భారత దేశాన్ని పేదరికం పట్టిపీడిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు గడిచినా ఇంకా పేదరికం దూరం కాలేదన్నారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోనే పేదరికం పోదని.. దీనికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరిగిన...

Monday, January 16, 2017 - 12:12

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. అదే డీసీసీల నియామకం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతున్నా...ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత డీసీసీల నియామకం కాంగ్రెస్‌లో సెగ పుట్టిస్తోంది.

కొత్త జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించాలని పీసీసీ...

Monday, January 16, 2017 - 12:08

హైదరాబాద్: లవ్‌.. ఇది ఎక్కడ ? ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరు ఫస్ట్‌ లుక్‌లోనే ప్రేమలో పడితే.. మరికొందరు ఎంతో కాలంగా స్నేహం చేసిన తర్వాత ప్రేమించుకుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు కర్నూలు జిల్లా అబ్బాయి, అనంతపురం జిల్లా అమ్మాయి. ఇక ఒకరినొకరు వీడి ఉండలేని వాళ్లు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత...

Monday, January 16, 2017 - 07:09

హైదరాబాద్ : చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానంటూ మంత్రి కెటిఆర్ ప్రకటించి, కొత్త సంవత్సరంలో ఆశావహ దృక్పథం కలిగించారు. అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ఎంపి కవిత కూడా వస్త్రాలు కొనుగోలు చేయడం మరో విశేషం. చేనేత వస్త్రాలను ఆన్ లైన్ లో విక్రయించేందుకు టెస్కో ప్రయత్నిస్తోంది. ఇలా చేనేతరంగంలో కొత్త...

Monday, January 16, 2017 - 07:00

హైదరాబాద్: ప్రభుత్వ ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ క్యాలెండర్‌పై ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు మౌనదీక్ష చేపట్టారు. గాంధీ భవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట దీక్షకు దిగారు. జాతిపిత గాంధీ స్థానంలో మోదీ చిత్రపటాన్ని ముద్రించడం గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు....

Monday, January 16, 2017 - 06:58

హైదరాబాద్ :రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని ఇకముందు భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానున్నాయన్నారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు....

Monday, January 16, 2017 - 06:56

హైదరాబాద్: పార్టీ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారా.. అని ఎదురు చూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతల కలలు నెరవేరే రోజులు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల కమిటీలతోపాటు, రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌ బ్యూరోలను నియమించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

గతేడాది ఆగస్టు...

Monday, January 16, 2017 - 06:53

హైదరాబాద్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. ముందస్తుగా రైల్వే రిజర్వేషన్లు, బస్సు రిజర్వేషన్లు ఉన్నవారు మినహా, మిగిలిన వారంతా ప్రయాణం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రయాణికుల చేరవేతకు అనుగుణంగా రైలు, బస్సు సర్వీసులు లేవు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ...

Sunday, January 15, 2017 - 19:38

బీహార్ : మకర సంక్రాతి పర్వదినం రోజున బీహార్‌ రాజధాని పాట్నాలో పెను విషాదం చోటు చేసుకుంది. పాట్నా వద్ద గంగా నదీ తీరం సమీపంలో ఓ పడవ మునిగిన ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఓ దీవి వద్ద పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. సహాయక సిబ్బంది ఎనిమిది మందిని రక్షించగా, మరి కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు...

Sunday, January 15, 2017 - 18:32

మహబూబాబాద్ : పల్లెపల్లెను పలకరిస్తూ.. ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 91వ రోజు తమ్మినేని పాదయాత్ర బృందం మందకొమురమ్మ నగర్‌లో పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేదలు తలదాచుకునేందుకు కనీసం ఇళ్లు కూడా ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర...

Sunday, January 15, 2017 - 18:30

చిత్తూరు : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని వెలివాడ దగ్గర రోహిత్‌ వేముల విగ్రహం దగ్గర నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించాలని ఆయన తల్లి రాధిక కోరారు. ఈనెల 17న రోహిత్‌ వర్ధంతి సందర్భంగా విద్యార్ధిలోకం తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్‌ వేముల విగ్రహం ఉన్న వెలివాడ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా వీసీ అప్పారావు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు....

Sunday, January 15, 2017 - 18:21

హైదరాబాద్‌ : శివారు రామచంద్రపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గోల్డ్‌ చోరీకి పాల్పడిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాని నిందితుడు లక్ష్మణ్‌తోపాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను సీజ్‌...

Sunday, January 15, 2017 - 15:13

సిద్ధిపేట : జిల్లాలోని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సెగలు కక్కుతున్న నిప్పులపై నడుస్తూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు...

Sunday, January 15, 2017 - 13:40
Sunday, January 15, 2017 - 13:38

వరంగల్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి మృతదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఎర్రబెల్లి కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. కేసీఆర్‌ వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల, చందూలాల్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Sunday, January 15, 2017 - 12:08

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దర్శించుకుని మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మంత్రి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Pages

Don't Miss