TG News

Monday, May 29, 2017 - 15:43

కరీంనగర్ : సీఎం కేసీఆర్‌ సర్వే ఒక పెద్ద జోక్‌ అంటూ విమర్శించారు కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌.. అభద్రతాభావంతోనే కేసీఆర్‌ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు... సర్వేలో నాలుగోస్థానంలోఉన్న రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Monday, May 29, 2017 - 15:35

వరంగల్ : జిల్లా పర్వతగిరి మండలం అనంతసాగరంలోమ దారుణం జరిగింది. అప్పు ఇచ్చి అడిగినందుకు వీరయ్య అనే వ్యక్తిపై జనార్ధన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వీరయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరయ్య దాదాపు 80 శాతం గాయాలతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. వీరయ్య గత కొన్న సంవత్సరాల క్రితం జనార్ధన్ అనే వ్యక్తి కి లక్ష రూపాయాలు...

Monday, May 29, 2017 - 12:32

కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టీఆర్ఎస్ నేత చేసిన మోసానికి నిండు ప్రాణం బలైంది. జూపాక సుదర్శన్ నేత ఇంటి ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎంపీ వినోద్ కుమార్ అనుచరుడని చెప్పుకుంటూ..ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వల వేశాడు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన కొప్పుల సత్యనారాయణ కుమారుడికి వ్యవసాయ...

Monday, May 29, 2017 - 11:10

హైదరాబాద్ : నగరంలో వందల కోట్ల ప్రభుత్వ ల్యాండ్ స్కాం ప్రకంపనలు రేకేత్తిస్తోంది. ఏకంగా కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఈ స్కాంలో ఉండడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్, ట్రివిటీ సంస్థ డైరెక్టర్లు పార్థసారధి, పీవీస్ శర్మలను పోలీసులు సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అనంతరం వీరికి 14 రోజుల...

Monday, May 29, 2017 - 10:21

ఆదిలాబాద్ : జిల్లాలో పలు చెరువులు కబ్జాలో చిక్కుకున్నాయని, అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జాలు చేశారని టి.కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్మల్ లోని చెరువుల భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడిందని టెన్ టివితో టి.కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువులకు అక్రమంగా పట్టాలిచ్చారని ఆరోపించారు. చెరువుల కబ్జాపై కాంగ్రెస్ పోరుకు సిద్ధమౌతోందని వెల్లడించారు. ఇంకా ఆయన...

Monday, May 29, 2017 - 10:08

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారే అవకాశం ఉందని, రేపు బంగ్లాదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి కోల్‌ కతాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్...

Monday, May 29, 2017 - 06:40

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్వేలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బోగస్‌ సర్వేల పేరుతో అటు రాష్ట్ర ప్రజలను,..ఇటు సొంతపార్టీ నేతలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు సర్వేల మీద నమ్మకం ఉంటే. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. సర్వేల పేరుతో కుటుంబసభ్యులకే ఎక్కువ మార్కులు...

Monday, May 29, 2017 - 06:35

హైదరాబాద్‌ : మియాపూర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా రియల్టర్లకు ధారాదత్తం చేసిన కేసులో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాస్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్‌రావుతోపాటు ట్రినిటీ హోమ్స్‌ అధిపతి పార్థసారథి, అకౌంటెంట్‌ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 693 ఎకరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని శ్రీనివాస్‌రావు అక్రమంగా రిజస్ట్రేషన్‌...

Sunday, May 28, 2017 - 21:38

యాదాద్రి : నరేశ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కేంద్రం భువనగిరిలో ధర్నా జరిగింది. నరేశ్‌ తల్లి, దండ్రులతోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిని ప్రేమించినందుకు కక్ష కట్టిన ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడ్ని హత్య చేయించాడని నరేశ్‌ తండ్రి వెంకటయ్య...

Sunday, May 28, 2017 - 21:33

హైదరాబాద్ : అద్దాల మేడలో ఉంటున్న సీఎం కేసీఆర్‌కు బయటి ప్రపంచం తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సర్వేల పేరుతో కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సర్వేలపై నమ్మకం ఉంటే నల్గొండ పార్లమెంటు స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి మళ్లీ గెలుపించుకోవాలని సవాల్‌ చేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్‌...

Sunday, May 28, 2017 - 21:28

హైదరాబాద్ : ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. సర్వేల మీద కేసీఆర్‌కు నమ్మకం ఉంటే 24గంటల్లోగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలని సవాల్ విసిరారు. నల్గొండలో పార్టీ మారిన గుత్తా చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల్లో పోటీచేయనని...

Sunday, May 28, 2017 - 21:26

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీగా సీట్లు గెలవడం ఖాయమన్నారు గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు. హైదరాబాద్ నాచారంలో జరిగిన టిఆర్ఎస్ ఆరవ డివిజన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ టిఆర్ఎస్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు....

Sunday, May 28, 2017 - 18:33

హైదరాబాద్ : నరేశ్‌ హత్యను నిరసిస్తూ సీపీఎం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం తోపాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కుల రక్కసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Sunday, May 28, 2017 - 18:32

యాద్రాద్రి : నరేష్‌, స్వాతి ట్రాజిడి లవ్‌ స్టోరీలో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగానే నరేష్‌ హత్య మిస్టరీ వీడినా..ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ముందుకు సాగనుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నరేష్‌ను దహనం చేసిన ఆనవాళ్లు మిగల్చకుండా నిందితుడు పక్కా ప్లాన్‌తో అస్థికలు, బూడిదను మూసినదిలో కలిపేశాడు. ఇప్పుడు పోలీసులు...

Sunday, May 28, 2017 - 18:30

హైదరాబాద్ : జూన్‌ 1వ తారీఖున ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంగారెడ్డికి వస్తున్నారని అధికారికంగా ప్రకటించారు టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. జూన్‌ 1న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గం గుండా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఉత్తమ్‌ ప్రకటించారు. 

Sunday, May 28, 2017 - 18:29

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని కేసీఆర్ చేయించిన సర్వే అంతా బోగస్‌ అన్నారు టి-పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఏం సాధించారని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు వారంతా కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఉత్తమ్‌ అన్నారు.

 

Sunday, May 28, 2017 - 17:00

విశాఖ : కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మందు తాగి 111 సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే నవ్వోస్తుందన్నారు. కేసీఆర్‌కు 111 సీట్లు కాదని 150 సీట్లు వస్తాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన సర్వే చేసిందో చెప్పాలని సండ్ర డిమాండ్ చేశారు. తెలంగాణ...

Sunday, May 28, 2017 - 16:57

యాదాద్రి : నరేశ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ అతని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరలో ధర్నా జరిగింది. నరేశ్‌ తల్లి, దండ్రులతోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిని ప్రేమించినందుకు కక్ష కట్టిన ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడ్ని హత్య చేయించాడని నరేశ్‌ తండ్రి వెంకటయ్య...

Sunday, May 28, 2017 - 16:56

విశాఖ : పశ్చిమ మధ్య, దక్షిణ మధ్య బంగాళాఖాతాల్ని కలుపుకొంటూ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ కేరళకు ఈ నెల 30, 31వ తేదీల్లో చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరకు ద్రోణి...

Sunday, May 28, 2017 - 15:00

ఖమ్మం : జీఎస్టీ..! వస్తు సేవల పన్ను..! ఈ పదాలు వింటే చాలు.. గ్రానైట్‌ పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న పరిశ్రమను ఇప్పుడు జీఎస్టీ మరింతగా బెదరగొడుతోంది. గ్రానైట్‌ పరిశ్రమకు, గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌.. GST, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ చట్టం.. గ్రానైట్‌ పరిశ్రమను మూసివేత దిశగా...

Sunday, May 28, 2017 - 14:58

నల్లగొండ : నరేష్‌ హత్యపై నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. సీపీఎం, ప్రజాసంఘాల నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కులరక్కసి దిష్టిబొమ్మను దహనం చేశారు. పలుచోట్ల రాస్తోరోకో నిర్వహించారు. నరేష్‌ హత్య నిందితులను కఠినంగా శిక్షించి అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నరేష్‌ కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు....

Sunday, May 28, 2017 - 14:57

కరీంనగర్ : నరేష్‌ హత్యను నిరసిస్తూ కరీంనగర్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరేష్‌ హత్య నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో కులరక్కసి దిష్టిబొమ్మ దహనం చేశారు. పరువు హత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

Pages

Don't Miss