TG News

Thursday, October 1, 2015 - 16:30

హైదరాబాద్ : 100 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే స్పోర్ట్స్‌ బైక్, ప్రత్యర్ధుల భరతం పట్టేందుకు భారీ లెవల్లో బైక్‌ చేజింగ్‌, అమ్మాయిల మనసు దోచేందుకు మెరుపు వేగంతో బైక్‌ రేసింగ్‌. ఇవన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోగారు చేసే స్టంట్‌ షాట్స్. తమ ప్రతీ సినిమాలో ఇలా ఒకటైనా సీన్‌ ప్లాన్‌ చేసుకుంటారు. అయితే కాసులు కురిపించే ఈ సీన్లు ఇక ముందు...

Thursday, October 1, 2015 - 15:52

హైదరాబాద్ : వాటర్‌గ్రిడ్‌ పథకం రాష్ట్రంలోనే పెద్ద కుంభకోణమని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేతల జేబులు నింపుకోవడం కోసమే వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని చేపట్టారని విమర్శించారు. 30వేల కోట్ల విలువైన వాటర్‌గ్రిడ్‌ పథకంలో ఒకే కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు....

Thursday, October 1, 2015 - 14:29

హైదరాబాద్ : శాంతియుత పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం అప్రజస్వామికమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. అసెంబ్లీ గేట్ వద్ద ధర్నా చేసినందుకు గాను, అరెస్టయ్యి నాంపల్లి పీఎస్‌లో ఉన్న విపక్ష ఎమ్మెల్యేలను కలుసుకున్న ఆయన సమధానం చెప్పే దమ్ము తెలంగాణ సర్కార్‌కు లేకపోవటం సిగ్గు...

Thursday, October 1, 2015 - 13:30

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణ భవన్‌లో బంగారు బతుకమ్మ వాల్‌పోస్టర్ విడుదల చేసిన ఆమె జాగృతి ఆధ్వర్యంలో వరుసగా 9వ సారి బతుకమ్మ వేడుకలను నిర్వహించబోతున్నామని చెప్పారు. మహిళలు ఉద్యమంలోకి రావడం తక్కువగా ఉండేదని, అటువంటి సందర్భంలో...

Thursday, October 1, 2015 - 13:26

హైదరాబాద్ : చర్చకాదు రచ్చ చేయడమేలక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌.. రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం తాము చేస్తుంటే... అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.. రైతుల సంక్షేమం కోసం తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం విపక్షాలు అసెంబ్లీ గేట్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి...

Thursday, October 1, 2015 - 12:42

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏడు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని తీవ్రంగా విమర్శించారు. గురువారం ప్రారంభమైన సభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. దీనిపై ఆగ్రహించిన విపక్ష సభ్యులు అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద ఆందోళన చేశాయి. పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో...

Thursday, October 1, 2015 - 12:36

వరంగల్ : జిల్లాలో పసిపిల్లలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల్లో పది హేను మందిపై కుక్కలు దాడి చేయడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎస్వీ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఆడుకుంటున్న చరణ్ పై ఒక్కసారిగా ఐదారు కుక్కలు దాడి చేశాయి. శరీరాన్ని పీకాయి. దీనితో చరణ్ తీవ్రగాయాలకు లోనయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు శాయంపేట...

Thursday, October 1, 2015 - 12:31

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. రెండు నెలల్లో డిపాజిట్స్ కి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేసింది. గురువారం అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కేసు తీవ్రత ఎంతుందో తెలుసని వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని గతంలో హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే....

Thursday, October 1, 2015 - 12:24

నల్గొండ : జిల్లాలో సుమన్ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంగళవారం సాయంత్రం అపహరణకు గురైన ఆరేళ్ల విద్యార్థి ఆచూకి తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం బాలుడు కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. బొమ్మలరామారం మండలం నాయకుని తండాకు చెందిన ధీరావతు సుమన్ తన ఇద్దరు స్నేహితులతో వస్తున్నాడు. వచ్చిన కారును లిఫ్ట్ అడిగారు. అనంతరం కారులో వారు...

Thursday, October 1, 2015 - 11:11

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది..ఏడు నిమిషాల లోపే సభను వాయిదా వేస్తారా ? ఇది అన్యాయం అంటూ విపక్ష సభ్యులు పేర్కొంటున్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీనితో విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టారు. రైతు రుణమాఫీ.....

Thursday, October 1, 2015 - 10:49

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. సభ ప్రారంభం కాగానే ఐదు నిమిషాల తరువాత సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ వాయిదా అనంతరం ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రుణమాఫీ విషయం..రైతుల...

Thursday, October 1, 2015 - 10:37

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రారంభమైన ఐదు నిమిషాల అనంతరం సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించడంపై విపక్ష ఎమ్మెల్యేలు నోరెళ్లబెట్టారు. ఒక్కసారిగా సభ వాయిదా కావడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జానారెడ్డి సమక్షంలో విపక్ష ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే...

Thursday, October 1, 2015 - 10:14

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ పసికందును దుర్మార్గులు బావిలో పడేశారు. ఈ ఘటన భవానీనగర్ లో చోటు చేసుకుంది. 18 పోర్షన్ లో ఉన్న భవంతిలో ఓ ముగ్గురు సోదరులు నివాసం ఉంటున్నారు. సలీం కుటుంబానికి కుబ్రా అనే ఐదు నెలల చిన్నారి ఉంది. గురువారం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా పడుకున్న కుబ్రా కనిపించలేదు. దీనిని గమనించి తల్లి చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం కనబడలేదు....

Thursday, October 1, 2015 - 09:35

హైదరాబాద్ : రైతు రుణమాఫీ ని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యగా ఉన్న వ్యవసాయ సంక్షోభం..రైతుల బలవన్మరణాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందన్నారు. కానీ ఒక నిర్ధిష్ట ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోవడం దురదృష్టకరమన్నారు. పెట్టుబడుల సమకూర్పు లేకపోవడం...

Thursday, October 1, 2015 - 06:29

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో రెండవ రోజు కూడా రైతు సమస్యలపై చర్చ జరిగింది. అధికార పార్టీ తీరుపై... ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అసమర్థ పాలనతోనే... రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలోనూ రైతు, ప్రజా సమస్యలపై వాడీవేడీ చర్చ...

Thursday, October 1, 2015 - 06:26

హైదరాబాద్ : ఛలో అసెంబ్లీ నేపథ్యంలో ఓయూ విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వర్సిటీకి చెందిన విద్యార్థి మహేష్‌ను పోలీసులు ఛలో అసెంబ్లీ ముందురోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిగతా విద్యార్థులను వదిలేసినప్పటికీ మహేష్‌ను మాత్రం విడుదల చేయలేదు. మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ముందుగా అఫ్జల్ గంజ్‌ పోలీసుస్టేషన్‌ తరలించి, అక్కడి నుంచి...

Thursday, October 1, 2015 - 06:16

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రైతు సమస్యలపై వాడివేడి చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని నిరసిస్తూ.. ప్రతిపక్ష సభ్యులు సభలోనే రాత్రివరకూ బైఠాయించారు. సభ వాయిదా పడ్డా.. సభ్యలు అసెంబ్లీలోనే ఉండడంతో మార్షల్స్‌ వారిని బలవంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. రైతు రుణమాఫీపై స్పష్టత...

Wednesday, September 30, 2015 - 21:22

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రేపటి వాయిదా పడింది. ఇవాళ రైతు సమస్యలపై శాసనసభలో వాడీవేడీ చర్చ సాగింది. రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ స్పందించే వరకు సభలోనే ఉంటామని టీ-కాంగ్రెస్, టీడీపీ...

Wednesday, September 30, 2015 - 21:20

హైదరాబాద్ : వాళ్లేమీ దోపిడీలు చేయలేదు.. అయినా బంధించారు..! దౌర్జన్యానికి పాల్పడలేదు.. అయినా అరెస్టులు చేశారు..! తుపాకులు చేతబట్టలేదు.. మారణాయుధాలతో విధ్వంసాలు సృష్టించలేదు..! వారు చేసిన తప్పల్లా.. న్యాయం చేయాలని నినదించడమే..! దీన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోయింది. ప్రజా ఉద్యమాన్ని భరించలేకపోయింది. న్యాయం అడిగిన గొంతు నొక్కేసింది..! నిరసన తెలిపే స్వేచ్ఛను...

Wednesday, September 30, 2015 - 19:50

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చసాగుతోంది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కౌంటర్‌ వేస్తే...దానికి ప్రతికౌంటర్‌ ఇస్తూ ప్రతిపక్షాలు సభను వేడెక్కిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్‌రావు సభలో ప్రస్తావించినప్పుడు బీజేపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...

Wednesday, September 30, 2015 - 19:46

ఖమ్మం : సత్తుపల్లిలో కొండచిలువ కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి 10 అడుగుల కొండచిలువ వెంగళరావు నగర్‌ నివాస ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలనీ వాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు.. గంట సేపు కుస్తీ పట్టి కొండచిలువను పట్టుకున్నారు.

Wednesday, September 30, 2015 - 17:45

మెదక్ : తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఓ రైతు అప్పుల బాధతాళలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన పద్మా రెడ్డి అనే రైతు కరువుతో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన పద్మారెడ్డి తన పొలానికి వెళ్లి పరుగుల మందు తీసుకున్నాడు. వెంటనే ఆస్పత్రి...

Wednesday, September 30, 2015 - 17:43

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి రెండు నెలల్లో విద్యుత్‌ను తీసుకొస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్‌...ఏడాదిన్నర అయినా ఇప్పటివరకు విద్యుత్‌ తేలేదని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించినప్పుడు రైతు సంతోషంగా ఉంటాడని అసెంబ్లీలో చర్చ సందర్బంగా అన్నారు. సబ్సీడి కింద ఎరువులను పంపిణీ చేయాలని ఎర్రబెల్లి...

Wednesday, September 30, 2015 - 17:41

హైదరాబాద్ : రైతు రుణమాఫీ అంతా గందరగోళంగా తయారైందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్న రైతుకు...రుణమాఫీ వర్తించినా..లక్షకుపైన ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జానారెడ్డి అన్నారు. లక్షకుపైన రుణం తీసుకున్న రైతుకు వడ్డీ అధికమై ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

 

Wednesday, September 30, 2015 - 16:50

హైదరాబాద్ : వామపక్షాలు, ప్రజాసంఘాలపై తెలంగాణ సర్కారు.. నిర్బంధాన్ని ప్రయోగించడంపై ప్రొఫెసర్ హరగోపాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన బుధవారం 'టెన్ టివి'తో మాట్లాడుతూ...బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించిన ఆయన.. నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం.. ఎన్‌కౌంటర్లతో పరిపాలన కొనసాగించడం మంచిది కాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలన్నారు. మరిన్ని...

Wednesday, September 30, 2015 - 16:47

హైదరాబాద్ : గత 58 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, విద్యుత్‌ విషయంతో తీవ్ర వివక్షకు గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందువల్లే తెలంగాణలో దుర్బిక్షంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వచ్చే మార్చి నుంచి ఆరునూరైనా రైతులకు 9గంటల పగటిపూట విద్యుత్‌ను అందిస్తామని శాసనసభలో ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం పూర్తిగా...

Wednesday, September 30, 2015 - 16:09

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రంలో తమది కన్నతల్లి పాత్రని... కాంగ్రెస్‌ది కాన్పు చేసే మంత్రసాని పాత్రని ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీ-కాంగ్రెస్ సభ్యులు రసమయి వ్యాఖ్యలపై అభ్యతరం తెలిపారు. తక్షణమే...

Pages

Don't Miss